రేపు సాయంత్రం ఆరు గంటలకు రవీంద్రభారతిలో శృతిలయ సీల్ వెల్ ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారాల ప్రదానోత్సవం. ఈ ఏటి పదకొండు మంది పురస్కార గ్రహీతలకు అభినందనలు తెలుపు
శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, సీల్ వెల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యం లో గత రెండు దశాబ్దాల నుంచి ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారాలను 2022వ సంవత్సరం కోసం నేడు ప్రకటించారు. శృతిలయ చైర్మన్ డాక్టర్ బి.భీమ్ రెడ్డి, ఆమని, సీల్ వెల్ కార్పొరేషన్ సిఎండీ బండారు సుబ్బారావు తో కలసి అవార్డ్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ మహ్మద్ రఫీ ఆయా వివరాలు వెల్లడించారు. ప్రముఖుల సమక్షం లో ఈ నెల 20 వ తేది అంటే రేపు సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతి లో ఈ పురస్కారాల ప్రదానోత్సవం జరుగుతుంది.
శృతిలయ – సీల్ వెల్
ఉత్తమ పాత్రికేయ జీవన సాఫల్య పురస్కార గ్రహీత
శ్రీమతి ఎం.శైలజ సుమన్
పూర్వ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, దూరదర్శన్, అల్ ఇండియా రేడియో
ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కార గ్రహీతలు
శ్రీ రవిచంద్ర ,
సీనియర్ కరెస్పాండంట్, Tv9
శ్రీ బుద్ధి యజ్ఞమూర్తి,
ఎడిటర్, తెలుగు వన్
శ్రీ అంజాద్ బాబు,
ఎంటర్ టైన్ మెంట్ హెడ్, సుమన్ టీవీ
శ్రీమతి రూప వాణి కోనేరు,
CVR హెల్త్ ఛానెల్ హెడ్
శ్రీమతి సుమబాల,
సీనియర్ సబ్ ఎడిటర్, ఆసియా నెట్ తెలుగు న్యూస్
శ్రీ మురళీధర్ చామర్తి,
సిటీ బ్యూరో చీఫ్, ఆంధ్రజ్యోతి
శ్రీమతి మాధవి సిద్ధం,
హెల్త్ కరెస్పాండెంట్ యాంకర్, Tv5
శ్రీమతి నిర్మల రెడ్డి,
చీఫ్ రిపోర్టర్, సాక్షి
శ్రీమతి ఎన్.దేవి,
సీనియర్ న్యూస్ ప్రెజెంటర్, Ntv
శ్రీ కె.ఎన్.హరి
సీనియర్ ఫోటో జర్నలిస్ట్, నవ తెలంగాణ
పురస్కార గ్రహీతలకు అభినందనలు