Editorial

Friday, November 22, 2024
ARTSసాగర సంగమం - నేటి కళాఖండం

సాగర సంగమం – నేటి కళాఖండం

sagara sangamam

కే.విశ్వనాధ్ , ఏడిద నాగేశ్వరరావు, కమలహాసన్ ల కలయికలో పూర్ణోదయా పతాకంపై నిర్మిచించిన ప్రతిష్టాత్మక కళాత్మక చిత్రం ‘సాగర సంగమం’. ఈ చిత్రం జూన్ 3, 1983 న తెలుగులో ‘సాగర సంగమం’, తమిళంలో ‘సలంగై ఓలి’, మలయాళంలో ‘సాగర సంగమం’గా ఒకే రోజు విడుదల అయ్యాయి. అన్ని భాషల్లో ఆఖండ విజయం సాధించింది. నేటి మేటి దర్శకులెందరికో స్ఫూర్తి ఈ చిత్రం.

sagara sangamamశంకరాభరణం అంతటి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన చిత్రం తరువాత అదే కాంబినేషన్ అయిన కే.విశ్వనాథ్ – ఏడిద నాగేశ్వరరావు కలయికలో వచ్చిన మరో సంచలన కళాఖండం – సాగర సంగమం.

భారత చలనచిత్ర 100 సంవత్సరాలు సందర్భంగా CNN-IBNs List of the 100 Greatest Indian Films of All Time లో ఈ చిత్రం 13 వ స్థానం దక్కించుకుంది. అలాగే రష్యన్ భాషలోకి అనువదించి అక్కడి 400 థియేటర్లలో ఒకే సారి విడుదలయ్యి వారి అభిమానాన్ని కూడా పొందిన మొట్ట మొదటి తెలుగు చిత్రం ఇది. ఈ చిత్రం శతదినోత్సవం తో పాటు ఎన్నో కేంద్రాలలో సిల్వర్ జూబిలీ , గోల్డెన్ జూబిలీ కూడా జరుపుకుంది. బెంగుళూరు లో 511 రోజులు ఒకే థియేటర్ లో ప్రదర్శింపబడ్డ చిత్రం సాగర సంగమం.

ఈ చిత్రం విడుదలయ్యాక చాలా మంది శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడానికి డాన్స్ క్లాసులకి వెళ్లేవారనడం అతిశయోక్తి కాదు. ఇప్పటికీ లోక నాయకుడు కమలహాసన్ తనకు బాగా నచ్చిన చిత్రాల్లో సాగర సంగమం పేరే ముందుంటది.

classical dance recital by sri bala krishna

కళా తపస్వి శ్రీ కే.విశ్వనాధ్ దర్శక త్వ ప్రతిభ ప్రతీ సన్నివేశంలో మనకు కనబడుతుంది. ముఖ్యగా ఈ సన్నివేశం మీకు గుర్తుందా? ఇన్విటేషన్ లో తన పేరు చూసుకున్న సన్నివేశం…

i

ఇక ఇళయరాజా సంగీతం … ఈ చిత్రానికి ఓ హై లైట్ . ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. అలాగే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా వైవిధ్యంగా కుదిరింది . అప్పటికే ఎన్నో తమిళ సినిమాలకు సూపర్ హిట్ మ్యూజిక్ అందించి ఓ ట్రెండ్ సెట్ చేసిన ఇళయరాజాకు మొట్ట మొదటి సారి ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ బహుమతి ఇచ్చిన చిత్రం సాగర సంగమమే. అలాగే ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంకీ ఉత్తమ గాయకునిగా జాతీయ అవార్డు. జంధ్యాల మాటలు, వేటూరి పాటలు, నివాస్ ఫోటోగ్రఫీ, తోట తరణి కళా దర్శకత్వం ఇంకా ఎందరో ప్రతిభావంతుల కలయికే ఈ చిత్రాన్ని all time classic గా రూపుదిద్దింది.

kamal

ఈ చిత్ర శతదినోత్సవానికి హిందీ అగ్ర నటులు రాజకపూర్, సునీల్ దత్ & రాజేంద్ర కుమార్ గార్లు ముఖ్య అతిధులుగా విచ్చేసి సాగర సంగమం గురించి ఎంతో గొప్పగా విశ్లేషించారు. కమలహాసన్ నూతి మీద డాన్స్ చేసే ‘తకిట -తధిమి’ పాట, జయప్రదతో కలిసి చేసే ‘నాద వినోదము’ క్లైమాక్స్ లో వచ్చే ‘వేదం అణువణువున’ పాటల్లో కమలహాసన్ చేసిన క్లాసికల్ డాన్సులు ఇప్పటికీ మనకి ఓ కొత్త అనుభూతినిస్తాయి .

అలాగే మౌనమేలనోయి పాటలో జయప్రద చూపిన హావభావాలు, ఎస్.పి. శైలజ నటన ఈ చిత్రానికి మరో ప్రత్యేకత.

సిరి సిరి మువ్వ, శంకరాభరణం తరువాత ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన మరో కళాత్మక దృశ్య కావ్యం సాగరసంగమం. కాగా, కళకు అంతం లేదు అనే భావన కలిగేందుకే ఈ చిత్రం చివర్లో “ NO END FOR ANY ART “ అని వేయడం మీకు గుర్తుండే ఉంటుంది.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article