Editorial

Sunday, November 24, 2024
శాసనంశాసనం తెలుపు - నిర్వహణ సూర్యకుమార్

శాసనం తెలుపు – నిర్వహణ సూర్యకుమార్

Shasanam
ఈ రోజున చెక్కు చెదరని గుర్తులను యాది చేసే చరిత్రకారుడి  శీర్షికే ‘శాసనం తెలుపు’

తారీఖు మే 24

  • క్రీ.శ. 1556 మే 24 నాటి రాయదుర్గం శాసనంలో సదాశివరాయల పాలనలో రాయదుర్గంశీమలోని అగ్రహారాలలో హసానిద్యగాండ్లు (?)అన్యాయంగా తీసుకున్న పన్నులను వారివారి అగ్రహారాల దేవస్థానాలకి, కాలువలు నీరుకట్టడానికి మహామండలేశ్వర రామరాజువిఠలరాజు తిరుమలయ్య దేవమహారాజు సర్వమాన్యంచేసి తిరిగి యిచ్చేసినట్లుగా చెప్పబడ్డది.[ద.భా.దే.శా XVI నెం.210].
  • అట్లే అదే రోజున యివ్వబడిన కూడ్లూరు (బళ్ళారి జిల్లా) శాసనంలో సదాశివరాయల పాలనలో మహామండలేశ్వర రామరాజు విఠలరాజు తిరుమలదేవయ్య మహారాజు కూడ్లూరు అని పిలవబడే రెడ్డిరాజపురాన్ని సర్వమాన్యపు అగ్రహారంగా విద్వన్మహాజనులకిచ్చినట్లుగా చెప్పబడ్డది. [XVI నెం. 211.].ఈ రోజున చెక్కు చెదరని గుర్తులను యాది చేసే చరిత్రకారుడి  శీర్షికే ‘శాసనం తెలుపు’
  • అట్లే అదేరోజున యివ్వబడిన భూపతిసముద్రం (అనంతపురం జిల్లా) శాసనంలో తిరుమల దేవమహారాయలు సర్వమాన్యం చేసి యిచ్చిన అగ్రహారాలనుండి అన్యాయంగా మణిహాగాండ్లు (అధికారులు) వసూలుచేసిన పన్నులపై విచారణచేసి తప్పుచేసిన వారినుండి అపరాధం పన్ను వసూలుచేసి తిరిగి ఆయా గ్రామాల దేవస్థానాలకు,చెరువులు కాలవలు నడిపించుటకు తిరిగి యిచ్చునట్లుగా కట్టడి చేసినట్టుగా చెప్పబడ్డది. [XVI నెం. 212].
  • అట్లే అదేరోజున యివ్వబడిన ఎళహంగి (బళ్ళారి జిల్లా)శాసనంలో కూడా యిదేవిషయం చెప్పబడ్డది.[ద. భా. దే.శాXVI నెం 213].అట్లే 1575 మే 24 నాటి కుంచెపల్లి (ప్రకాశంజిల్లా)శాసనంలో శ్రీరంగరాయమహారాజు రాజ్యం చేస్తుండగా వెలుగోటి కుమార తిమ్మానాయనింగారు పొదిలిసీమలోని కుంచెపల్లి గ్రామాన్ని అత్నోగాచార్యులవారికి ధర్మం యిచ్చినట్లుగా చెప్పబడ్డది.[నెల్లూరు జిల్లా శాసనాలు III Po 27].

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article