ఒక గొప్ప డాక్టర్ నే కాక ఒక గొప్ప బోధకుడిని కలిసిన ఆనందంతో బయటకు నడిచాను. ఆయన నాకు ఆఫ్తాల్మాలజీ ఏమీ బోధించకున్నా జీవితానికి సరిపడా అనుభవాన్ని జీవిత దృక్పథాన్ని మార్చగల కొత్త కోణాన్ని నాకు అందించారు.
డాక్టర్ విరించి విరివింటి
ఈ మధ్య ఒక మెడికల్ కాలేజీలో ఒక కంటి డాక్టర్ ని వారి ఓపీలో కలిశాను. ఒక ఐడియల్ టీచర్ అనే వ్యక్తి ఎలా ఉంటారో ఆయన అలా కనిపించారు. ఈ ప్రపంచంనుండి ఈ గోలల నుండీ ఈ రొచ్చునుండీ ఆయన చాలా దూరంగా ఉన్నారు. చదువు, పేషంట్లు , స్టూడెంట్లు ఇవే ప్రపంచంగా ఓ సుందరమైన ప్రపంచాన్ని ఆయన ఏర్పరచుకున్నారు. అందరినీ ప్రేమించడంలో ఉండే ఆనందాన్ని ఆయన నాతో పంచుకున్నారు.
“నేను ఇక్కడ ఓపీలో నా స్టూడెంట్స్ కి ఏమీ నేర్పించను. ఆపరేషన్ థియేటర్ లోపలనే నా అసలైన టీచింగ్ ఉంటుంది ” అన్నారాయన. ఒక దేశానికి కావలసిన experts ని తయారు చేయడంలో తన జీవితాన్నీ శక్తినీ ధారపోయడంలో ఉండే ఆనందం ఆయన మాటల్లో అణువణువునా కనిపించింది.
కంటి ఆపరేషన్లు చేయాలంటే డాక్టర్లకు ఫైన్ స్కిల్స్ అవసరం. చిన్న చిన్న శరీర భాగాలపై కత్తి పెట్టడమంటే మామూలు విషయం కాదు. కత్తిగాటు కావలసినంత కంటే మైక్రోమీటరంత ఎక్కువగా కత్తి జరిగినా జరిగే నష్టం అపారం. తీక్షణమైన చూపు ధృఢమైన శారీరక పటుత్వం చేతి వేళ్ళలో చురుకుదనం మెదడులో విషయ పరిజ్ఞానం రిస్క్ తీసుకోగలిగే ధైర్యం ఇవన్నీ ఒక స్టూడెంట్ లో ఉండాలని ఆశిస్తారు ఆయన.
టీచింగ్ అంటే ఇవన్నీ లక్షణాలు ఆల్రెడీ ఉండే విద్యార్థులకు నేర్పించడం కాదు. ఏయే విద్యార్థిలో ఈ కావలసిన ఏయే లక్షణాలు లోపించాయో గ్రహించి వాటిని సరిచేయడం. వారిని భవిష్యత్తు లో గొప్ప డాక్టర్లుగా తీర్చిదిద్దడం. ఆయన ఒక్కొక్క విద్యార్థిని అలా తయారు చేయడానికి ఎంత శక్తినీ సమయాన్నీ ఓపికగా వినియోగాస్తాడో అనిపించింది.
ఆయనకసలు కోపం రాదేమో…చిరునవ్వు తప్ప మరో ఎక్స్ప్రెషన్ ఆయన ముఖం మీద కనిపించలేదు. ఆయన స్టూడెంట్స్ ఆయనని Mr cool అని పిలుస్తారని నాకు తర్వాత తెలిసింది.
ఆయన కుర్చీ వెనుక భగవంతుని ఒక చిన్న ఫోటో ఉంది. దానిని చూసి ” ఆయన నాకు శక్తినిచ్చాడు. దానిని నా విద్యార్థులకు ధారబోస్తాను” అన్నాడు.
“బోధించేటపుడు ఉండవలసిన మొదటి లక్షణం నా స్టూడెంట్స్ మీద నమ్మకం. వారికి కావలసిన స్కిల్స్ ని నేను వారికి నేర్పించలేకపోతే నా బోధనలోనే ఏదో లోపం ఉన్నట్టు తప్ప వారిలో లోపం కాదు. మనుషులన్నాక రకరకాలుగా ఉంటారు. రకరకాల బ్యాక్ గ్రౌండ్స్ నుండి వస్తారు. ఎవరూ పర్ఫెక్ట్ కాదు. వారిని అర్థం చేసుకుని వారి లోపాలను అర్థం చేసుకుని వాటిని సరి చేసుకుంటూ ఒక సర్జన్ కి కావలసిన స్కిల్స్ ని నేను నేర్పగలగటమే నా విధి.” అన్నారాయన.
“మనుషులెవరూ పర్ఫెక్ట్ కాదు. మనుషంలందరికీ ఏవో సమస్యలు ఉంటూనే ఉంటాయి. అలాంటప్పుడు ఎవరిమీదో కోపగించుకోవడం ఎందుకసలు?
“మనుషులెవరూ పర్ఫెక్ట్ కాదు. మనుషంలందరికీ ఏవో సమస్యలు ఉంటూనే ఉంటాయి. అలాంటప్పుడు ఎవరిమీదో కోపగించుకోవడం ఎందుకసలు? కొందరు టీచర్లు ఎపుడూ స్టూడెంట్స్ మీద అరుస్తూనే ఉంటారు. అది చేయలేదనీ ఇది చేయలేదనీ. దానివలన ఏమైనా ఉపయోగం ఉంటుందా?” అని అడిగారాయన. అనవసరంగా విద్యార్థులను ఏదో కారణం చెప్పి తిట్టడం అంటే వారిలోని విద్యను నాశనం చేయడమే. అని ఆయన తన జీవితానికి సంబంధించిన ఒక ఉదాహరణ చెప్పారు. అది నాకు కూడా సరిగ్గా అతికినట్టు అనిపించింది. అకారణంగా ప్రొఫెసర్ల చేత తిట్లుతినడం వలన కొన్ని సబ్జెక్టు లంటే భయాల్ని కలిగిస్తుంటారు కొందరు. ఆ ప్రొఫెసర్ అప్పుడు తిట్టడం తాత్కాలికమే గానీ స్టూడెంట్ కి జరిగే నష్టం మాత్రం జీవితం మొత్తం వెంటాడుతుంటుంది.
ఆయన స్టూడెంట్ గా ఉన్నపుడు అడిగిన ప్రశ్నలకన్నింటికీ సరైన సమాధానాలు ఇస్తున్నందుకు అక్కసుతో ఒక ప్రొఫెసర్ అతడిని కావాలని ఫెయిల్ చేసిందట. ఇలాంటి వాళ్ళు ప్రతి చోటా ఉంటారు. బాగా చదివితే భరించలేరు. అది కళ్ళుబోతుతనమో మరేమో ఏ ఫ్రస్ట్రేషనో తెలియదు. కానీ మంచి స్టూడెంట్స్ ని చూసి ఓర్వలేరు. ఐతే కాలం గిర్రున తిరిగాక, ఇరవై ఐదేళ్ళు గడిచాక ఆయన ప్రోఫెసర్ అయ్యాక ఆవిడతో ముఖాముఖి కలిసే ఒక సందర్భం వచ్చిందట. ఆవిడ ఇతడిని మరచిపోలేదు. కానీ సరే జరిగిందేదో జరిగిపోయింది వెళ్ళి ఛాయ్ తాగుదాం రమ్మని ఆమె అడిగిందట. ఆయన ఛాయ్ తాగుతూ ఆమెకి చెప్పిన మాట “మాడం..మీరు అన్నీ మరచి నాతో ఛాయ్ పంచుకోవాలనుకోవడం సంతోషకరమైన విషయం. కానీ మీరు నాకు చేసిన డ్యామేజీ మీకు తెలుసా. ఇరవై ఐదేళ్ళుగా ఒకసారైనా మీరు నాకు చేసిన డ్యామేజీ గురించి చెప్పాలని ఎదురు చూస్తున్నాను. నేను చేయని తప్పుకి నాకు శమీరు శిక్ష వేయడం వలన నేను చాలా బ్యాడ్ స్టూడెంట్ గా మారిపోయాను. బాగా చదివితే పాసవుతామనుకునే దశనుంచి కిందపడి ఎంత చదివినా ఫెయిల్ చేస్తారేమో అనే భయం మొదలవడంతో నేను పరీక్షలకు చిట్లు పెట్టుకుని పోవడం మొదలుపెట్టాను. దాని వలన నేనెంతగానో పతనమయ్యాను. భయం నన్ను అలా చేసింది. మీలో ఉన్న ఫ్రస్ట్రేషనో మరేదో నన్ను ఎంతగా మార్చేసిందో ఒక మంచి స్టూడెంట్ ని ఎంతగా చెడ్డగా మార్చేసిందో మీరు తెలుసుకోవాలని మాత్రమే మీకీ విషయం చెబుతున్నాను” అన్నారట.
ఆ విషయం పంచుకుంటూ వారు ఇంకా ఇలా అన్నారు. “అందుకే నా స్టూడెంట్స్ చిట్స్ పెడితే నాకు కోపం రాదు. నాకు నేనే గుర్తుకువస్తాను. ఎవరో అతడిని చదవనీయలేదు. చదివినా మెచ్చలేదు. అతడు ఎందుకనో గాయపడ్డాడు. అని నేను అర్థం చేసుకుంటాను. అతడిని ఎలా మార్చగలను. అతడిగాయాలనుండి ఎలా మరల్చగలను ఎలా అతడిని సమాజానికి ఉపయోగపడగల మంచి డాక్టర్ గా మార్చగలను అనేదే నా బోధన”.
ఎక్కడో ఆ అమ్మాయికి తనపట్ల భయం ఉండటంవలననే అలా చేతులు వణుకుతున్నాయని గ్రహించారాయన. ఆమె అలా భయస్తురాలిగా ఎందుకు మారిందనేది అతడి తర్వాతి పరిశోధనాంశం. ఆమెలోనుండి తనపట్ల భయాన్ని పోగొట్ట గలిగితేనే అతడు తనకు తాను ప్రొఫెసర్ గా భావించగలడు.
ఈ మధ్యే జరిగిన మరో సంఘటన కూడా చెప్పారు. ఆయన స్టూడెంట్ ఒకామె కంటి ఆపరేషన్ చేస్తుండగా ఆమె చేతులు సన్నగా వణకడం ఆయన గమనించారట. మిగితా వారికి ఆ వణకడం కనిపించడం లేదు కానీ ఒక ఎక్స్పర్ట్ ఐన బోధకుడికి అది స్పష్టంగా కనబడుతోంది. ఒక అనుభవజ్ఞుడైన నిలువెత్తు ప్రొఫెసర్ తన ముందు నిలబడి ఉండగా ఆయన ముందు ఆపరేషన్ చేయాలంటే ఏ విద్యార్థికైనా వణుకు వస్తుంది. కానీ ఆయన దానిని తన బోధనలో లోపంగానే ఆయన భావిస్తారట.
ఎక్కడో ఆ అమ్మాయికి తనపట్ల భయం ఉండటంవలననే అలా చేతులు వణుకుతున్నాయని గ్రహించారాయన. ఆమె అలా భయస్తురాలిగా ఎందుకు మారిందనేది అతడి తర్వాతి పరిశోధనాంశం. ఆమెలోనుండి తనపట్ల భయాన్ని పోగొట్ట గలిగితేనే అతడు తనకు తాను ప్రొఫెసర్ గా భావించగలడు. కానీ అప్పటికప్పుడు ఆవిడలో భయాన్ని తొలగించేది ఎలా? అందుకే వారు ఏం చేశాడంటే పక్కనున్న అసిస్టెంట్ ప్రోఫేసర్ కి చెప్పి “నీవు తోడుగా ఉండు. నేను బయటకి వెళ్ళిపోతాను. నేను ఉంటే ఈ స్టూడెంట్ సరిగ్గా ఆపరేషన్ చేయలేదు. చేతులు వణుకుతున్నాయి కాబట్టి నేనుండను ” అని అతడి పర్యవేక్షణ ను అసిస్టెంట్ ప్రొఫెసర్ కి అప్పజెప్పేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ అడిగిందట. సర్ మీరు లేకపోతే ఎలా?. తనేదైనా తప్పు చేస్తే?. అని. అందుకు ఆయన ఏమన్నారంటే “ఆమె తప్పు చేసేలా నేనైతే ఆమెకు బోధించలేదు. కాబట్టి ఆమె తప్పు చేయదు అని నేను భావిస్తున్నాను. నా స్టూడెంట్ తప్పు చేయదనిఇంతలా బోధించిన నేనే నమ్మకపోతే ఇంకెవరూ నమ్మరు” అని.
నిజానికి ఆయన నమ్మకాన్ని ఆ స్టూడెంట్ వమ్ము చేయలేదు. చేతులు వణకకుండా చక్కగా ఆపరేషన్ చేసి కుట్లేసి బయటకు వచ్చిందంట. ఆ కాన్ఫిడెన్స్ తో మరెప్పుడూ ఆమెకి చేతులు వణకలేదట.
“స్టూడెంట్ ని బతికించాలంటే సర్జికల్ ఆర్ట్ ని బతికించాలంటే ఎన్నో చేయాలి. రిస్క్ తీసుకోవాలి. తిట్టడం కోపపడటం ఎప్పటికీ పరిష్కారం కాదు” అన్నారాయన.
ఒక గొప్ప డాక్టర్ నే కాక ఒక గొప్ప బోధకుడిని కలిసిన ఆనందంతో బయటకు నడిచాను. ఆయన నాకు ఆఫ్తాల్మాలజీ ఏమీ బోధించకున్నా జీవితానికి సరిపడా అనుభవాన్ని జీవిత దృక్పథాన్ని మార్చగల కొత్త కోణాన్ని నాకు అందించారు.
డాక్టర్ విరించి విరివింటి సామాజిక సమస్యలపై స్పందించే కవీ, రచయితా షార్ట్ ఫిల్మ్ మేకర్. మీదు మిక్కిలి చక్కటి హస్తవాసి గల వైద్యులు. ‘రెండో అధ్యాయానికి ముందుమాట’ వారి తొలి కవితా సంపుటి.
Good One sir
Super