‘దేశాల్ని ఏలినా… దిక్కుల్ని గెలిచినా బుక్కునా కనకము బువ్వ తప్ప’ అంటూ ఎంతో అపురూపంగా సేద్యగాడి చెమటతో పుట్టించే అన్నంపై, ఆరుగాలం శ్రమించే ఆ అన్నదాత ఔన్నత్యంపై నేటి ఏరువాక పున్నమి సందర్భంగా తెలుపు అందిస్తున్న మహోన్నత పద్యం ఇది. రచన శ్రీ గంటేడ గౌరునాయుడు. గానం శ్రీ కోట పురుషోత్తం. విని ఆ రైతాంగానికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకుందాం.
నమస్సులతో…
సాహిత్య ప్రక్రియలో విశిష్టమైన పద్య ప్రశస్తిని గుర్తించిన కోట పురుషోత్తం తిరుపతి నివాసి. వారు రాగయుక్తంగా ఆయా పద్యాలను ఆలపిస్తూ విద్యార్థుల మనసులో నాటుకునేలా చేయడంలో విశేష అనుభవం గడించారు. సులభంగా తాత్పర్యం బోధపడేలా ఉండే అనేక పద్యాలను వారు ఎంచుకుని, కొందరితో రాయించి మరీ వాటిని తానొక నిధిగా సమకూర్చుకున్నారు. నిజానికి వారు పద్యం కోసమే కదలడం జీవన శైలిగా చేసుకోవడం విశేషం. పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే కొన్ని వేల మంది బాలబాలికలు, యువతీ యువకుల్లో పద్యం పట్ల ఆసక్తిని రగిల్చిన వారు ‘తెలుపు’ కోసం ఈ శీర్షిక నిర్వహిస్తారు.
Gantedi gowrunaidu books ekkda available ga unntaii sir…I want to buy to boks..