Editorial

Monday, December 23, 2024
కథనాలు‘బహుజన ధూం ధాం’ ప్రారంభం : యుద్ధనౌక అండగా 'ఆటా మాటా పాటా...'

‘బహుజన ధూం ధాం’ ప్రారంభం : యుద్ధనౌక అండగా ‘ఆటా మాటా పాటా…’

‘రిథం ఆఫ్ ది బహుజన్ కల్చర్’ పేరిట జరిగిన బహుజన ధూం ధాం ఆరంభ సభ మలి తెలంగాణ ఉద్యమానంతరం బహుజన రాజ్యాధికారం కోసం స్వరాష్ట్రంలో నడుం కట్టిన కవులు, కళాకారులు, మేధావుల తొలి సంఘీభావ సభగా పేర్కొనవచ్చు.

కందుకూరి రమేష్ బాబు 

తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున లేచిన పాట రాష్ట్రం ఏర్పాటయ్యాక చల్లబడింది. చిత్రంగా ఆ ‘పాట’ మళ్ళీ పదునెక్కేందుకు తగిన సన్నివేశం ఏర్పడుతుండటం విశేషం. అందరూ భావిస్తున్నట్టు అలసి సొలసి ఆధ్యాత్మిక సాగరం ఒడ్డుకు చేరినట్లు కనిపించిన ‘వృద్ద యుద్ధనౌక’ తిరిగి నూతనోత్తేజంతో ‘ధూం ధాం’గా ఆడి పాడటం, యువతరంతో కలిసి పని చేస్తానని నిన్నటి సభలో ప్రతిన భూనడం మరో విశేషం.

https://www.facebook.com/kandukuri.rameshbabu/videos/410743014204103

అవును. గద్దర్ మొదలు నూతన కవి గాయకులూ తోడుగా నిన్న ఒన నూతన వేదిక సిద్దమై ఉత్తేజపూరితంగా ఆడి పాడింది. తూటాల్లా మాట్లాడింది కూడా. బహుజన రాజ్యాధికారం లక్ష్యంగా ఆ వేదిక రాష్ట్రమంతా రాబోయే ఎన్నికల లోపు ‘ఆటా పాటా మాట’లతో కదను తొక్కడానికి ఒక కార్యాచరణ తీసుకున్నది కూడా.

రసమయి నాయకత్వంలో ఒకనాడు రాష్ట్ర సాధనలో కీలకంగా వ్యవహరించిన ‘ధూం ధాం’ తరహాలోనే మరోసారి అటువంటి ఈ వేదిక ఈ సారి తెలంగాణలో బహుజన రాజ్యానికి భూమికగా లక్ష్యాన్ని నిర్వచించు కుని పని చేయనున్నది. ఆ వేదిక సరికొత్త సమీకరణాలతో ఎన్నికల క్షేత్రాన్ని హోరెత్తించే అవకాశాన్ని స్వయంగా పునర్లిఖించుకుంటున్నది.

నూతన సమీకరణలతో ‘బహుజనుల ధూం ధాం’ పని చేయనున్నది. దాని గమ్యం గమనం గురించి ఇప్పుడే మాట్లాడుకుంటే ఎక్కువ అవుతుంది గానీ ఆ దిశలో నిన్న ఒక అడుగు బలంగా పడిందనే చెప్పడం మటుకు తక్కువేమే కాదు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ‘ధూం ధాం’ ఎట్లయితే సకల జనులను ఒక్కత్రాటిపైకి తెచ్చిందో అదే వ్యూహంతో బహుజన రాజకీయాధికారం లక్ష్యంగా  నూతన సమీకరణలతో ‘బహుజనుల ధూం ధాం’ పని చేయనున్నది. దాని గమ్యం గమనం గురించి ఇప్పుడే మాట్లాడుకుంటే ఎక్కువ అవుతుంది గానీ ఆ దిశలో నిన్న ఒక అడుగు బలంగా పడిందనే చెప్పడం మటుకు తక్కువేమే కాదు.

దళిత బహుజన మేధావి, సిద్దాంతకర్త జిలకర శ్రీనివాస్ ఆధ్వర్యంలో కవి రచయిత పాత్రికేయుడు పసునూరి రవీందర్ కో ఆర్డినేటర్ గా కవి, గాయకుడు మచ్చ దేవేందర్, జన్ని వెన్నెల కన్వీనర్లుగా నిన్న హైదరాబాద్ లోని లలిత కళా తోరణంలో ఆరంభమైన ‘భహుజన ధూం ధాం’ ఒక ఆసక్తికరమైన రంగానికి వేదిక అయింది. సభ ఉత్తేజ భరితంగా జరిగింది. ‘రిథం ఆఫ్ ది బహుజన్ కల్చర్’ పేరిట జరిగిన ఈ ఆరంభ సభ మలి తెలంగాణ ఉద్యమానంతరం బహుజన రాజ్యాధికారం కోసం స్వరాష్ట్రంలో నడుం కట్టిన కళాకారుల తొలి సంఘీభావ సభగా పేర్కొనవచ్చు. సూటిగా ఎన్నికల ఎజెండాగానే ప్రారంభమైన సభగానూ గుర్తించవచ్చు.

గద్దర్ తో పాటు మాష్టార్జీ, పాశం యాదగిరి, విమలక్క, జయధీర్ తిరుమలరావు, చెరుకు సుధాకర్, సూరేపల్లి సుజాత, స్క్యై బాబా, ఆదేశ్ రవి, మందాల భాస్కర్ తదితర నాయకులు హాజరై ఈ సభకు మద్దతుగా నిలవడం విశేషం.

సమాజంలో మెజారిటీ ప్రజలను కళా రూపాలతో మేల్కొలిపి వారిని రానున్న ఎన్నికల్లో బహుజన రాజ్యాధికారానికి చేరువ చేయాలన్న ఏకైక లక్ష్యంతో ఈ ధూం ధాం పనిచేయనున్నది. అందుకు గాను అప్పటికి అవకాశం ఉన్న వ్యక్తులు, పార్టీలకు మద్దతుగా ఉండేలా – ఒక చేత రాజ్యాంగం, మరో చేత ఓటు ఆయుధాలుగా ‘ఆట మాట పాట’లతో రాష్ట్ర వ్యాప్తంగా సభలు పెట్టేందుకు పూనుకుంటున్నారు. కాగా, మహనీయుల జయంతి ఉత్సవాల పేరిట జరిగిన ఈ తొలి సభకు ప్రధాన ఆకర్షణ గద్దర్ కావడం మరో విశేషం.

గద్దర్ తో పాటు మాష్టార్జీ, పాశం యాదగిరి, విమలక్క, జయధీర్ తిరుమలరావు, చెరుకు సుధాకర్, సూరేపల్లి సుజాత, స్క్యై బాబా, ఆదేశ్ రవి, మందాల భాస్కర్, దత్తాత్రేయ తదితర బహుజన కవులు, రచయితలు, కళాకారులు, మేధావులు, నాయకులు హాజరై ఈ సభకు మద్దతుగా నిలవడం విశేషం.

తెలంగాణ ఉద్యమానికి ఎట్లఅయితే ధూంధాం ఒక సాంస్కృతిక దళంగా పనిచేసిందో అదే మాదిరి బహుజన భావజాల వ్యాప్తికి, దాన్ని ఉద్యమ స్థాయికి తీసుకెళ్లడానికి నిన్నటి సభ మాదిరే ఇటువంటి సభలు వివిధ ప్రాంతాల్లో నిర్వహించాలన్నది యోచనగా తెలిసింది.

చాలా మంది హాజరయ్యరనే చెప్పాలి. బోధినాద్ హరినాధ్, ప్రొ. కొమ్ము రజిత, ఎండి రియాజ్, జాజుల శ్రీనివాస్ గౌడ్, సాయిని నరేందర్, చెరిపల్లి ఆనంద్, ప్రసాద్ గౌడ్, జైభీమ్ రాంచందర్ లతో పాటు గుడిపల్లె రవి, రాజేష్ రెంజర్ల, రాచకొండ రమేష్, ఒగ్గు బాలయ్య, పుట్ట శ్రీను, డా. వెంకటేష్, సురేష్ మహాజన్, మహేందర్, పాటమ్మ రాంబాబు, అందె జమున, అందె భాస్కర్, పృథ్వీరాజ్ యాదవ్, శ్రీధర్, చంద్రశేఖర్ ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ఉద్యమానికి ఎట్లఅయితే ధూంధాం ఒక సాంస్కృతిక దళంగా పనిచేసిందో అదే మాదిరి బహుజన భావజాల వ్యాప్తికి, దాన్ని ఉద్యమ స్థాయికి తీసుకెళ్లడానికి నిన్నటి సభ మాదిరే ఇటువంటి సభలు వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తూ రాష్ట్రంలోని బహుజన గళాలను ఒక్కటి చేసి తద్వారా యువతను, ప్రజలను సంఘటితం చేయాలని నిర్వహకులు యోచిస్తున్నట్టు తెలిసింది.

ముఖ్యంగా దళిత బహుజనుల్లో చైతన్యవంతమైన ఉద్యోగ వర్గం ఒకటి ఎదగడం, మలి తెలంగాణ ఉద్యమం అనంతరం తగిన పిలుపు లేకుండా వీరంతా స్తబ్దుగా ఉండటం కూడా ఒకటున్నది.

కేసిఆర్ వ్యూహాత్మకంగా తెలంగాణ ఉద్యమంలో ఆడి పాడిన దాదాపు 500 కవి గాయకులూ, కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి వారందరినీ ‘సాంస్కృతిక వారధి’గా తన కోటలు బీటలు వారకుండ అడ్డు కట్ట వేశారనే అభిప్రాయం ఉన్నది. ఐతే, ఆ వారధిలో కలవని మరెందరో కళాకారులను ప్రేరేపించి బహుజన ధూం ధాంలో వారికి ఎక్కడికక్కడ స్థానం ఇచ్చి తమ రాజ్యాధికారానికి భూమికగా ఈ వేదికను బలంగా రూపొందించాలన్నది వీరి వ్యూహం. అది ఎంతో శ్రమతో కూడిన కర్తవ్యమే ఐనప్పటికీ అలాంటి ప్రయత్నానికి స్వరాష్ట్రంలో నేడు తగిన అవకాశం ఉందని గద్దర్ మొదలు పలువురు అంచనాగా ఉన్నది. ముఖ్యంగా దళిత బహుజనుల్లో చైతన్యవంతమైన ఉద్యోగ వర్గం ఒకటి ఎదగడం, మలి తెలంగాణ ఉద్యమం అనంతరం తగిన పిలుపు లేకుండా వీరంతా స్తబ్దుగా ఉండటం కూడా ఒకటున్నది. తగిన కార్యాచరణ ఇస్తే ఆర్థికంగా స్థిరపడ్డ ఈ వర్గంతో పాటు అసంతృప్తితో ఉన్న విద్యార్థీ యువత, తోడైతే, తమ మార్గాన్ని సులభంగా చేరుకోవచ్చు అన్నది కూడా ఒక విశ్లేషణ.

ఈ ధూం ధాం ఏ పార్టీకి మద్దతుగా ఉండదు అని చెబుతూనే బహుజన రాజ్యాధికారానికి ప్రయత్నించే వారికి సమయం వచ్చినప్పుడు తప్పక అండగా ఉండేలా పనిచేయాలన్నది నిర్వాహకుల బహిరంగ ఎజెండా.

అలాగే కేసిఆర్ తన ఒంటెద్దు పోకడలతో దూరం చేసుకున్న ఉద్యమకారులు..అలాగే ఎంతోమంది కవి, గాయకులూ టిఎఆర్ ఎస్ బయట ఎలాగు ఉన్నారన్నది వీరి అంచనా. అలాగే అయన పరిపాలన పట్ల విముఖత వ్యక్తం చేస్తున్న మేధావులూ ఎందరో తగిన వేదిక కోసం వేచి ఉన్నారనే అభిప్రాయమూ ఉన్నది. వారందరినీ ఈ ప్రయత్నంలో భాగం చేయాలన్నది నిర్వాహకుల యోచన. అందుకోసం ఆటా మాటా పాటాలతో అందరినీ కలుపుకుని ప్రజల వద్దకు వెళ్లేందుకు చురుగ్గా నిర్వాహకులు ప్రణాళికలు రచిస్తున్నారు. వారికి ఇటీవలే సరికొత్త యువ కవి గాయకులను సన్మానించి ‘పునర్జన్మ’ పేరిట పుట్టినరోజు జరుపుకున్న గద్దర్ ఈ ప్రయత్నానికి భాసటగా నిలవాలని నిర్ణయించుకోవడం మరో విశేషం.

కాగా, ఈ ధూం ధాం ఏ పార్టీకి మద్దతుగా ఉండదు అని చెబుతూనే బహుజన రాజ్యాధికారానికి ప్రయత్నించే వారికి సమయం వచ్చినప్పుడు తప్పక అండగా ఉండేలా పనిచేయాలన్నది నిర్వాహకుల బహిరంగ ఎజెండా. ఐతే, ఈ సభ ఏర్పాటుకు వారు ఎంచుకున్న సమయం కూడా ఆసక్తికరమైనదే అనాలి.

రాష్ట ఏర్పాటుకు ఇరుసుగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి ఎల్లుండి తమ పార్టీ ఆవిర్భావ సభ ఘనంగా జరుపబోతున్న వేళ ‘బహుజన ధూం ధాం’ ఆవిర్భావ సభ ఘనంగా ప్రారంభం కావడం ఎన్నికల రాజకీయాల్లో మరో మలుపు.

త్వరలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై ఎనిమిదేళ్ళు నిండబోతున్నాయి. అలాగే, రాష్ట ఏర్పాటుకు ఇరుసుగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి ఎల్లుండి తమ పార్టీ ఆవిర్భావ సభ ఘనంగా జరుపబోతున్నది. ఇటువంటి వేళ ‘బహుజన ధూం ధాం’ ఆవిర్భావ సభ ఏర్పడకుండానే ఘనంగా ప్రారంభం కావడం ఎన్నికల రాజకీయాల్లో మరో మలుపుగా తెలుపు భావిస్తున్నది. ఇది ఆశించిన మేరకు ఫలితాలు సాధించాక పోయినా  వచ్చే నష్టం ఏమీ లేదు. టి ఆర్ ఎస్ మొదలు కాంగ్రస్ బిజెపి పార్టీల్లోనూ బహుజనుల అభివృద్ధి, సంక్షేమం మరింత అవశ్యమైన ఎజెండాగా మారుతుంది. ఆయా పార్టీల్లో బహుజనులకు మరింత ప్రాధాన్యం ఇవ్వక తప్పని స్థితి ఏర్పడుతుంది.

నిన్నటిదాకా గురుకుల సంక్షేమ కార్యదర్శిగా ఉన్న ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ రేపు మాపు తమకు ప్రతిపక్షహోదాలో ఉన్నా ఆశ్చర్యం లేదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేయడం విశేషం. ఇది పెద్ద మాట.

ఇదిలా ఉంటే ఇటీవలే యువ నేత కేటిఆర్ ఒక ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ రాజకీయాల్లో ఏదైనా సాధ్యం అంటూ బహుజన రాజ్యాదికరమే తన ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్ గారిపై వ్యాఖ్య చేయడం రాజకీయ విశ్లేషకులను విస్మయానికి గురి చేసింది. నిన్నటిదాకా గురుకుల సంక్షేమ కార్యదర్శిగా ఉన్న ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ రేపు మాపు తమకు ప్రతిపక్షహోదాలో ఉన్నా ఆశ్చర్యం లేదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేయడం విశేషం. ఇది పెద్ద మాట. నిజానికి కాబోయే ముఖ్యమంత్రి నోట అలాంటి మాట రావడం విస్మయమే. ఐతే, అందులో ఆశ్చర్యం ఏమీ లేదని నిన్నటి సభ మరో రకంగా పేర్కొన్నది.

బహుజనులు ఎవరికిందో పనిచేయడం కాదు, ప్రతిపక్షంలో కూచోవడమూ కాదు, ప్రధాన పక్షంలోకి సగర్వంగా చేరుకోవడానికి రేపటి ఎన్నికలను సద్వినియోగం చేసుకోవలన్నది అందరి ఆలోచనగా ఉన్నది.

బహుజనులు ఎవరికిందో పనిచేయడం కాదు, ప్రతిపక్షంలో కూచోవడమూ కాదు, ప్రధాన పక్షంలోకి సగర్వంగా చేరుకోవడానికి రేపటి ఎన్నికలను సద్వినియోగం చేసుకోవలన్నది అందరి ఆలోచనగా ఉన్నది. ఆ దిశలో బహుజనులకే రాజ్యాధికారం అన్న సోయి ‘ఆటా పాటా మాటల’ సాక్షిగా నిన్నటి ధూం ధాంలో  బలంగా వ్యక్తమైంది. మరి వారి ఆలోచన, కార్యాచరణ సానుకూల మలుపు తీసుకుంటే అది రాష్ట్ర రాజకీయాల ప్రజస్వామీకరణలో పెద్ద అడుగు అని భావించాలి.

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article