పంట చేల గట్ల మీద నడవాలి
ఊహలేమో రెక్కలొచ్చి ఎగరాలి
ఆటలతో బ్రతుకంతా గడపాలి
మా ఊరు ఒక్క సారి పోయి రావాలి … చూసి రావాలి.వయ్యారి నడకలతో ఓ ఏరు
ఏరు దాటి సాగితే మా ఊరు…
ఎంతో శ్రావ్యంగా జనగామకు చెందిన వి. వసంత గారు పాడి పంపిన ఈ పాట తెలుపు మీతో సంతోషంగా పంచుకుంటోంది.
ఈ పాటలో ఊరికి వెళ్ళాలనే కాదు, అమ్మా నాన్నలను కలవాలన్న సందేశమూ ఉన్నది. అది వింటూ ఉంటే ఇది కేవలం పాట కాదు, మరుపున పడ్డ మన స్మృతులను గుర్తు చేసి తిరిగి నూతనోత్సాహంతో ముందుకు సాగమనే పూల బాటగా అనిపిస్తుంది.
వృత్తి రీత్యా వసంత గారు యశ్వంతాపూర్ లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. పాడి హృదయాలను శుభ్రపరచడం వారి ప్రవృత్తి. తమ సేకరణలో ఇలాంటి ఎన్నో మధురమైన పాటలున్నాయి. వాటిని ముందు ముందు మీతో పంచుకుంటారు.
వసంత గారి గాత్రంలో పాటనే మైమరచిపోతుంటే ఇక శ్రోతలుగా ఇక మాసంగతి వేరే చెప్పాలా!!?? మనందరినీ ప్రేమతో వారి ఊరికి ఆహ్వానించి దగ్గరుండి వాళ్ళ ఊరు..స్నేహితులు..పొలాలు.. అమ్మానాన్న అందరినీ చూపించి పుణ్యం కట్టుకున్నారు.. సంగీతవాయిద్యాలు తాండవించే స్వరం వసంతగారికి దైవదత్తంగా వచ్చాయి అని ఈ పాట విన్నాక అందరికీ అర్ధమయ్యే ఉంటుంది.. ఆమె నిష్కల్మషమైన మనసు.. నిస్స్వార్థత కూడా ప్రతిపాటలో అంతర్లీనంగా శ్రోతలకు కనిపిస్తోంది.. స్టూడియోలో రికార్డ్ చేయడం మూలన సంగీతం కన్నా వసంతగారి స్వరంలో సాహిత్యం మురిసిమెరిసిందనే చెప్పాలి.. మృధుమధురంగా తన్మయత్వంతో పాడటం వసంతగారికి వెన్నతో పెట్టిన విద్య.. వారిలాంటి మరిన్ని చక్కని గీతాలతోశ్రోతల్ని, అభిమానుల్ని అలరించాలని మనసారా కోరుకుంటూ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను…
డాక్టర్ మిత్ర, తిరుపతి
మధురమైన భావాలతో.. అతి మధుర ఫలాలను సుస్వరం నుంచి వింటుంటే…మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తున్నది…మనసుకు సుస్వరం ప్రాణవాయువైతే….భావం చిరునామా అవుతుంది కదా….ఇంకా ఇంకా ఇలాంటివి వసంత గారి గళం నుంచి వినాలని ఆశ…..ధన్యవాదములు. తెలియజేస్తాన్నాను………వాసుదేవ మూర్తి..హైద్రాబాద్
మీరు నాపై చూపిన ఈ ప్రేమాభిమానాలు కలకాలం ఈలాగే ఉండాలని కోరుకుంటూ చక్కని ప్రశంసలు అందచేసి నాలో కొత్త ఉత్సాహాన్ని నింపిన మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు
మీరు నాపై చూపిన ఈ ప్రేమాభిమానాలు కలకాలం ఈలాగే ఉండాలని కోరుకుంటూ చక్కని ప్రశంసలు అందచేసి నాలో కొత్త ఉత్సాహాన్ని నింపిన మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు
chaala bhavaatmakanga undi paata.
చాలా బాగా పాడారు ….అద్భుతం👌👏👏