నేడు తేదీ జూన్ 17
క్రీ.శ. 1320 జూన్ 17 వ తేదీన యివ్వబడిన అఱలూరు (అల్లూరు,ప్రకాశంజిల్లా) శాసనంలో కాకతీయ ప్రతాప రుద్రునికాలంలో శ్రీమతు బామయనాయనింగారు అఱలూరు ఇష్టకామేశ్వరదేవరకు…వ్రిత్తికి 400 గుంటలు, అర్చన వ్రిత్తికి 100 గుంటలు, దీపానికి 50 గుంటల భూములనిచ్చినట్లుగా చెప్పబడ్డది. [నెల్లూరు జిల్లా శాసనాలు II ong.10]
క్రీ.శ 1586 జూన్ 17 నాటి ఉదయగిరి శాసనంలో వీర వెంకటపతిరాయదేవ మహారాజులు పాలిస్తుండగా వారి కార్యకర్తలైన వెంకట పిన్నయనాయనింగారు ఉదయగిరి శ్రీ రఘునాయకులకు ఉదయగిరి రాజ్యంలో “ప్రనవవిశికర” గ్రామంలో చెరువు త్రవ్వించి, ఆ గ్రామ స్వామి తోపుతిరణాళ్ళ మమహోత్సవాలకు స్వామివారి ప్రతిష్ఠా కాలమందు సమర్పించినట్లు చెప్పబడ్డది. [నెల్లూరు జిల్లా శాసనాలు III Udayagiri 24].
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్య కుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణా కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.