అంకురించిన విత్తనం
మొక్కై
చెట్టై
ఫలమై
పుష్పమై
వికసిస్తుంది
పిల్ల కాలువలై
గలగలా పారే
రాత్రీ పగలూ
కాలచక్రపు భ్రమణానికి
నిలువుటద్దం
కాలం మెడలో
పచ్చలహారం
రుతువుల ఆగమనం
ప్రకృతి ర్యాంపుపైకి
తోసుకొచ్చి
వెలుగులీనే
రంగుల సింగిడీలు
కరిగిపోయే కాలం
ఎండను మింగే మంచు ముద్ద
ఒడిసిపట్టే కళ
ఆకాశానికి నిచ్చెన
ఓటమిని వెంబడించే పరుగు
పరుగును వెంటాడే ఓటమి
పిల్లీ ఎలుకల శాశ్వత వైరం
మార్పే నిత్య ప్రవాహం