ప్రభుత్వంపై తన ప్రత్యక్ష ముద్ర వేయాలనుకోవడంలో ఎంతో పరిణతి అవసరం. అది లోపిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోకడ, ముఖ్యంగా ఈ ఉదంతం చాటి చెబుతున్నది.
కందుకూరి రమేష్ బాబు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది విజయోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 9న సెక్రెటేరియేట్ లో ప్రతిష్టించనున్న తెలంగాణ తల్లి రూపం తాలూకు ఛాయాచిత్రం ఇదే. ప్రభుత్వం నేడు దీన్ని విడుదల జేసింది. ఇందులో ఇదివరకు మాదిరి ఆ తల్లి చేతుల్లో ఉన్న బతుకమ్మ లేదు. దానికి బదులుగా ఒక చేత అభయ హస్తంతో ఉన్న మూర్తిమత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖాయం చేసింది. దీన్ని సోషల్ మీడియాల్లో బీఆర్ ఎస్ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారే కాదు, ఇది ఎవరికైనా మనసుకు కష్టం కలిగించే విషయమే. పెదవి విరిచే చర్యే ఇది. నిజానికి ప్రజల్లోకి వెళ్ళిన ప్రతీకలను మార్చేటప్పుడు ఎంతో జాగురూకత అవసరం. భావోద్వేవాగాలను అదుపు చేయడం కూడా కష్టం. నిజానికి తెలంగాణ తల్లి రూపాన్ని మార్చే అవసరం లేదు. అంతేగాదు, రాష్ట్రగీతంగా అందెశ్రీ విరచిత ‘జయ జయ జయయే’ గీతాన్ని నూతన ప్రభుత్వం ఆమోదించినప్పుడు పాత గీతాన్ని యధాతధంగా ఉంచవలసింది. కానీ కీరవాణి చేత సంగీతం సమకూర్చడం వల్ల ఆ గీతం ప్రజలను ఉత్తేజ పరచలేదు. అంతకు ముందరిలా హృదయాలను ఉప్పోగించే గీతం కాస్త ఉస్సూరుమన్నది. అలాగే తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం కూడా సబబైన నిర్ణయం అని ఎవరూ బాహాటంగా అనలేని స్థితి. ఇది ప్రభుత్వం హుందాగా తీసుకున్న నిర్ణయంగా ఆహ్వానించలేం. పాత రూపాన్నుంచి కిరీటం తొలగించడం సరే, తెలంగాణ జీవన సంబురానికి మారుపేరైన బతుకమ్మను తొలగించడం తెలంగాణ సాంస్కృతిక ఔన్నత్యాన్ని చిన్నబుచ్చడమే. ప్రభుత్వం నిర్ణయాన్ని సమీక్షించుకోవాలి. విగ్రహ ప్రతిష్ట ఆపాలి.
ఇది కేవలం కవిత పైనో, కేసీఆర్ పైనో ఉన్న ద్వేషం తెలంగాణకు ఆపాదించినట్లు అవుతుంది. నూతన ప్రభుత్వంపై పట్టు సాధిచడం ఇలా కాదు కూడా.
వాస్తవానికి ఉన్నదాన్ని మార్చడంలో రాజకీయ ప్రయోజనాలను మించిన ఆదర్శం లేకపోతే అన్ని వర్గాల ప్రజలు హర్షించరని, పెదవి విరుస్తారని రేవంత్ ప్రభుత్వం గమనంలోకి తీసుకున్నట్టు లేదు. ఇది కేవలం కవిత పైనో, కేసీఆర్ పైనో ఉన్న ద్వేషం తెలంగాణకు ఆపాదించినట్లు అవుతుంది. నూతన ప్రభుత్వంపై పట్టు సాధించడం ఇలా కాదు కూడా.
పోరాట ఫలమైన స్వరాష్ట్రం విషయంలో అనేక విషయాలున్నాయి. మూలాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన విషయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధిపై ప్రజలందరికీ గౌరవం ఉంది. కావలిస్తే రాష్ట్రాన్ని ఇచ్చినందుకు నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ఆమెను సాదరంగా ఆహ్వానించి పాత తెలంగాణ తల్లి నూతన ప్రతిమను సేక్రటేరియేట్ లో ఆవిష్కరించవలసి ఉండింది. అక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఇదివరకే అ విగ్రహాన్ని పెట్టవలసిందని ముఖ్యమంత్రి చెప్పవలసింది. విమర్శ చేయనూ వచ్చు. సమాజం అంగీకరిస్తుంది కూడా. ఆ రూపంలో రేవంత్ రెడ్డి రాజకీయంగా పైచేయి సాధించ బూనడం బాగుండేది. కానీ రూపాన్ని మార్చడం, బతుకమ్మను తొలగించి అభయ హస్తంతో ఉన్న విగ్రహం పెట్టనుండటంతో అది చేయి గుర్తు కోసం పెట్టిన తల్లి ప్రతిమ అని, పాలనలో కాంగ్రెస్ ముద్ర కోసం తాపత్రయ పడినట్లే అవుతుందనే విమర్శలను ఎదుర్కోవలసి వస్తుంది. అదే ఇప్పుడు జరుగుతున్నది కూడా. ఐతే, ఈ నిర్ణయం పట్ల ప్రజలు సరేసరి, కొందరు మాట్లాడవచ్చు, మరికొందరు మౌనగా ఉండవచ్చు. ఇంకొందరు పట్టించుకోక పోవచ్చు. కానీ అందరూ ఆలోచిస్తారని చెప్పక తప్పదు. అంతేకాదు, ఇది బీఆర్ ఎస్ తో పాటు ఇతర రాజకీయ పక్షాలు ఆమోదం పొందే చర్య మాత్రం కాదు.
మారిన ‘తెలంగాణ తల్లి’ విషయంలో సామాన్య పౌరుడిగానే కాకుండా బతుకమ్మ పూర్వ సంపాదకులుగా కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ అభిప్రాయం వినిపించవలసి వస్తోంది.
రాష్ట్ర చిహ్నం విషయంలో చార్మినార్, కాకతీయ తోరణం తొలగింపు సమయంలో ఎట్లా ప్రభుత్వం విమర్శలకు గురైందో, అప్పుడు ఎలా రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గాడో గానీ ఈ సారి ఆయన ‘తగ్గేదే లే’ అని భావించినట్లు ఉన్నారు. ఎలాగైనా తెలంగాణ తల్లి నూతన రూపాన్ని ముందుకు తీసుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టే ఉన్నారు. కానీ, నిజానికి ఇది కూడా ఆ కోవలోకి వచ్చే విషయమే. తగ్గవలసి ఉంది. ఆయన తగ్గాలి కూడా. తనకే మంచిది. ఇటీవల కొన్ని నిర్ణయాల్లో వెనక్కు తగ్గిన ప్రభుత్వం మంచి పేరే సంపాదించుకుంది కూడా.
ఎమైనా, ప్రభుత్వంపై తన ప్రత్యక్ష ముద్ర వేయాలనుకోవడంలో ఎంతో పరిణతి అవసరం. అది తప్పుతున్నట్టు రేవంత్ రెడ్డి దుందుడుకు పోకడ, ముఖ్యంగా ఈ ఉదంతం చాటి చెబుతున్నది.
ముఖ్యంగా చాకలి ఐలమ్మ విశ్వ విద్యాలయం విషయంలో దాన్ని ఒక బిల్లుగా అసెంబ్లీలో పెట్టి ఆమోదం తీసుకోవలసి ఉన్నది. అలాంటి చర్యలు చిన్నవి, పెద్దవి, అవసరమైనవి చాలా చేయవలసి ఉండగా ఇప్పుడు తాజా నిర్ణయం నిస్సందేహంగా వివాదాస్పదం.
ప్రగతి భవన్ కు జ్యోతిరావు పూలే పేరు, కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేర్లు పెట్టిన విషయాన్ని ఆహ్వానించాం. కొందరు విమర్శించి ఉండొచ్చు. అలాగే సినిమా రంగానికి ఇచ్చే ‘నంది’ పురస్కారాలను ‘గద్దర్’ పేరిట మార్చాలన్న నిర్ణయం. ఇది కూడా కొంత వివాదమే ఐంది. మొత్తంగా గత ప్రభుత్వంలో దారి తప్పిన తెలంగాణను స్వీయ అస్తిత్వంతో తిరిగి పునరుజ్జీవనంలోకి తేవాల్సిన ఘడియలో, ఇచ్చిన హామీలను అమలు చేసి మంచి పేరు సంపాదించుకో వలసిన తరుణంలో చేయవలసినవి చేయకుండా కేవలం పేర్లు మార్చడం వల్ల అది ప్రజా పాలన అయిపోదని పోదని రేవంత్ ప్రభుత్వం గమనించాలి.
చేయవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యంగా చాకలి ఐలమ్మ విశ్వ విద్యాలయం విషయంలో దాన్ని ఒక బిల్లుగా అసెంబ్లీలో పెట్టి ఆమోదం తీసుకోవలసి ఉన్నది. అలాంటి చర్యలు చిన్నవి, పెద్దవి, అవసరమైనవి చాలా చేయవలసి ఉండగా ఇప్పుడు తాజా నిర్ణయం నిస్సందేహంగా వివాదాస్పదం. వాస్తవానికి ఇవన్నీ మంచి ప్రతీకలే. కాదని ఎవరూ అనరు. కానీ పాలనలో పట్టు సాధించి పరిణితితో కూడిన ముద్ర వేయడం ముఖ్యం. అలా కాకుండా నేల విడిచి సాము చేసినట్లు, త్వరితగతిలో ప్రభుత్వంపై తన ప్రత్యక్ష ముద్ర వేయాలనుకుంటే అందుకు ఎంతో పరిణతి అవసరం. అది తప్పుతున్నట్టు రేవంత్ రెడ్డి దుందుడుకు పోకడ చాటి చెబుతున్నది. ముఖ్యంగా తెలంగాణా తల్లి రూపురేఖలలో చేసిన మార్పు చేర్పులు సరైన సంకేతాలు ఇవ్వవు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునస్సమీక్షించుకోవాలి.
మారిన ‘తెలంగాణ తల్లి’ విషయంలో సామాన్య పౌరుడిగానే కాకుండా ‘బతుకమ్మ’ పత్రిక పూర్వ సంపాదకులుగా కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ అభిప్రాయం వినిపించవలసి వస్తోంది. పాత్రికేయుడిగా విస్పష్టంగా నిరసన తెలుపు సంపాదకీయం రాయవలసి వచ్చింది.
గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజాభిప్రాయానికి పెద్ద పిట వేశాయి. నేటి ప్రభుత్వాలు ప్రజాభిప్రాయానికి విలువ ఇవ్వడం లేదు . నాయకుల ఇష్ట ఇష్టాలే ప్రజల మీద రుద్దుతున్నారు . అది కేంద్ర ప్రభుత్వమైన , రాష్ట్రల ప్రభుత్వాలైన …