Editorial

Monday, December 23, 2024
Peopleరేణుకా చౌదరికి ఏమైంది? : 'మెరుగుమాల' విశ్లేషణ

రేణుకా చౌదరికి ఏమైంది? : ‘మెరుగుమాల’ విశ్లేషణ

రెడ్లను, కమ్మలను, వెలమలను, కాపులను ‘తొక్కేయడం’ కుదిరే పనేనా?

రేణుకా చౌదరికి మతి తప్పలేదు కదా!

మెరుగుమాల నాంచారయ్య

‘రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కమ్మ సామాజికవర్గాన్ని తొక్కేస్తున్నారు. ఎన్నికలప్పుడు పార్టీ ఫండ్ కోసం వాడుకుంటున్నారు. ఆ తర్వాత పక్కన పెట్టేస్తున్నారు,’ అని ప్రస్తుత కాంగ్రెస్ కేంద్ర మాజీ మంత్రి, ఖమ్మం మాజీ ఎంపీ రేణుకా చౌదరి నిన్న హైదరాబాద్ కాంగెస్ ఆఫీసు గాంధీభవన్ లో మీడియా సమావేశంలో వాపోయారు.

రాజమండ్రికి చెందిన ఎయిర్ కమోడర్ కానుమల్లి సూర్యనారాయణరావు గారి పెద్ద కూతురైన రేణుక గారు ఇలా కులం పేరుతో ఏడుపు మాటలు మాట్లాడడం ఇదే మొదటిసారి.

ఇంటిపేరు రాసుకోకుండా చౌదరి అనే మాటను పేరు చివర పెట్టుకున్న పారిశ్రామిక వేత్త శ్రీధర్ చౌదరి గారి భార్యగా, రిటైర్డ్ సైనికాధికారి కూతురిగా రేణుకమ్మ ఇలా సొంత కులాన్ని ‘అవసరం లేకుండా’ కాపాడే ప్రయత్నం చేయడం ఎందుకో మరి? కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ఖమ్మం జిల్లాల కమ్మల మాదిరిగా గోదావరి తీరాల ‘కమ్మోరు’ ఎంతోకొంత ‘ప్రజాస్వామికంగా’, ‘ప్రగతిశీలంగా’, నాగరీకుల్లా ఉండరని, కాస్త పొగరుగా ఉంటారని మా గుడివాడలో ఉన్నప్పటి నాలోని Prejudice నిజమనేనని రేణుకా చౌదరాణీ మాటలు నిరూపిస్తున్నాయి.

20 సంవత్సరాలు నిండని వయసులో 1970లలో విశాఖపట్నంలో జీన్స్ ధరించి, రాయల్ ఎన్ ఫీల్డ్ బులెట్ నడిపిన కమ్మ మహిళ – సొంత కులానికి అన్యాయం జరుగుతోందని ఇలా గావుకేకలు పెట్టడం ఏమాత్రం బాగోలేదు.

కృష్ణ-గుంటూరు కమ్మలు వాస్తవానికి గోదారి జిల్లాల స్వకులస్తుల నుంచే ఈ చౌదరి అనే మాటను కమ్మకు పర్యాయపదంగా వాడడం నేర్చుకున్నారని నాకో పెద్ద డౌటానుమానం. గోదారి రాజులు, బలిసిన కాపులు, అనపర్తి ప్రాంత రెడ్ల సాంగత్యం వల్ల గోదావరి కమ్మలు ఎక్కువ ఫ్యూడల్ పోకడలు పోతున్నారో లేక వారి ‘డీఎన్ఏ’ ప్రకారం నడుచుకుంటున్నారో తెలీడం లేదు. ఏదేమైనా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఎయిర్ కమోడర్ కే ఎస్ రావు గారి ఇంట్లోనే ఇంకా నివాసముంటున్న వారి పెద్దమ్మాయి గోదావరి తీరాన పెరిగి పెద్దది కాకపోయినా గోదారి సౌదర్ల శైలీలో 66 ఏళ్లు దాటాక మాట్లాడడం తెలుగు సమాజానికి ఎనలేని నష్టం. ఏపీలో త్వరలో జరగబోయే ‘విపత్తు’కు సంకేతం.

20 సంవత్సరాలు నిండని వయసులో 1970లలో విశాఖపట్నంలో జీన్స్ ధరించి, రాయల్ ఎన్ ఫీల్డ్ బులెట్ నడిపిన కమ్మ మహిళ – సొంత కులానికి అన్యాయం జరుగుతోందని ఇలా గావుకేకలు పెట్టడం ఏమాత్రం బాగోలేదు. అన్ని రాజకీయ పార్టీలనూ పోషించే వ్యవసాయాధారిత అగ్రకులాల ఆడపడచుల కన్నీరు ఎవరికీ మంచిది కాదు.

రేణుకమ్మకు బంజారాహిల్స్ ఒకటో నంబర్ రాస్తాలో దర్జాగా బతుకుతున్న గునుపాటి అపర్ణా ‘పింకీ’ రెడ్డి  అయినా దగ్గరలోని 5* హోటల్ కు తీసుకుపోయి వాస్తవ పరిస్థితి విడమరిచి చెబితే బాగుంటుంది.

కోడూరి ఎసెస్ రాజమౌళి, వెలమకుచ వెంకటరమణా రెడ్డి (దిల్ రాజు), కొణిదెల చిరంజీవి, ఆకెళ్ల త్రివిక్రమ శ్రీనివాస్, ఉప్పలపాటి ప్రభాస్ రాజు కులాల్ని తెలుగునాట ‘తొక్కి నారదీయడం’ ఎవరివల్ల అయినా అయ్యే పనేనా?

రేణుకమ్మకు బంజారాహిల్స్ ఒకటో నంబర్ రాస్తాలో దర్జాగా బతుకుతున్న గునుపాటి అపర్ణా ‘పింకీ’ రెడ్డి (టీ సుబ్బరామిరెడ్డి కూతురు, జీవీకే రెడ్డి కోడలు) అయినా దగ్గరలోని 5* హోటల్ కు తీసుకుపోయి వాస్తవ పరిస్థితి విడమరిచి చెబితే బాగుంటుంది.

తెలుగునాడుకు రెండు కళ్లుగా నావంటి బుద్ధిలేని జీవులు భావించే రెండు కులాల మధ్య ఆమాత్రం కోఆపరేషన్ ఉండాలి మరి.

మెరుగుమాల నాంచారయ్య సీనియర్ పాత్రికేయులు. ఉదయం, వార్త దిన పత్రికల్లో పనిచేయడమే కాక ఈనాడు, సాక్షి జర్నలిజం కళాశాల అధ్యాపకులుగా వారు సుశిక్షితులైన యువ పాత్రికేయులను అందించిన మార్గదర్శి. నిశితమైన విశ్లేషకులుగా వారు పాఠకులకు పరిచితులే. మనదేశ వాస్తవికత అయిన కులాన్ని, దాని విస్తృతిని వారు లోతుగా అధ్యయనం చేయడమే కాక అనేక శ్రేణుల్లో. పలు రంగాల్లో దాని అనివార్య ప్రభావాన్ని వారు రచించే కథనాల ద్వారా వివరించడం తన ప్రత్యేకత.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article