Editorial

Sunday, November 24, 2024
స్మరణజయంతి‘ప్రజాయుద్ధ శతఘ్ని’కి పురస్కారం : బోవేరా జయంతి ఉత్సవాలకు ఆహ్వానం

‘ప్రజాయుద్ధ శతఘ్ని’కి పురస్కారం : బోవేరా జయంతి ఉత్సవాలకు ఆహ్వానం

బోయినపల్లి వేంకట రామారావు గారి జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా ఒక విశిష్ఠ వ్యక్తిచే స్మారకోపన్యాసం, సామాజిక సాంస్కృతిక రంగంలో విశేష సేవలు అందిస్తున్న కవిగాయకులకు ‘బోవేరా’ పురస్కారాన్ని ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడు సెప్టెంబర్ రెండున విమలక్క పురస్కారం అందుకుంటుండగా దేవులపల్లి అమర్ గారు స్మారకోపన్యాసం చేస్తున్నారు. అందరికీ ఆహ్వానం.

విమలక్క

ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు, సంస్కరణ వాది, సాహితీ వేత్త, సర్వోదయ నాయకులు, కరీంనగర్ గాంధీగా, విశ్వబంధుగా పేరొందిన శ్రీ బోయినపల్లి వేంకట రామారావు గారి 103 వ జయంతి ఉత్సవాలు సెప్టెంబర్ 2 వ తేదీన జరుగనున్నాయి. వారి స్మారకంగా ఏర్పాటు చేసిన సారస్వత జ్యోతి మిత్రమండలి స్థాపనా దినోత్సవం కూడా ఇదే రోజు కావడం విశేషం. ఈ విశిష్ట దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘బోవేరా’గా అందరం ఆత్మీయంగా పిలుచుకునే బోయినపల్లి వేంకట రామారావు గారి స్మారకోపన్యాసం ప్రముఖ జర్నలిస్ట్ నేత, అంధ్రప్రదేశ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారులైన శ్రీ దేవులపల్లి అమర్ గారు ఇస్తున్నారు.

దేవులపల్లి అమర్

అలాగే, బోవేరా కవితా పురస్కారాన్నిప్రసిద్ధ వాగ్గేయ కారిణి, ‘ప్రజాయుద్ధ శతఘ్ని’ విమలక్కకు ప్రధానం చేస్తున్నారు. ఈ వేడుక కరీంనగర్ లోని బీట్ రోడ్ లో ఉన్న భోవేరా భవన్ లో శినివారం మధ్యాహ్నం రెండు గంటలకు ఉంటుందని వారి కుమారులు శ్రీ బోయినపల్లి హనుమంతరావు సాదర ఆహ్వానం పలుకుతున్నారు.

టంకశాల అశోక్

ఈ వేడుకకు శాసన మండలి సభ్యులు శ్రీ సిరికొండ మధుసూధనా చారి గారు సభాధ్యక్షత వహించనుండగా ముఖ్య అతిథిగా శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ప్రొ. సంకశాల మల్లేష్ గారు వస్తున్నారు.

కొప్పుల ఈశ్వర్

విశిష్ఠ అతిథులుగా ప్రభుత్వ సాంఘిక, మైనార్టీ సంక్షేమ శాఖా మాత్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు హాజరవుతున్నారు. ప్రత్యేక అతిథులుగా ప్రభుత్వ సలహా దారులు శ్రీ టంకశాల అశోక్ గారు, కరీంనగర్ మున్సిపల్ కార్పొ రేషన్ మేయర్ శ్రీ యాదగిరి సునీల్ రావుగారు హాజరవుతున్నారు. గౌరవ అతిథులుగా తెలంగాణా స్వాతంత్ర్య సమార యోధుల సంఘం అధ్యక్షులు శ్రీ వున్నం వెంకయ్య గారు వెంచేస్తున్నారు.

బోవేరా జయంతి వేడుకల్లో ఒక విశిష్ఠ వ్యక్తిచే ప్రతి ఏడూ ఒక స్మారకోపన్యాసం, సామాజిక సాంస్కృతిక రంగంలో విశేష సేవలు అందిస్తున్న కవిగాయకులకు బోవేరా పురస్కారాన్ని ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.

రామచంద్రమూర్తి

గతంలో సీనియర్ ఎడిటర్ రామచంద్రమూర్తి గారు తొలి స్మారకోపన్యాసం చేయగా వాగ్గేయ కారులు గోరటి వెంకన్నకు పురస్కారం ప్రకటించారు. తర్వాత మాజీ టిపిఎస్ సి చైర్మెన్ ఘంటా చక్రపాణి గారు ప్రసంగించగా ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ గారికి పురస్కారం ఇచ్చారు.

గూడ అంజన్న

ఆ తర్వాత వరసగా ఆంధ్రజ్యోతి సంపాదకులు కె శ్రీనివాస్ మాట్లాడగా ‘ఊరు మనదిరా’ అంటూ ఎల్లకాలం మన ఆరాటాలను పోరాటాలని గుర్తు చేసే ప్రజా కవి గూడ అంజన్న పురస్కార గ్రహీత. పిదప తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ (గురుకులాల) మాజీ కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉపన్యసించగా ‘జంగ్ సైరన్’ జయరాజ్ గారు పురస్కారం అందుకున్నారు. గత ఏడు ప్రెస్ అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ గారు స్మారకోపన్యాసం చేయగా ‘వందేళ్ళ మా ఊరు’ కవి గాయకులు వరంగల్ శ్రీనివాస్ గారు పురస్కారాన్ని స్వకరించారు.

ఈ ఏడు దేవులపల్లి అమర్ గారి స్మారకోపన్యాసం ఏర్పాటు చేయగా తన ఆటా పాటలతో తెలంగాణ సకల జనులను తట్టి లేపుతున్న ‘ప్రజాయుద్ధ శతఘ్ని’కి పురస్కారం అందిస్తున్నారు.

బోయినపల్లి హనుమంతరావు

ఈ ఏడు శనివారం సెప్టెంబర్ 2 న జరిగే జయంతి వేడుకల్లో దేవులపల్లి అమర్ గారి చేత స్మారకోపన్యాసం ఏర్పాటు చేశారు. తన ఆటా పాటలతో తెలంగాణ సకల జనులను తట్టి లేపుతున్న ‘ప్రజాయుద్ధ శతఘ్ని’ విమలక్క పురస్కారం పొందుతున్నారు. ఈ కార్యక్రమానికి తప్పక హాజరు కావలసిందిగా బోవేరా సంస్థల అధ్యక్షులు శ్రీ బోయినపల్లి హనుమంతరావు సవినయంగా ఆహ్వానం పలుకుతున్నారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article