నేటి తేదీ జూన్ 26
తిథి జేష్ఠ బహుళ విదియ. నేటి తారీఖుమీద తెలుగు శాసనమేదీ లభించలేదు కానీ శక 1436 (క్రీ.శ 1514) భావ నామ సంవత్సర జేష్ఠ బహుళ విదియ నాటి శ్రీకృష్ణ దేవరాయల ఉదయగిరి శాసనంలో శ్రీకృష్ణ దేవరాయలు ఉదయగిరిని జయించి ప్రతాపరుద్రగజపతిని కొండవీటి దాకా “ఇరగబొడిచి” వారి పినతండ్రి తిరుమల కాంత రాయని పట్టుకొని తిరిగి ఉదయగిరికి విచ్చేసి, కోనవల్లభరాయని పూజా పురస్కారాలకి నైవేద్యాలకి సర్వభోగాలకు నెల్లూరుసీమలోని శీకల్లు గ్రామాన్ని యిచ్చినట్లుగా చెప్పబడ్డది.[నెల్లూరు జిల్లా శాసనాలు III ఉదయగిరి 40].
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణా కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.