Editorial

Friday, November 22, 2024
శాసనంఅచ్యుతదేవరాయల అనిమెల శాసనం

అచ్యుతదేవరాయల అనిమెల శాసనం

Epigraph

ఈ రోజు తారీఖు జూన్ ఒకటి

తిథి వైశాఖ బహుళ సప్తమి/అష్టమి. క్రీ.శ 1531 (శక 1453) ఖర నామ సంవత్సర వైశాఖ బహుళ అష్టమి నాడు అచ్యుతదేవరాయల అనిమెల శాసనంలో అనిమెల సంగమేశ్వరుని దీపారాధనకు ఉభయ నానాదేశి, అయ్యావళి మగమ(?) ధారవోసి యిచ్చినట్లుగాచెప్పబడ్డది. ఈ మగమ ధర్మము పులివెందులకనుమ, చింతకనుమ, గండికనుమల నడిచే దూదికంట్లకు, రసబండకు(?) చెల్లునని చెప్పబడ్డది.
[కడప జిల్లా శాసనాలు II నెం.109].

శీర్షిక నిర్వాహకుల పరిచయం

డా. దామరాజు సూర్య కుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణా కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article