Editorial

Sunday, November 24, 2024
కాల‌మ్‌ఈ వారం పాల్ కొహెలో 'పెన్సిల్ కథ' : ఇది 'జింబో' కథాకాలం

ఈ వారం పాల్ కొహెలో ‘పెన్సిల్ కథ’ : ఇది ‘జింబో’ కథాకాలం

పాల్ కొహెలో రాసిన ఈ  కథ మనల్ని ఉత్సాహపరుస్తుంది. మనం ఒక ప్రత్యేకమైన మనిషి అన్న విషయాన్ని గుర్తు చేస్తుంది ప్రతి మనిషి జీవితానికి ఒక పర్పస్ ఉందని కూడా చెబుతోంది.

ఎవరూ ధైర్యం చెప్పాల్సిన పని లేదు. జీవితం అల్పమైనదని అనుకోవడానికి వీలు లేదు.
ఒక ప్రత్యేకమైన పని చేయడానికే ప్రతి మనిషి పుట్టాడని ఈ కథ చెప్పకనే చెబుతుంది.

జింబో

వ్యక్తులు తాము తెలుసుకున్న విషయాలను ఇతరులకు చెప్పడం తొలుత కథల రూపంలో జరిగేది. విజేతలు, తత్త్వవేత్తలు, ప్రవక్తలు, యోధులు నాయకులు కథల ద్వారా మనందరికి ఉత్తేజం కలిగించారు.

ఆ కథలు మన ఆలోచనలని తమ వైపు తిప్పుకున్నాయి. మనలో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని, బలాన్ని నింపే ఔషధాలుగా కథలు పని చేయడం మొదలు పెట్టాయి.
మంచి కథల ద్వారా మంచి ఆలోచనలు, కొత్త తోవలు, కొత్త అలవాట్లు ఏర్పడుతాయి. కష్ట సమయంలో వున్న వ్యక్తిని కొన్ని కథలు పైకెత్తుతాయి. వాళ్లలో ధైర్యాన్ని నింపుతాయి.

మన అనుభవాన్ని ఓ మంచి కథగా మనం చెప్పినప్పుడు అందులో మనం చెప్పదలచుకున్న విషయాన్ని, అభిప్రాయాన్ని విడమరిచి చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆ విషయాన్ని పాఠకుడు గ్రహిస్తాడు. అదే కథకు వున్న ఆకర్షణ. కథలోని గొప్పతనం.

మనం నేర్చుకున్న విషయాలని ఇతరులకి కథల రూపంలో చెబుతాం. ప్రపంచం గురించి మన అవగాహనని, మనం చూసిన కోణాన్ని ఇతరులకి తెలియజెబుతాం. అవి కథల రూపంలో చెప్పినప్పుడు హృదయానికి హత్తుకుంటాయి.

“నేను ఎప్పుడూ చూసే పెన్సిల్ లాంటిదే ఇది. ఇందులో ప్రత్యేకత ఏమీ కనిపించడం లేదు” అన్నాడు మనవడు.

మంచి కథలు మనల్ని ఉల్లాసపరుస్తాయి. ఉత్తేజపరుస్తాయి. మంచి మార్గం వైపు నడిపిస్తాయి. మనలో నిద్రిస్తున్న మానవత్వాన్ని తట్టి లేపుతాయి. మనకు కర్తవ్యాన్ని బోధిస్తాయి.అలాంటి కథే పాల్ కొహెలో పెన్సిల్ కథ .

పెన్సిల్ లోని లెడ్ క్వాలిటీని బట్టి పెన్సిల్లని మనం కొంటూ ఉంటాం. పైకి కనిపించే కర్ర ముక్క కన్నా లెడ్ మనకి ముఖ్యమైనది. పెన్సిలిన్ లోని లెడ్ ఎంత ముఖ్యమైనదో అది రాసే రాత అంతకన్నా ముఖ్యమైనది. మనిషి విషయమూ అంతే.

పాల్ కొహెలో రాసిన ‘లైక్ ద ఫ్లోయింగ్ రివర్’ అన్న పుస్తకాన్ని ఈ మధ్య చదివాను. అతను నాకు కొత్త.

కానీ మా పిల్లలకి కాదు. అతని ఆలోచనలు ,ప్రతి స్పందనల గురించి నేను పిల్లలకి చెబితే,వాళ్ళు అతని ఆల్ కెమిస్ట్ నవల గురించి చెప్పారు. ఈ పుస్తకంలో అతను విన్న కథలు, అతని అనుభవాలు ఉన్నాయి. మనకి ఆలోచన కలిగించే విధంగా అతని అభిప్రాయాలు ఉన్నాయి. ఇందులో నాకు నచ్చిన కథ “పెన్సిల్ కథ.”

ప్రపంచవ్యాప్తంగా అతని రచనల్ని చాలా మంది ఎక్కువగా చదువుతున్నారు. అతని పుస్తకాలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. అల్కెమిస్ట్ 75 మిలియన్ల పుస్తకాలు ఇప్పటిదాకా అమ్ముడుపోయాయి.

పాల్ కొహెలో బ్రెజిల్లో పుట్టాడు. ప్రపంచవ్యాప్తంగా అతని రచనల్ని చాలా మంది ఎక్కువగా చదువుతున్నారు. అతని పుస్తకాలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. అల్కెమిస్ట్ 75 మిలియన్ల పుస్తకాలు ఇప్పటిదాకా అమ్ముడుపోయాయి. దాదాపు 80 భాషల్లోకి అనువదించబడ్డాయి. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు అతనికి వచ్చాయి. ఉత్సాహపరిచే రచనలని అతను చేస్తారు. అతను రాసే కాలమ్స్ సిండికేట్ గా ఏర్పడి ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. వివిధ పత్రికల్లో అతని రచనలు కనిపిస్తాయి. ఇక పెన్సిల్ కథ కి వస్తాను.

నానమ్మ రాస్తున్న ఉత్తరాన్ని చూస్తూ కూర్చున్నాడు ఓ బాలుడు. అలా చూస్తూ చూస్తూ కాసేపటికి ఓ మాట ఆమెను అడిగాడు.

ఈ రోజు మనం ఏం చేశామో దాని గురించి కథ రాస్తున్నావా లేక లేక నా గురించి కథ ఏమైనా రాస్తున్నావా నానమ్మ.”

రాస్తున్న ఉత్తరాన్ని ఆమె ఆపేసింది. అతని వైపు చూస్తూ ఇలా అంది.

నేను నిజం గా నీ గురించి రాస్తున్నాను. నిజానికి నేను రాస్తున్న అక్షరాలు రాయడానికి నేను వాడుతున్న పెన్సిల్ ముఖ్యమైనది. నువ్వు పెద్దయ్యాక ఈ పెన్సిల్ ని చాలా ఇష్టపడతావు.”

ఆశ్చర్యంగా అతను ఆ పెన్సిల్ వైపు చూశాడు. ఆ పెన్సిల్ లో అతనికి ఏమీ ప్రత్యేకత కనిపించలేదు.

“నేను ఎప్పుడూ చూసే పెన్సిల్ లాంటిదే ఇది. ఇందులో ప్రత్యేకత ఏమీ కనిపించడం లేదు” అన్నాడు మనవడు.

పెన్సిల్ ని చెక్కడానికి షార్పనర్ ని వాడతాను. అది పెన్సిల్ ని బాధ పెడుతుంది. ఆ బాధ కొద్దిసేపే. ఆ తర్వాత పెన్సిల్ సార్పెనర్ కన్నా చాలా షార్ప్ గా తయారవుతుంది.

“ఏ వస్తువు నైనా నువ్వు చూసే పద్ధతిని బట్టి అది నీకు కనిపిస్తుంది. ఈ పెన్సిల్ కి ఐదు ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. వాటిని నువ్వు చూడగలిగితే చాలా ప్రశాంతంగా ఉంటావు. ఈ ప్రపంచంలో ఎవరూ వాటిని ఈ లక్షణాలని ఎవరు గ్రహించినా వాళ్ళు అత్యంత ప్రశాంతంగా ఉంటారు.” అంది నానమ్మ.

“అలాగా !అవి ఏం ప్రత్యేకతలు”అడిగాడు మనవడు.

మొదటి ప్రత్యేకత -నువ్వు చాలా ప్రత్యేకతలు కలిగి ఉన్న వస్తువులను ఎన్నో కలిగి ఉండవచ్చు. నిన్ను మార్గదర్శకత్వం వహించే హస్తం ఒకటి ఉంది. ఆ శక్తినే మనం భగవంతుడు అని అంటున్నాం. అతని తన ఇష్ట ప్రకారం మనకి మార్గ దర్శకత్వం వహిస్తున్నాడు.

రెండో ప్రత్యేకత -అప్పుడప్పుడు నేను రాయడం ఆపేస్తాను. పెన్సిల్ ని చెక్కడానికి షార్పనర్ ని వాడతాను. అది పెన్సిల్ ని బాధ పెడుతుంది. ఆ బాధ కొద్దిసేపే. ఆ తర్వాత పెన్సిల్ సార్పెనర్ కన్నా చాలా షార్ప్ గా తయారవుతుంది. అందుకని నువ్వు దీని నుంచి కొన్ని సంగతులు తెలుసుకోవాలి. మీ బాధలని మీ కష్టాలని భరించాలి. అంటే అవి నిన్ను మంచి మనిషిగా తయారుచేస్తాయి.

మూడవ ప్రత్యేకత -మనం చేసిన తప్పులని రబ్బర్ తో తుడిచి వేయడానికి ఈ పెన్సిల్ అనువైన పరిస్థితులని కల్పిస్తుంది. ఒక విషయాన్ని సరిచేయడానికి మనం మళ్లీ ఒక తప్పు పని చేయాల్సిన అవసరం లేదు. మళ్లీ మనం న్యాయమైన ప్రయాణం చేయడానికి ఈ పెన్సిల్ దారి ని ఏర్పరుస్తుంది.

నాలుగవ ప్రత్యేకత-పెన్సిల్ అంటే బయటకు కనిపించే కట్టె ముక్క కాదు ఇందులో ఉండే లెడ్. అందుకని మీ లోపల జరుగుతున్న ఘర్షణ పట్ల మీ దృష్టిని కేంద్రీకరించమని చెబుతుంది.

కథ చెప్పడం నానమ్మ ముగిస్తుంది. మనవడు ఆలోచనలో పడతాడో లేదో తెలియదు కానీ జాగ్రత్తగా చదివిన వాళ్లు మాత్రం ఆలోచనలో పడిపోతారు.

చివరగా, ఈ పెన్సిల్ కి ఉన్న ఐదవ ప్రత్యేకత- అది ఒక గుర్తు ని వదిలి వెళ్ళుతుంది. నిజంగా జీవితంలో ప్రతిదీ ఒక గుర్తుని వదిలి పెడుతుంది. అందికే ప్రతి పనిని చాలా చేతనలో ఉండి చేయాల్సి ఉంటుంది.

కథ చెప్పడం నానమ్మ ముగిస్తుంది. మనవడు ఆలోచనలో పడతాడో లేదో తెలియదు కానీ జాగ్రత్తగా చదివిన వాళ్లు మాత్రం ఆలోచనలో పడిపోతారు.

ఈ కథ మనల్ని ఉత్సాహపరుస్తుంది. మనం ఒక ప్రత్యేకమైన మనిషి అన్న విషయాన్ని గుర్తు చేస్తుంది ప్రతి మనిషి జీవితానికి ఒక పర్పస్ ఉందని కూడా చెబుతోంది.

ఎవరూ ధైర్యం చెప్పాల్సిన పని లేదు. జీవితం అల్పమైనదని అనుకోవడానికి వీలు లేదు.
ఒక ప్రత్యేకమైన పని చేయడానికే ప్రత్ మనిషి పుట్టాడని ఈ కథ చెప్పకనే చెబుతుంది.

‘జింబో’ కలం పేరుతో సాహితీ లోకానికి చిరపరిచితులైన మంగారి రాజేందర్ కవీ, కథకులు. సామాన్యుల పక్షాన న్యాయ వ్యవస్థపై అనేక రచనలు వెలువరించిన ‘తరాజు’. తెలుపు కోసం ప్రతి ఆదివారం ‘కథా కాలమ్’ రాస్తున్నారు. తొలి వారం కథనం ఇక్కడ క్లిక్ చేసే చదవవచ్చు. 2 వ వారం, ఆ రాత్రి అన్నం ముందు కూర్చున్నప్పుడు. ౩ వ వారం ఒక కథ ఎలా రూపు దిద్దుకుంది!.  4 వ వారం గుల్జార్ చెప్పిన కథ. 5 వ వారం పిల్లలే నయం. 6 వ వారం కథనం ఇది…కథలు దృక్పథాలని మారుస్తాయా? 7 వ వారం అమరావతి కథలు తెలుపు.

ఎములాడ ‘రాజేందర్’ పరిచయం

వృత్తిరీత్యా జిల్లా సెషన్స్ జడ్జిగా, జ్యుడీషియల్ అకాడెమీ డైరెక్టర్ గా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యునిగా పనిచేసి, పదవీ విరమణ చేసిన రాజేందర్ గారు అందరికీ న్యాయం అందాలని  కల్పనాత్మక రచనలతో పాటు వారు న్యాయం, ధర్మం గురించిన అనేక రచనలు చేస్తూ వస్తున్నారు. ఒక్క మాటలో అయన వృత్తీ ప్రవృత్తీ వ్యావృత్తీ అన్నీ కూడా రచనలుగా ఆవిష్కారం కావడం అదృష్టం అనే చెప్పాలి. 

ఎములాడ రాజన్న పాదాల ముందు జన్మించిన ఈ తెలంగాణ బిడ్డ ‘మా వేములవాడ కథలు’, ‘రూల్ ఆఫ్ లా’, ‘కథలకి ఆవల’, ‘ఓ చిన్న మాట’ వంటి కథా సంపుటులు వెలువరించారు. రాబోయే సంపుటులు “నాల్ల కోటు”, మా వేములవాడ కథలు-2″. కవిత్వానికి వస్తే ‘హాజిర్ హై’ అంటూ నేర న్యాయ వ్యవస్థపై మరే కవీ రాయలేని కవిత్వం రాసిన జింబో ‘లోపలివర్షం’, ‘చూస్తుండగానే’ పేరిట ఇతర కవితా సంపుటులు తెచ్చారు. ఈ మధ్య వచ్చిన కవితా సంపుటి -“ఒకప్పుడు” కాగా రాబోయే కవితా సంపుటి -“ఒక్క కేసు చాలు”.  ఇవి కాకుండా వారు చాలా పుస్తకాలని వెలువరించారు.  

జింబో e-mail: rajenderzimbo@gmail.com

 

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article