ఎదిగే వయసులో జరిగేవి ఏవైనా బలంగా నాటుకు పోతాయి. ఫలితం, మొత్తానికి ప్రపంచం ఒక మంచి డాక్టర్ని కోల్పోయింది.
విజయ నాదెళ్ళ
అన్నిటికన్నా ప్రాణం విలువైనది. అందుకే డాక్టర్ అవ్వాలన్న కోరిక చాలా బలంగా ఉండేది. ఎవరు సహకరించకపోగా, నేను బైపిసి లో జాయిన్ అయితే, ఉన్నత కులాల వారికి వైద్య విద్యలో సీట్ కష్టం అని, కాలేజ్ కి వచ్చి టిసి సర్టిఫికేట్ తీసుకుని పాలిటెక్నిక్ లో అడ్మిషన్-డేట్ అయిపోయినా, ప్రిన్సిపల్ కాళ్ళవేళ్లా పడి జాయిన్ చేశారు. అప్పుడు మొదలైంది. కులాలంటే అసహ్యం. రిజర్వేషన్ల పై కోపం. పాలిటెక్నిక్ తరువాత మళ్ళీ బైపిసీ లో చేరాను. ఈ సారి టిసి తీసుకుని, తీసుకెళ్ళి ఓ ఉద్యోగంలో పడేసారు. నేను పెద్ద చదువులు, పెద్ద యూనివర్సిటీలు చూడలేకపోయాను. అయినా ఓపెన్ యూనివర్సిటీలో ఎంబీఏ దాకా లాక్కొని వచ్చాను. ఇప్పుడు ఫైనాన్షియల్ సిస్టమ్స్, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్, బిజినెస్ ఇంటెలిజెన్స్, యూజర్ ట్రైనింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వంటి వాటి మీద వర్క్ చేస్తుంటాను. మొత్తానికి ప్రపంచం ఒక మంచి డాక్టర్ని కోల్పోయింది.
అప్పుడు మొదలైంది పొడవు, పొట్టి, తెలుపు, నలుపు మీద అసహ్యం. నేను దేశాన్ని వదిలేసాను.
పొడవు, పొడవు అని, నన్ను అందరూ కాల్చుకుని తినేవారు. అప్పుడు మొదలైంది పొడవు, పొట్టి, తెలుపు, నలుపు మీద అసహ్యం. నేను దేశాన్ని వదిలేసాను. కాస్త పెద్దయ్యాక నేను ప్రపంచాన్ని పట్టించుకోవటం మానేసాను.
నాకిష్టమైనదే చేస్తాను. నేను ఎవరి గురించి అసలేమీ అనుకోను. ఎవరేంటో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాను. “దిస్ ఎర్త్ ఈజ్ ఎ లునటిక్ అసైలం” అన్న ఐన్స్టీన్ మాటలు నాలో బలంగా నాటుకున్నాయి. అలా అని ప్రపంచం అంటే ద్వేషం లేదు. చిన్నచూపు లేదు, పెద్దచూపు లేదు.
ఈ రెండు సంఘటనలే నన్ను జీవితంలో దేనికి విలువ ఇవ్వకుండా నిలబెట్టాయి.
ఏదైనా డాక్టర్ తో సమానం కాదు. ఏదీ నా దేశానికి సరి కాదు. నాకు ఇక ఏది ఉన్న అది లెక్కలోకి రాదు.
నేను ఏదైనా డాక్టర్ తో సమానం కాదు. ఏదీ నా దేశానికి సరి కాదు. నాకు ఇక ఏది ఉన్న అది లెక్కలోకి రాదు.
ఎదిగే వయసులో జరిగేవి ఏవైనా బలంగా నాటుకు పోతాయి.
Thank you to the society.
డాక్టర్స్ డే అనగానే అన్ని గుర్తు వచ్చాయి. చివరి వరకూ వస్తూనే ఉంటాయి.
Happy Doctors Day.