Editorial

Tuesday, December 3, 2024
విశ్వ భాష‌కంగినా : ద్రాక్షను సంరక్షించే పురాతన ఆఫ్ఘాన్ పద్ధతి - రఘు మాందాటి

కంగినా : ద్రాక్షను సంరక్షించే పురాతన ఆఫ్ఘాన్ పద్ధతి – రఘు మాందాటి

ఆఫ్ఘాన్ డిన్నర్ టేబుల్స్‌లో ప్రధానమైనది ద్రాక్ష. శీతాకాలంలోనే కాదు, వేసవిలోని ఆ తీయ్యని ద్రాక్షా రుచిని ఆస్వాదించేందుకు వారు జాగ్రత్తపడుతున్న విధానం ఎంతో ఆసక్తికరం.

రఘు మాందాటి

అప్ఘాన్ లు తమ భౌగోళిక ప్రాంతంలో కనీసం 2000 BC నుండి ద్రాక్షను పెంచుతున్నారు. హుస్సేనీ, తైఫీ, కసేంద్ర, లాల్, కటా, ఘోలాఫాన్, రెడ్ కాందహరి, రౌచా, షోండాఖానై, కేష్మేషి, బ్లాక్ కేష్మేషి, లాల్ మరియు మెహర్ అమల్ది వంటి అనేక స్థానిక ద్రాక్షా రకాలను ఆఫ్ఘాన్ ప్రజలు శతాబ్దాలుగా అటు వేసవిలోని ఇటు చలికాలంలోనూ వినియోగించేందుకు తమదైన పద్దతిలో నిల్వ చేసుకుంటున్నారు.

ఈ విధానంలో భాగంగా ఉపయోగించే మట్టి-గడ్డి కంటైనర్‌లను ‘కంగినా’ అని పిలుస్తారు.

సాధారణంగా ద్రాక్ష వేసవిలో అధికంగా పండుతుంది కాబట్టి ఆఫ్ఘన్‌లు వాటిని శీతాకాలం కోసం మట్టి-గడ్డి కంటైనర్‌లను ఉపయోగించి వందలాది సంవత్సరాలుగా ఆ విధానాన్ని అనుసరిస్తున్నారు.

ఆఫ్ఘన్‌లు ఈ ఆహార సంరక్షణ పద్ధతిని ఎంత భాగా అభివృద్ధి చేశారూ అంటే దాదాపు ఏడాదిన్నర పాటు ద్రాక్షను తాజాగా ఉంచగల పద్ధతి ఇది. కాగా, ఈ విధానంలో భాగంగా ఉపయోగించే మట్టి-గడ్డి కంటైనర్‌లను ‘కంగినా’ అని పిలుస్తారు.

ఇందుకోసం వాళ్ళు స్థానికంగా లభించే మట్టినే ఉపయోగిస్తారు. దానికి గడ్డి, నీళ్ళను కలిపి గిన్నెలుగా రూపొందించు కుంటారు.

కంగీనా అన్నది రెండు మందపాటి దిబ్బ రొట్టెలు కలిపి ఉంచినట్లుగా కనిపిస్తుంది. ప్రతి కంగినా రెండు పొరల తడి మట్టితో తయారు చేయబదుతుంది. ప్రతి పొరను ఒక గిన్నె ఆకారంలో తయారు చేసి ఆపై కాల్చడానికి ఎండలో ఎండపెడతారు.

ఇందుకోసం వాళ్ళు స్థానికంగా లభించే మట్టినే ఉపయోగిస్తారు. దానికి గడ్డి, నీళ్ళను కలిపి గిన్నెలుగా రూపొందించు కుంటారు. ఈ ‘కంగినా’లని సూర్యకాంతి పడకుండా దూరంగా చల్లని, సెల్లార్ లాంటి ప్రదేశంలో నిల్వచేస్తారు.

ఇలా సంరక్షించుకున్న పండ్లు ఏ ఇబ్బంది లేకుండా సుమారు ఆరు నెలల వరకు తాజాగా ఉంటాయి.

ఇట్లా ఆఫ్ఘన్‌లు శీతాకాలంలోనే కాదు వేసవిలోని తీయ్యని ద్రాక్షా రుచిని ఆస్వాదించేలా ఇలా జాగ్రత్తపడుతున్నారు.

కథకుడు రఘు మాందాటి ఫోటోగ్రాఫర్, సినిమాటోగ్రాఫర్. ట్రావెలర్ కూడా. మొబైల్ 9966225666.

More articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article