నేటి తారీఖు జూన్ 30
క్రీ.శ 1555 జూన్ 30 నాటి గొల్లల వుప్పలపాడు (కడప జిల్లా)శాసనంలో సదాశివరాయల పాలనలో శ్రీమన్మహామండలేశ్వర నందేల తిమ్మయదేవ మహారాజులవారి దళి (?)నారప్ప గొల్లల వుప్పలపాటి చెంన్న కేశవ పెరుమాళ్ళ డోలు నాగసారాలు వూళిగం సేసేటందుకు మాన్యం యిచ్చినట్లుగా చెప్పబడ్డది. [కడప జిల్లా శాసనాలు II నెం. 244].
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణా కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.