మనం ధైర్యంగా మాట్లాడలేని ఎన్నో విషయాల్లో పిత్తు ఒకటి. పోర్నోగ్రఫీ గురించి పబ్లిక్ గా మాట్లాడటం పిత్తుగురించి మాట్లాడటం ఒకటే అనే అభిప్రాయం ఎంతోమందిలో ఉంటుంది. ఈరోజుటీకీ విప్లవ కారులూ కారిణిలూ తామెంతో ధైర్యంగా తమతమ పర్సనల్ విషయాల్ని బాహాటంగా కుండబద్ధలు కొట్టినట్టు చెప్పగలిగేవారు సైతం..తాము పిత్తే పిత్తుల గురించి చెప్పడమూ లేదా పోస్టులు పెట్టడమూ చూడము.
డాక్టర్ విరించి విరివింటి
ఆధునిక రచయితలు పిత్తుల గురించి రాయాలంటే తెగ ఇబ్బంది పడతారు గానీ పురాతనకాలం రచయితలు బాగా రాశారు. జొనాథన్ స్విఫ్ట్, డాంటే, ఛాసరూ వీటి గురించి రాశారు. బెంజిమన్ ఫ్రాంక్లిన్ “గర్వంగా పిత్తండి'” అంటూ వ్యాసమే రాశాడు. షేక్స్పియరు కనీసం ఐదుసార్లయినా తన నాటకాల్లో ‘పిత్తు’ను గురించి ఉటంకించి ఉంటాడుట.
తెనాలి రామలింగడి పిత్తుకథైతే మనకు తెలిసిందేనాయ. పిత్తులను రెండు రకాలుగా విభజించి పుణ్యం కట్టుకున్నది తెనాలి రామలింగడే అనుకుంటాను. డర్రు పిత్తు. తుస్సు పిత్తు. డర్రు పిత్తు భయంనాస్తి, తుస్సు పిత్తు ప్రాణసంకటం అని చెప్పి కృష్ణదేవరాయలకు హితబోధ చేసింది ఆయనేట. నా దృష్టిలో మూడోరకం పిత్తు కూడా ఉంది. అది జొన్నపిత్తు. కంపు వాసన, భయంకర శబ్దంతో పాటు లోపలి కౌపీనంకు జొన్న విత్తుల వలె అంటుకునే మలమూ కూడా ఉంటుంది. అది పద్యాలు పాడేటపుడు ముఖంనుంచి వెలివడే తుంపర్లవంటిది.
సల్ఫర్ డై ఆక్సైడ్ కుళ్ళిన కోడిగుడ్డు వాసన వేయడం వలన దాని మహత్యం ఇంతింతని చెప్ప తరం కానిది.
జీర్ణక్రియ జరిగే సమయంలో జీర్ణాశయంలోని వివిధ బ్యాక్టీరియాలు ఈ గ్యాసు ఉత్పత్తికి కారణాలు.
హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్, మీథేన్ వంటివి ఆ పిత్తులో ఉంటాయి. సల్ఫర్ డై ఆక్సైడ్ కుళ్ళిన కోడిగుడ్డు వాసన వేయడం వలన దాని మహత్యం ఇంతింతని చెప్ప తరం కానిది. వాతావరణంలో గల మీథేన్ లో 11% చెదపురుగులు పిత్తడం వలననే ఐతే ఆ తరువాతి స్థానం మనిషిదే.
మీరు నమ్ముతారో లేదోగానీ మనుషులందరు ఒకే సారి కనుక పిత్తితే ఒక హైడ్రోజన్ బాంబు అంతటి శక్తి ఉంటుందట అందులో. అంతేకాదు, ఆపరేషన్ థియేటర్లలో కడుపును కోసినపుడు లోపల ఉన్న గ్యాసంతా ఒక్కసారి బయటకు వచ్చి పేలుడు సంభవించడం కూడా జరుగుతూ ఉంటుంది. అందుకే పిత్తితే ఆరోగ్యానికి మంచిదని వైద్యశాస్త్ర పితామహుడైన హిపోక్రేటసూ తేల్చిపడేశాడు.
ఆయన స్పీచ్ వీడియోలు చూస్తున్నపుడు ఆయన ముఖ కవళికల ఆధారంగా ఎపుడెపుడు పిత్తి ఉంటాడోననే పరిశోధన ఒకటి మొదలైందట.
హిట్లర్ కు ఉండే జబ్బుల్లో ఈ పిత్తుల జబ్బూ ఒకటి. ఆయన వాటిని తగ్గించుకోవడం కోసం నానా అవస్థలూ పడేవాడంట. 28 రకాల మందులూ వాడేవాడంట. ఐనా కానీ తగ్గేవి కాదంట. కానీ ఆయన పిత్తు వాసన గురించి కంప్లైంట్ చేసే సాహసం ఎవరూ చేసేవారు కాదట. ఆ లెక్కన ఆయన స్పీచ్ వీడియోలు చూస్తున్నపుడు ఆయన ముఖ కవళికల ఆధారంగా ఎపుడెపుడు పిత్తి ఉంటాడోననే పరిశోధన ఒకటి మొదలైందట. ఐతే హిట్లర కాదు సకల ఫాసిస్టులూ సకల జాతి విద్వేషకులకూ పిత్తుల బాధ ఉంటుందనేది శాస్త్రం. వారికి కడుపులో అరుగుదల కాక గ్యాసు పెరిగిపోయి వాళ్ళుఅలా విద్వేష పూరితంగా ప్రసంగాలు చేస్తారా లేక విద్వేష పూరిత ప్రసంగాలు చేయడం వలన గ్యాసు పెరిగాందా అనేది ఇంకా పరిశోధనలకు అందలేదు.
దేశదేశాధి నాయకుల ప్రసంగాలను ముఖకవళికల ఆధారంగా పిత్తిన సమయాలను వారు పదాలను వత్తి పలుకుతున్న సమయాలనూ బేరిజు చేసి ఒక్కో నేత తన ప్రసంగంలో ఎన్ని సార్లు పిత్తాడో తెలియజేసే శాస్త్రం ఒకటుంది. మనం కూడా దానిని గమనించవచ్చు.
ఐతే సముద్ర మట్టానికి ఎంత ఎత్తుకు పోతే అంత ఎక్కువ గ్యాసు కడుపులో పుడుతుంటుంది. అందుకే విమాన ప్రయాణికుల కడుపు గుడగుడా అవుతుంటుంది. విమానాల్లో మరో ప్రాబ్లం ఏమంటే కడుపులో చేరిన గ్యాసు బయటకు వచ్చాక air comepression వలన అది విమానమంతా చుట్టలు చుట్టుకుని ఉంటుంది. గంటకు ఎనిమిది మైళ్ళ వేగంతో ప్రయాణించే ఈ పిత్తు విమానంలో కొన్ని రకాల వైరస్ లు ఒకరినుంచి ఒకరికి పాకడానికీ ఆస్కారాన్ని పెంచుతుంది.
కాబట్టి చెప్పొచ్చేదేమంటే కరోనా వ్యాప్తి విషయంలో పిత్తుల ప్రాధాన్యత జొన్న పిత్తుల ప్రాధాన్యత తీసివేయతగ్గది కాదు. డ్రాప్లెట్స్ వలెనే మైక్రో డ్రాప్లైట్స్ వలెనే జొన్న పిత్తులు కూడా వైరస్ ను వ్యాపింప చేయగలవు. తస్మాత్ జాగ్రత.
అక్షరం సైతం చక్కటి హస్తవాసిగా గల వైద్యుడు డాక్టర్ విరించి విరివింటి.
తాను కవీ, రచయితా షార్ట్ ఫిల్మ్ మేకర్. ‘రెండో అధ్యాయానికి ముందుమాట’ తొలి కవితా సంపుటి.