‘నిలువెత్తు బతుకమ్మ’ పేరిట ప్రసిద్ద ఛాయాచిత్రకారులు, దివంగత శ్రీ భరత్ భూషణ్ గారి జీవిత కాల కృషిపై స్మారక సంచిక తేవాలని ప్రసిద్ధ దర్శకులు, ఛాయాచిత్రకారులూ శ్రీ బి. నరసింగరావు గారు నడుంకట్టారు. ‘చిత్రలేఖ’ ప్రచురణల తరపున వెలువరించే ఈ విశేష సంచికకు వారం రోజుల లోగా మీ రచనలు పంపవలసిందిగా మనవి.
తెలుగు సమాజంలో వ్యక్తులే సంస్థలుగా పనిచేసిన యోధులు కొందరున్నారు. అటువంటి వారిలో జనవరి 31న క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ కన్ను మూసిన ప్రసిద్ధ ఛాయా చిత్రకారులు శ్రీ గుడిమళ్ళ భరత్ భూషణ్ గారు ఒకరు. ఫొటోగ్రఫీలో తనకంటూ ప్రత్యేకమైన ‘సిగ్నేచర్ స్టైల్’ సంపాదించుకున్న ఈ ఓరుగల్లు బిడ్డ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎరగని వారు లేరు. ముఖ్యంగా బతుకమ్మ పండుగ చిత్రాలకు వారిది పెట్టింది పేరు. దాదాపు ఏడు దశాబ్దాల వారి జీవితంలో ఫొటోగ్రఫీ, పెయింటింగ్ లతో పాటు జర్నలిజం, సినిమారంగం కూడా ముడివడి ఉన్నది. వారి స్మరణలో ‘నిలువెత్తు బతుకమ్మ’ పేరిట ఒక విశేష సంచిక తేవాలని ప్రసిద్ధ దర్శకులు, ఛాయాచిత్రకారులూ శ్రీ బి. నరసింగరావు గారు నడుంకట్టారు. ‘చిత్రలేఖ’ ప్రచురణల తరపున స్వచ్ఛందంగా వారు వెలువరించే ఈ సంచికకు మీ రచనలు పంపవలసిందిగా మనవి.
భరత్ భూషణ్ జీవితం, కళ, దృక్పథం, విశిష్టత, ప్రభావం మొదలు అతడి రచనలు, ప్రదర్శనలు, ఈస్తటిక్స్, స్నేహశీలత గురించి, అలాగే-వారితో మీకున్న సాన్నిహిత్యం, అందించిన సహకారం, సుదీర్ఘకాలం వారు అనారోగ్యంతో పోరాడిన విధానం – తదితర అంశాలతో సహా ఆ కళాకారుడి జీవితంలోని వెలుగు నీడలను ప్రతిబింబించేలా ఈ స్మారక సంచికను అపురూపంగా మలుద్దామని విజ్ఞప్తి. వారిపై పరిశోధనకు పూనుకునే భావితరాలకు దీన్నొక గైడ్ గా రూపొందించేందుకు మీ వంతు సహకారాన్ని కోరుతున్నాం. ఇందుకోసం మీ అనుబంధాన్ని పేర్కొంటూ మరొక వారం రోజుల్లో ఒక ప్రత్యేక వ్యాసం రాసి పంపవలసిందిగా ఇదే మా సాదర ఆహ్వానం. మీరు తీసిన భరత్ భూషణ్ గారి అరుదైన చిత్రాలను కూడా ఈ సంచికకు పంపవచ్చు.
ఆ కళాకారుడి జీవితంలోని వెలుగు నీడలను ప్రతిబింబించేలా ఈ స్మారక సంచికను అపురూపంగా మలుద్దామని విజ్ఞప్తి.
స్మారక సంచికకై రచనలు పంపాల్సిన ఇ- మెయిల్ kandukurirameshbabu@gmail.com.
మరిన్ని వివరాలకు – 9948077893.
కందుకూరి రమేష్ బాబు
సంపాదకులు, భరత్ భూషణ్ స్మారక సంచిక