Editorial

Tuesday, May 13, 2025
Songపసిడి కాంతుల దివ్వెలపై ప్రసన్నా విజయ్ కుమార్ పాట

పసిడి కాంతుల దివ్వెలపై ప్రసన్నా విజయ్ కుమార్ పాట

 

రచన త్రిపురారి పద్మ. గానం ప్రసన్నా విజయ్ కుమార్

ప్రసన్నా విజయ్ కుమార్ ఆలపించిన ఈ పాట పిల్లలకు మల్లే, పసిడి కాంతుల దివ్వెలకు మల్లే అమృత తుల్యం. వినండి. ప్రతి చరణం వివిధాలుగా అమ్మ ఒడిలో విరిసిన ఆ నవ్వులను లలిత లలితంగా పంచు. తల్లి వంటి అనురాగం తెలుపు.

ఈ పాట రచన శ్రీమతి త్రిపురారి పద్మ. వారు జనగామ జిల్లా నీర్మాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. వారు చక్కటి కవి, కథకులు, వ్యాఖ్యాత కూడా. మౌనవీణ వచన కవితా సంపుటితో సహా చిద్విలాస శతకము, పూలదండ, అమృత లేఖలు వంటి పుస్తకాలు వెలువరించారు. భోధనతో పాటు పిల్లలకోసం పలు కార్యకలాపాలు చేపడుతూ వారి సాహిత్య  సాంస్కృతిక వికాసానికి పాటు పడుతున్నారు. ఈ ఒక్క పాట వృత్తి రీత్యానే కాదు, ప్రవృత్తి రీత్యానూ వారి గురుతర బాధ్యతని, పిల్లల పట్ల వారికున్న ఆదరణ, అనురాగాన్ని తెలుపు.

ఈ ఒక్క పాట వృత్తి రీత్యానే కాదు, ప్రవృత్తి రీత్యానూ రచయిత్రి గురుతర బాధ్యతని, పిల్లల పట్ల వారికున్న ఆదరణ, అనురాగాన్ని తెలుపు.

ఇక ప్రసన్న గారు గురించి రెండు మాటలు. పువ్వు పుట్టగానే పరిమళించినట్టు వారు బాల్యం నుంచే పాటలు పాడుతూ పలువురి ప్రశంసలు పొందారు. శ్రీ దొరవేటి చెన్నయ్య గారి వద్ద గానంలోనే కాదు, నృత్యంలోనూ శిక్షణ పొందారు. వీరు కూడా వికారాబాద్ జిల్లా మన్నెగూడలో ఉపాధ్యాయురాలు. తెలుపు టివి కోసం తన పాటలతో ఎక్కడున్నా మనల్ని పారవశ్యం చెసి చక్కటి అనుభూతి పొందేలా చేస్తున్నారు.

ఇరువురికీ ధన్యవాదాలు తెలుపు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article