అన్నవరం దేవేందర్
ఇదివరకెన్నడూ చూడకున్నా సరే
చూపుల్లోంచి స్నేహం కురవగానే
కళ్లూ కళ్ళు మాట్లాడుకుంటాయి
పూర్వ పరిచయం లేకున్నా పర్వాలేదు
మోముపై విరబూస్తున్న ఆత్మీయత
ముఖమూ ముఖమూ ముచ్చటిస్తాయి
అప్పుడప్పుడూ కనిపిస్తున్న రూపం
పెదిమల్లోంచి రాలే చిరునవ్వుల మొగ్గలు
అసంకల్పితంగానే పుష్పించిన స్నేహం
దూరంగా లీలగా కనిపించగానే
అప్రయత్నంగా పరస్పర నమస్కారాలు
క్రమక్రమంగా కలిసిన కరచాలనాలు
పేరూ తెలవది
ఊరూ తెలియదు
చూపులతో సోపతి కుదిరింది
మనిషితో మనిషి తీగ అల్లుకుపోయింది.
తెలుగు కవిత్వంలో అన్నవరం దేవేందర్ ది ప్రత్యేక సంతకం. వారి కవిత్వ సంకలనాల్లో ‘మంకమ్మ తోట లేబర్ అడ్డా’ అలాగే దీర్ఘ కవిత ‘బువ్వ కుండ’ విశిష్టమైన రచనలు.
ఇటీవలి వీరి వ్యాస సంకలనం ‘ఊరి దస్తూరి’ తెలంగాణా భాష, స్థానికతల జీవన శైలికి చిరునామా. మొబైల్ : 9440763479
Bagundi Sir allika
బాగుంది సార్ హార్దిక శుభాకాంక్షలు
అవును…
“పూర్వ పరిచయం లేకున్నా పర్వాలేదు
మోముపై విరబూస్తున్న ఆత్మీయత”
ఇది కదా ఒక ఆత్మీయ మానవీయ పరిమళ వికాసమూ.
దేవేందరన్నా నువ్వక్కడున్నవ్ పో.
నిత్యం జీవితంలో అనుభూతించే అనేక విషయాలను కవిత్వంగా మలచడంలో అన్నవరం ది ఆరి తేరిన కలం.ఈ మధ్య కొత్త విషయాలపై రాసిన అనేక కవితల్లో ఇదీ ఓ మంచి కవిత.
వ్యక్తీకరణలో గాఢత లేదు.