అవని యంత వెతికిన గానీ… అమ్మ ప్రేమ దొరకదు రా…
ఎన్ని జన్మలెత్తిన గానీ అమ్మ రుణం తీరదురా…
కోరుట్లకు చెందిన తోటపల్లి కైలాసం కవి, గాయకులు, తెలంగాణ ఉద్యమకారులు. ఉద్యమించినంతనే అందరి జీవితాలు బాగు పడలేదని వారికి తెలుసు. ఉద్యమ కారుడిగా తన వంతు బాధ్యత నిర్వర్తించిన తృప్తి చాలనుకుని, కడుపు తిప్పలు కోసం తిరిగి లేబర్ పనిలోకి దిగాడు. పొట్ట పోసుకోవడం కోసం గల్ఫ్ కి (ఇరాక్) వెళ్ళక తప్పలేదు.
ఎక్కడున్నా కన్న తల్లిని మరచిపోకూడదని, అవని యంత వెతికినా గానీ అమ్మ ప్రేమ దొరకదని…గుండె గొంతులో కొట్లాడగా రాసి పాడిన పాట ఇది. విన్న ప్రతి బిడ్డ కళ్ళు చెమర్చే ఈ పాట అమ్మలను అలక్ష్యం చేసే బిడ్డలకే కాదు, ఉద్యమ తల్లిని కాదని స్వప్రయోజనాలు చూసుకునే వారిని ఆత్మ విమర్శ చేసుకోమని చెప్పకనే చెబుతుంది.
అవని యంత వెతికిన గానీ… అమ్మ ప్రేమ దొరకదు రా…
ఎన్ని జన్మలెత్తిన గానీ అమ్మ రుణం తీరదురా…
నిజంగా ఎన్ని జన్మలెత్తిన గానీ అమ్మ రుణం తీరదు అన్నయ్య 🙏🙏🙏
ఛాలా బాగుంది అమ్మ పాట 🤝🙏🙏🙏🙏🙏