నామ రహిత రచయితల కథలు చదివినప్పుడు, అవి మన మనసుని తాకినప్పుడు ఆ రచయిత ఎవరో మనకి తెలియనప్పుడు కలిగే బాధ మరీ ఎక్కువగా ఉంటుంది.
ఈ మధ్య ఇంగ్లీష్ లో చదివిన అలాంటి కథలు చాలా చదివాను. వాటిని తెలుగులోకి అనువాదం చేశాను. ఆ తర్వాత అది పుస్తకంగా కూడా వెలువడింది. దాని పేరు “కథలకి ఆవల”. అందులోని ఒక కథే ఈ వారం ‘పెరుగన్నం’.
జింబో
రచయితలు రెండు రకాలుగా ఉంటారు. కొంతమంది పేర్లు తెలిసిన రచయితలు. మరికొంతమంది నామ రహిత రచయితలు. అలా రచనలు చేసిన రచయితని Anonymous రచయితలు అనవచ్చ్చు. వారిని తెలుగులో నామ రహిత రచయితలని నేను అన్నాను. ఆ రచనలు అనువాదం కాదు. ఆ రచయితల పేర్లు మనకు తెలియవు. కానీ వారు రాసిన కథలు ఒకరి నుంచి మరొకరికి అందుతూనే ఉన్నాయి. ముద్రణా మాధ్యమం రాకముందు ఇలాంటి రచయితలు ఎక్కువగా ఉండేవాళ్ళు. ఈ ఆధునిక కాలంలో కూడా అలాంటి రచయితలు ఎంతో మంది తారసపడుతున్నారు. అలాంటి రచనలు ఎన్నో తారసపడుతున్నాయి.
రచయిత పేరు తెలిస్తే, అతని రచన మరోచోట కనిపిస్తే చదవాలన్న కుతూహలం కలుగుతుంది. అదే విధంగా ఆ రచయితని కలవాలన్న కోరిక కూడా జనిస్తుంది. వారితో పరిచయం పెంచుకోవాలన్న కాంక్ష కూడా ఉద్భవిస్తుంది. ఆ కథలు మనల్ని ప్రభావితం చేసినప్పుడు మన హృదయానికి హత్తుకున్నప్పుడు అలాంటి భావనలు కలగడం సహజమే.
రచయిత ఎవరో తెలియకుండా ఉన్నప్పుడు ఆ కథ మన గుండెల్ని తాకినప్పుడు మన ప్రతిస్పందన వారికి తెలియ చేయలేదే అన్న బాధ కలగడమూ సహజమే.
కథ చెప్పడంలో ఆనందం ఉంటుంది. అదేవిధంగా కథ చదవడం లోనూ కూడా గొప్ప ఆనందం ఉంటుంది. కొన్నిసార్లు కథలు గొప్ప అందాలని, జీవన సత్యాలని ఆవిష్కరిస్తాయి. రచయిత ఊహాజనిత ప్రపంచంలోకి పాఠకుడు అడుగుపెట్టి ఆ పాత్రలతో మమేకం కావడంలో పాఠకునికి ఆ ఆనందం కలుగుతుంది.
కథ చెప్పడంలో అణుకువ నమ్రత ఉండి కథ చదివిన వారిలో మానవత్వాన్ని ద్విగుణీకృతం కావాలి. గొప్ప కథలు, జీవితం నుంచి వచ్చిన కథలు ఈ పనిని చేస్తాయి. అది చిన్న కథ కావొచ్చు. పెద్ద కథ కావొచ్చు.
చిన్న కథల్లో గొప్ప సత్యం ఉంటుంది. కథ చిన్నదే కావచ్చు కానీ అది గొప్ప అనుభవంతో రాసినప్పుడు అలాంటి ఫీలింగ్ పాఠకుడికి కలుగుతుంది.
కథలు విషాదకరమైనవి అయినా కూడా వాటిని అందంగా చెప్పాలి. అప్పుడే అవి పాఠకులని ఆకర్షిస్తాయి. మన జీవన ప్రయాణంలో ఎన్నో సంఘటనలు ఎదురవుతాయి. ఎన్నో విషయాలు మన అనుభవంలోకి వస్తాయి. వాటికి మెరుగులు దిద్ది అక్షరరూపం ఇచ్చేవాడే కథారచయిత.
నామ రహిత రచయితల కథలు చదివినప్పుడు, అవి మన మనసుని తాకినప్పుడు ఆ రచయిత ఎవరో మనకి తెలియనప్పుడు కలిగే బాధ మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య అలాంటి కథలు చాలా చదివాను. అలా ఇంగ్లీష్ లో చదివిన కథలని తెలుగులోకి అనువాదం చేశాను. పత్రికల్లో, ఇంటర్నెట్ లో వచ్చిన కథలు అవి. ఆ తర్వాత అది పుస్తకంగా కూడా వెలువడింది. దాని పేరు “కథలకి ఆవల”. ఈ పుస్తకం రెండు ముద్రణలు పొందింది. ఇందులో ఉన్న కథలు అన్నీ కూడా నామ రహిత రచయితలు రాసిన కథలే. అందులోని ఒక కథను ఇప్పుడు చెబుతాను.
ఆ కథ పేరు “పదాల పాఠం” అంటే పదాల నుంచి వచ్చిన పాఠం. అది కనువిప్పు కలిగించే కథ.
జీవితం మీద ఆశ కలిగించే కథ.
ఆ వ్యక్తి భూట్ కాలి శబ్దాన్ని ఆ కుర్రవాడు పసిగట్టి – “పొద్దున ఈ బోర్డు ని తిరిగి రాసింది మీరే కదూ ” అడిగాడు.
ఓ పెద్ద భవనం ముందు ఓ కళ్ళు లేని కుర్రవాడు అడుక్కోడానికి కూర్చుంటాడు. అతని ముందు డబ్బుల కోసం ఓ పళ్ళెం పెట్టుకున్నాడు. ఒక బోర్డు ని కూడా అక్కడ పెట్టాడు.
అందులో ఈ విధంగా రాసి ఉంది. “గుడ్డివాడిని ధర్మం చేయండి.”
అతని పళ్ళెంలో కొన్ని చిల్లర పైసలు మాత్రమే ఉన్నాయి.
ఓ వ్యక్తి ఎటు వైపు నడుస్తూ, ఆ కళ్ళులేని కుర్రవాడిని చూశాడు. అతని జేబులో నుంచి కొన్ని నాణాలు తీసి అతని పళ్ళెం లో వేశాడు. అతను పెట్టుకున్న బోర్డును కూడా చూశాడు. దాన్ని మార్చి కొన్ని కొత్త పదాలను రాసి మళ్లీ ఎక్కడ పెట్టాడు.
అతను ఏమి రాశాడో, ఏమి మార్పులు చేసాడో ఆ కుర్రవాడికి తెలియదు .అటు వైపు వెళ్తున్న వ్యక్తులు ఆ బోర్డు వైపు చూసి చదవడం మొదలు పెట్టారు. అతనికి డబ్బులు వేయడం మొదలు పెట్టారు.
మెల్లి మెల్లిగా అతని పళ్లెం నిండా నాణాలు చేరిపోయాయి. అటు వైపు వచ్చిన వాళ్ళు తమకు తోచిన విధంగా ఆందులో డబ్బులు వేశారు.
ఆ బోర్డుని తిరగ రాసిన వ్యక్తి మధ్యాహ్నం అటువైపు వచ్చాడు. ఆ కుర్రవాడి పరిస్థితి ఏమైనా మెరుగుపడిందా అని ఆ కుర్రాడి వైపు చూశాడు. ఆ వ్యక్తి భూట్ కాలి శబ్దాన్ని ఆ కుర్రవాడు పసిగట్టి-
“పొద్దున ఈ బోర్డు ని తిరిగి రాసింది మీరే కదూ ” అడిగాడు.
కథ చదివిన ఎవరికైనా ఆ రచయిత కనిపిస్తే అతని ఆలింగనం చేసుకొని అభినందించాలన్న కోరిక కలుగుతుంది. కానీ ఆ కోరిక తీరదు. ఆ రచయిత మనమే అనుకోవడం మంచిదేమో!
“అవును “అన్నాడు అతను.
“ఇంతకీ అందులో ఏం రాశారు” కుతూహలంగా అడిగాడు ఆ కుర్రవాడు.
“సత్యాన్ని రాశాను నువ్వు రాసిన విషయాన్ని కొంత భిన్నంగా నేను రాశాను”
అతను రాసిన విషయాన్ని చెప్పాడు.
“ఈ ఉదయం, ఈ రోజు ఎంతో అందమైనది. కానీ నేను దాన్ని చూడలేను” ఇది అతను రాసింది.
రెండు రాతలు ఒకే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మొదటి రాత అతనికి కళ్ళు లేవు మాత్రమే చెబుతుంది. రెండవ రాత ఆ విషయం చెబుతూనే మరో విషయం కూడా చెబుతుంది. అది చదువుతున్న వ్యక్తులు చాలా అదృష్టవంతులని వాళ్లకి దృష్టి ఉందన్న విషయం కూడా చెబుతుంది.
ఆశ్చర్యం..రెండో రాత చాలా శక్తివంతంగా ఉంది.
మనకున్న వాటితో ఆనందంగా ఉండాలి. కొత్తగా ఆలోచించాలి..భిన్నంగా చూడాలి. ఆశావహంగా ఉండాలి.
మంచి వైపు అందరి దృష్టి మరల్చాలి. మన జీవితాలు మనం ఏడ్చే విధంగా ఉండకూడదు. మనం ఏడ్వటానికి జీవితం వంద కారణాలు ఇస్తే, నవ్వడానికి వెయ్యి కారణాలు ఇచ్చిందన్న విషయం మర్చిపోకూడదు. గతాన్ని విచారించకుండా గడపాలి. వర్తమానాన్ని విశ్వాసంగా గడపాలి. ఎలాంటి భయం లేకుండా భవిష్యత్తును ఎదుర్కోవాలి. భయాన్ని వదిలిపెట్టి నమ్మకాన్ని పెంచుకోవాలి.
ఇదీ కథ.
నామ రహిత రచయిత రాసిన కథ .
కథ చదివిన ఎవరికైనా ఆ రచయిత కనిపిస్తే అతని ఆలింగనం చేసుకొని అభినందించాలన్న కోరిక కలుగుతుంది. కానీ ఆ కోరిక తీరదు. ఆ రచయిత ఎవరో తెలియదు. ఆ రచయిత మనమే అనుకోవడం మంచిదేమో!
ఎములాడ ‘రాజేందర్’ పరిచయం
‘జింబో’ కలం పేరుతో సాహితీ లోకానికి చిరపరిచితులైన మంగారి రాజేందర్ కవీ, కథకులు. సామాన్యుల పక్షాన న్యాయ వ్యవస్థపై అనేక రచనలు వెలువరించిన ‘తరాజు’. తెలుపు కోసం ప్రతి ఆదివారం ‘కథా కాలమ్’ రాస్తున్నారు. వారి e-mail: rajenderzimbo@gmail.com
తొలి వారం కథనం ఇక్కడ క్లిక్ చేసే చదవవచ్చు. 2 వ వారం, ఆ రాత్రి అన్నం ముందు కూర్చున్నప్పుడు. ౩ వ వారం ఒక కథ ఎలా రూపు దిద్దుకుంది!. 4 వ వారం గుల్జార్ చెప్పిన కథ. 5 వ వారం పిల్లలే నయం. 6 వ వారం కథనం ఇది…కథలు దృక్పథాలని మారుస్తాయా? 7 వ వారం అమరావతి కథలు తెలుపు. 8 వ వారం పాల్ కొహెలో ‘పెన్సిల్ కథ’.