కొందరు సినిమాలను ఇష్టపడుతారు. వారు ప్రేక్షకులు. మరికొందరు తారలను ఆరాధిస్తారు. వారు అభిమానులు. ఇంకొందరైతే సినిమాలే జీవితంగా బతుకుతారు. ఇలాంటివారిలో మొదటగా పేర్కొనదగిన చలన చిత్ర నిర్మాత, దివంగత దగ్గుబాటి రామానాయుడు.
రామానాయుడి పేరు చెప్పగానే ఉత్తమాభిరుచితో కమర్షియల్ సినిమాలు తీసి సగటు ప్రేక్షకుని మెప్పించిన నిర్మాత మనకు గుర్తొస్తారు. తెలుగు సినిమా రంగంలో బాక్సాఫీసు వద్ద కనుక వర్షం కురిపించిన రాముడు భీముడు, శ్రీకృష్ణ తులాభారం, ప్రేమ నగర్, జీవన తరంగాలు, సోగ్గాడు, దేవత, కలియుగ పాండవులు, ఆహ నా పెళ్ళంట …ఇలా చాలా సినిమాలు వెంటనే గుర్తొస్తాయి. ఆయన సినిమాలలో నటించని హీరో, హీరోయిన్ లేదంటే అది అతిశయోక్తి కాదు.
దక్షిణ భారత చలన చిత్ర చరిత్రలో ఎవిఎం, మోడరన్, జెమినీ, విజయ వాహిని, పక్షిరాజా వంటి ప్రసిద్ద చలన చిత్ర నిర్మాణ సంస్థల తర్వాత ప్రారంభమైన సురేష్ ప్రొడక్షన్స్, వాటికి మించి రాశిలో, వాసిలో సినిమాలు తెసిన పెద్ద నిర్మాత రామానాయుడు. పై వాటిలో దాదాపుగా అన్ని సంస్థలూ మూతబడిపోయినవి. కానీ ఒక్క రామా నాయుడు సురేష్ ప్రొడక్షన్స్ మారుతున్న కాలానికి అనుగుణంగా ఏ తరానికి ఆ తరాన్ని ఆకట్టుకునే సినిమాలు తీస్తున్న ఏకైక సంస్థ.
పద్మభూషణ్ తో పాటు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత ఐన రామానాయుడు జయంతి నేడు. వారి స్మృతిలో ప్రత్యేక వ్యాసం త్వరలో…