Editorial

Sunday, November 24, 2024
శాసనంనాటి సావిశెట్టిపల్లి శాసనం తెలియజేయునది ఏమనగా....

నాటి సావిశెట్టిపల్లి శాసనం తెలియజేయునది ఏమనగా….

Epigraph

నేడు తారీఖు జూన్ 11

క్రీ.శ 1591 జూన్ 11 నాటి సావిశెట్టిపల్లి (కడప జిల్లా) శాసనంలో వెంకటపతిరాయ దేవ మహారాయలు అయ్యవారు రాజ్యంచేస్తుండగా మహామండలేశ్వర నందేల అవుబళ్రాజు ఘండికోట సీమ పాలకుడుగా నుండగా మహామండలేశ్వర తిమ్మరాజుగారి పోతిరాజుగారు గోపీనాథ పట్నం ఏలుతుండగా ఓబిళనాయని కుమారుడు పెద్దగురవయ్యగారు కోడిగుడ్లపాడులో యిద్దూము చేను యిచ్చినట్లుగా చెప్పబడ్డది. దానశాసనం శిధిలమైనందున దానగ్రహీత పేరు తెలియరావడంలేదు. [కడప జిల్లా శాసనాలు II నెం 112].

శీర్షిక నిర్వాహకుల పరిచయం

డా. దామరాజు సూర్య కుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణా కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article