Editorial

Sunday, November 24, 2024
శాసనంకొత్తపల్లి శాసనం

కొత్తపల్లి శాసనం

Epigraph

నేడు తేదీ జూన్ 10

తిథి వైశాఖ (మాధవమాసం) అమావాస్య.

శక సంవత్సరం 1173 విరోధికృత్ (క్రీ.శ. 1251) వైశాఖ అమావాస్య రోజున యివ్వబడిన కొత్తపల్లి (నల్లగొండ జిల్లా) శాసనంలో కాకతీయ గణపతిదేవుని కాలంలో కాయస్థ గంగయసాహిణి తమ తల్లిదండ్రులకు పుణ్యంగా మణిమేఖలతీర్థంలో(?)ని విష్ణు నృసింహ దైత్యసూద దేవరల పూజా పునస్కారాలకై స్థానాపతియైన మునిదామ యతీంద్రునికి కొత్తపల్లి గ్రామాన్ని ధారవోసియిచ్చినట్లుగా చెప్పబడ్డది. [నల్లగొండ జిల్లా శాసనాలు I నెం. 70].(గమనిక- మే.22 నాడు కూడా తారీఖు ప్రకారం ఈ శాసనాన్ని ప్రస్తావించడం జరిగింది)

శీర్షిక నిర్వాహకుల పరిచయం

డా. దామరాజు సూర్య కుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణా కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article