పిల్లల మోముల్లో ‘గుల్ మొహర్’ నవ్వులు
ఒక కవి అన్నట్టు ‘చీకటి కాలంలో పాటలుండవా?’ అని అడిగితే ‘చీకటి పాటలే ఉంటా’యని సమాధానమిస్తారు. కానీ, నిరాశామయ మహమ్మారి కాలంలో సంతోషపు పాటలూ ఉంటాయని కొందరు నిరూపిస్తున్నారు.
కరోనా మహమ్మారి యావత్ ప్రజల ఆరోగ్యాన్ని, ఆనందాన్ని హరించి వేస్తున్న తరుణంలో పేద ప్రజలు మరింత పేదలుగా మారిపోవడం మనం చూస్తున్నదే. రెక్కాడితే గాని డొక్కాడని ప్రజలు అనేక విధాలుగా తల్లడిల్లడం అందరి దృష్టిలో ఉన్నదే. ఐతే, ఎక్కడికక్కడ ఆహరం, మందులు మొదలగు కనీస అవసరాలు అందించడంలో అనేక మంది వారి మంచి మనసును చాటుకుంటూనే ఉన్నారు. అందులో అత్యధికులు ఎటువంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా తమకు తోచిన విధంగా సహాయం చేస్తుండటం విశేషం. ఒకరిని చూసి మరొకరు తమ దాతృ హృదయాన్ని చాటుతూనే ఉన్నారు. కొందరు ఆకలి తీరుస్తుండగా మరికొందరు ఆనందం పంచుతున్నారు. హైదరాబాద్ లోని వినాయక్ నగర్ కాలనీలోని గుల్ మొహర్ అపార్ట్మెంట్ వాసులు సమీప బస్తీల్లో నివసించే భవన నిర్మాణ కూలీలకు ఆహారం అందిస్తుండగా అదే అపార్ట్ మెంట్ లోని 107 ఫ్లాట్ నివాసి శ్రవణ్ రెడ్డి పిల్లలకు ఆట బొమ్మలు అందించి పలువురికి స్పూర్తినివ్వడం విశేషం.
హైదరాబాద్ లోని వినాయక్ నగర్ కాలనీలోని గుల్ మొహర్ అపార్ట్మెంట్ వాసులు సమీప బస్తీల్లో నివసించే భవన నిర్మాణ కూలీలకు ఆహారం అందిస్తుండగా అదే అపార్ట్ మెంట్ లోని 107 ఫ్లాట్ నివాసి శ్రవణ్ రెడ్డి పిల్లలకు ఆట బొమ్మలు అందించి పలువురికి స్పూర్తినివ్వడం విశేషం.
కరోనా కాలంలో ఆకలికి తాళలేని పేగులకు స్వాంతన నివ్వడం ఎంత ముఖ్యమో పసి హృదయాలను ఉల్లాస పరిచి, వారి మోముల్లో సంతోషం విరబూసేలా చేయడం అంతే ముఖ్యం.
ఈ సందర్భంగా గుల్ మొహర్ వాసులకు అభినందనలు. పట్నం పల్లెల్లో ఇలా చేయూత నిస్తున్న వారందరికీ పేరుపేరునా అభివందనాలు.
మంచి ఆలోచన