మూవీలో ఆల్మోస్ట్ జీరో ఎంటర్టెయిన్మెంట్. జోక్స్, పంచ్ డైలాగ్స్, సాంగ్స్, రొమాన్స్ ఏమీ ఉండవు. వయొలెన్స్ చాలా చాలా ఎక్కువ. కానీ ఒక్కరోజులో తమ జీవితం మొత్తం నాశనం అయిపోయిన బాధితుల మానసిక స్థితిని ఫీలవ్వాలనుకుంటే మాత్రమే చూడాలి.
రాంబాబు తోట
‘చిన్ని’ మూవీలో బోలెడంత వయెలెన్స్ ఉంది. రక్తపాతం ఉంది. కానీ వయలెన్స్ ని హీరోయిక్ గా చూపించలేదు. అలా ఎంకరేజ్ చేయలేదు.
హింసకు హింసతోనే ప్రతీకారం తీర్చుకోవడాన్ని పర్సనల్ గా నేను ఒప్పుకోలేను. కానీ, ఎవరికీ ఏ హానీ చేయకుండా తమ బతుకు తాము బతుకుతున్నవారి జీవితాల్ని, వేరెవరో తమ బలుపుని చూపించుకోవడం కోసం చిదిమేస్తే, నాశనం చేస్తే, “ఎందుకు బతకాలి?”అన్న ప్రశ్నకు జవాబేలేని నిరాశలోకి నెట్టేస్తే, మనుషులు అలాగే ఆలోచిస్తారేమో. అలా తీయడమే రియాలిస్టిక్ గా తీయడం అనిపించింది. అభ్యుదయం అనే పువ్వు పూయాలన్నా, జీవితంలో సుఖం, శాంతి అనుభవించిన ప్రివిలేజ్ ఉండాలి.
మూవీలో సెక్సువల్ వయొలెన్స్ (రేప్) ఉంటుంది. కానీ న్యూడిటీ ఉండదు. న్యూడిటీ వరకూ ఎందుకు, కనీసం పాదాల కింద పాదాలు నలిగిపోయే రొటీన్ షాట్ కూడా చూపించలేదు. రేప్ జరిగే సమయంలో రేప్ విక్టింని చూపించకుండా, అక్కడ జరుగుతున్న వయొలెన్స్ ని ఆడియెన్స్ ఫీలయ్యేలా, డిస్టర్బ్ అయ్యేలా తీసారు.
తన రెగ్యులర్ సినిమాలకు భిన్నమైన కేరెక్టర్ లో కీర్తి సురేష్ ఒదిగిపోయింది. సెల్వ రాఘవన్ అసలు నటించాడా? లేక బయట కూడా అలానే ఉంటాడో తెలియదు. ఆ కేరెక్టర్ కి సరిగ్గా సరిపోయాడు.
మూవీ కులం తాలూకు బలుపుని చూపిస్తుంది. కానీ ఎక్కడా కులం పేరు ఎత్తల్లేదు. అసలు కులం అన్న మాటే వాడలేదు. కానీ అదంతా కులం వల్ల వచ్చిన బలుపే అని తెలిసేలా సీన్లు రాసుకున్నారు.
చాలా సాధారణమైన కథ తీసుకున్నప్పటికీ, స్క్రీన్ ప్లే కారణంగా భిన్నంగా ఉంది. ఒక కేరెక్టర్ గురించి, ఒక సంఘటన గురించి మనం ఒక అభిప్రాయానికి వస్తే, కాసేపటికి ఆ అభిప్రాయం తప్పు అనిపించే paradigm shift కి లోనయ్యేలా స్క్రీన్ ప్లే రాసుకున్నారు.
ఎక్కడా ఏ సీన్లోనూ మెయిన్ స్టోరీని దాటి మూవీ బయటకు పోకుండా, కక్కుర్తిగా మసాలా యాడ్ చేయకుండా డైరెక్టర్ అరుణ్ మాధేశ్వరన్ హేండిల్ చేసాడు.
తన రెగ్యులర్ సినిమాలకు భిన్నమైన కేరెక్టర్ లో కీర్తి సురేష్ ఒదిగిపోయింది. సెల్వ రాఘవన్ అసలు నటించాడా? లేక బయట కూడా అలానే ఉంటాడో తెలియదు. ఆ కేరెక్టర్ కి సరిగ్గా సరిపోయాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రమే కాకుండా కొన్ని సీన్స్ కి పాత మెలోడీ సాంగ్స్ ని బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ వాడటం బాగుంది. ఎక్కడా ఏ సీన్లోనూ మెయిన్ స్టోరీని దాటి మూవీ బయటకు పోకుండా, కక్కుర్తిగా మసాలా యాడ్ చేయకుండా డైరెక్టర్ అరుణ్ మాధేశ్వరన్ హేండిల్ చేసాడు.
ఇంత రాసాను కాబట్టి సినిమా అద్భుతంగా ఉంటుంది. అందరూ చూసేయండి అనను. మూవీలో ఆల్మోస్ట్ జీరో ఎంటర్టెయిన్మెంట్. జోక్స్, పంచ్ డైలాగ్స్, సాంగ్స్, రొమాన్స్ ఏమీ ఉండవు. వయొలెన్స్ చాలా చాలా ఎక్కువ కాబట్టి సున్నిత మనస్కులు చూడటం కష్టం. పిల్లలు అసలు చూడకూడదు. ఒక్కరోజులో తమ జీవితం మొత్తం నాశనం అయిపోయిన బాధితుల మానసిక స్థితిని ఫీలవ్వాలనుకుంటే మాత్రమే చూడండి. అమెజాన్ ప్రైమ్ లో (తెలుగులో కూడా) ఉంది.
రాంబాబు తోట ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా విషయమై పని చేసే ‘క్రియ‘ అనే స్వచ్ఛంద సేవా సంస్థలో పనిచేస్తున్నారు. ఫోటోగ్రఫీ, సినిమాలు తన అభిరుచులు. ప్రయాణాలూ, తాత్విక చర్చలూ ఇష్టమూ.