వేడి వేడిగా హైదరాబాదీ జీఎస్టీ ధమ్ బిర్యానీ ఎలా రెడీ చేయాలో చదవండి. ఈ జీఎస్టీ బిర్యానీ మీకు నచ్చినట్లయితే లైకులు, కామెంట్ల రూపంలో స్పందించండి. ఎలాంటి జీఎస్టీ వర్తించదు.
భాయ్ జాన్
హాయ్.. నేటి వంటల కార్యక్రమానికి స్వాగతం.. ఈ రోజు హైదరాబాదీ చికెన్ జీఎస్టీ ధమ్ బిర్యానీ ఎలా చేయాలో తెల్సుకుందాం…
ముందుగా 12 శాతం జీఎస్టీ పెట్టి కొన్న స్టీల్ పాత్రలో.. 5 శాతం జీఎస్టీ వేసిన ప్యాకేజ్డ్ చికెన్ ఒక కేజి తీసుకోవాలి. అందులో 5 శాతం జీఎస్టీ వేసిన పెరుగు, కారం, నిమ్మకాయ, జీఎస్టీ వేసిన అల్లం, జీఎస్టీ వేసిన గరం మసాలా, జీఎస్టీ కట్టి మరీ కొన్న నెయ్యి, ప్రస్తుతానికి జీఎస్టీ లేని ఉల్లిగడ్డ ముక్కల ప్రై వేసి కలుపుకోవాలి. దాన్ని 28 శాతం జీఎస్టీ పెట్టి కొన్న రిఫ్రిజిరేటర్‌లో పెట్టండి.
ఇక 12 శాతం జీఎస్టీ వేసిన అల్యూమినియం పాత్రను తీసుకొని దాన్ని 18 శాతం జీఎస్టీ చెల్లించి కొన్న స్టౌ మీద పెట్టండి. రూ. 1150 పెట్టి కొన్న గ్యాస్ సిలిండర్‌ను ఆన్ చేసి 18 శాతం జీఎస్టీ చెల్లించి కొన్న లైటర్‌తో గానీ, 12 శాతం జీఎస్టీ చెల్లించి కొన్న అగ్గిపెట్టెతో కానీ వెలిగించండి.
సన్నన్ని సెగపై ఒక 40 నుంచి 50 నిమిషాలు వండుకోండి. టైం తెలుసుకోవడానికి మీరు 28 శాతం జీఎస్టీ పెట్టి కొన్న వాచ్‌ను ఉపయోగించండి.
ఇందులో ప్రస్తుతానికి జీహెచ్ఎంసీ ఉచితంగా అందిస్తున్న మున్సిపల్ నీళ్లు పోసి.. అందులో ప్రస్తుతానికి జీఎస్టీ లేని హోల్ స్పైసెస్ వేసి మరిగించుకోండి. ఎలాంటి ట్యాక్స్ లేని ఉప్పును కూడా వేసుకోండి. ఇక తాజాగా పెంచి 5 శాతం జీఎస్టీ గల బాస్మతీ రైస్‌ను దాంట్లో వేసుకొని.. 75 శాతం ఉడికిన తర్వాత దించండి.
ఇప్పుడు బేగంబజార్‌లో ప్రస్తుతం జీఎస్టీ లేకుండా బిల్లు లేకుండా దొరుకుతున్న బిర్యానీ పాత్రను పెట్టుకొని అడుగున 12 శాతం జీఎస్టీ ఉన్న బటర్‌ను రాసుకోండి. ఆ తర్వాత మనం ముందుగానే నానపెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి సర్దండి. ఆ పైన హాఫ్ కుక్ అయిన బాస్మతి రైసును వేసుకోండి. పాత్ర చుట్టూ 5 శాతం జీఎస్టీ ఉన్న మైదాకు ప్రస్తుతానికి ఉచితంగా వస్తున్న కాసిన్ని నీళ్లతో కలుపుకోండి. పిండిని పాత్ర అంచుకు చుట్టుకొని దానిపై మూత పెట్టుకోండి. సన్నన్ని సెగపై ఒక 40 నుంచి 50 నిమిషాలు వండుకోండి. టైం తెలుసుకోవడానికి మీరు 28 శాతం జీఎస్టీ పెట్టి కొన్న వాచ్‌ను ఉపయోగించండి.
మిర్చి కా సాలన్ ఎలా చేయాలో వచ్చే వారం ఇదే జీఎస్టీ ఫుడ్ ప్రోగ్రామ్‌లో కలుసుకుందాం. అంత వరకు జీఎస్టీ శుభాకాంక్షలు. మీ నిర్మలా తాయి.
అంతే వేడి వేడిగా హైదరాబాదీ జీఎస్టీ ధమ్ బిర్యానీ రెడీ
దీన్ని మీరు పలు రకాల జీఎస్టీలు పెట్టి కొన్న ప్లేట్లలో వేసుకొని తినండి. మిర్చి కా సాలన్ ఎలా చేయాలో వచ్చే వారం ఇదే జీఎస్టీ ఫుడ్ ప్రోగ్రామ్‌లో కలుసుకుందాం. అంత వరకు జీఎస్టీ శుభాకాంక్షలు. మీ నిర్మలా తాయి.
ఈ జీఎస్టీ బిర్యానీ మీకు నచ్చినట్లయితే లైకులు, కామెంట్ల రూపంలో స్పందించండి. ఎలాంటి జీఎస్టీ వర్తించదు.
GST తో కలిపి ఈ హాస్య ఐటెంను వండిన జాన్ కోర సీనియర్ జర్నలిస్టు, భోజన ప్రియులు. ‘భాయ్ జాన్’ పేరుతో సోషల్ మీడియాలో పరిచితులే.