Editorial

Wednesday, January 22, 2025
OpinionOMICRON : డాక్టర్ విరించి విరివింటి Year Roundup 2021

OMICRON : డాక్టర్ విరించి విరివింటి Year Roundup 2021

ప్రస్తుతానికి ఒమిక్రాన్ ఏంటి అంటే మానవుడు పుట్టించిన మంటపై ప్రకృతి చల్లిన నీళ్ళు. మానవుడు సృష్టించిన విషంపై ప్రకృతి ఇచ్చిన విరుగుడు. మానవుడు సృష్టించిన వైరస్ పై ప్రకృతి తయారు చేసిన వాక్సిన్ అనిపిస్తుంది.

కానీ భయపడవలసినది వైరస్ కి కాదు. రోజురోజుకీ ప్రేమరహితుడై విద్వేషపూరితంగా మారుతున్న మనిషిని చూసి.

డాక్టర్ విరించి విరివింటి

కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది అనడిగితే రెండు విభిన్నమైన హైపోథెసిస్లు వినబడతాయి. ఒకటేమో ప్రకృతిలోనుండి సహజంగా పుట్టుకొచ్చిందని అంటే మరొకటేమో జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా మానవనిర్మితమైన వైరస్ మానవ తప్పిదం ద్వారా ల్యాబ్ నుండి బయటపడిందని అంటుంది. డేవిడ్ క్వామన్ వంటి వారు సహజమైన Natural spillover కథనానికి అనుకూలంగా వాదిస్తే మ్యాట్ రిడ్లీ వంటివారు lab leaking కథనంవైపు మొగ్గు చూపిస్తున్నారు.

natural spillover theory మానవ తప్పిదాలను కప్పిపుచ్చుతుంటే…lab theory మానవ తప్పిదాలను బట్టబయలు చేసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న bio lab ల నిర్లక్ష్య ధోరణులను ఎత్తి చూపుతోంది.

పెరుగుతున్న నగరీకరణ కాలుష్యం అభివృద్ధి పేరుతో మిన్నంటిన మానవుని ఆశాపరత్వం ఇత్యాదివన్నీ గత ముప్పై సంవత్సరాలుగా ప్రకృతిలో పెనుమార్పులు తీసుకురావడం వలన ప్రకృతిలో సహజంగా emerging new viruses రూపంలో జంతువులనుండి మానవులకు కొత్త జబ్బులు పుట్టుకొస్తున్నాయనే థియరీ ఎంత కన్విన్సింగా ఉందో..జాతుల మధ్య వైషమ్యాలు జాత్యాహంకారాలు మానవుడి యుద్ధ ప్రియత్వమూ ఇత్యాదివన్నీ జాతుల నిర్మూలనకు కంకణం కట్టుకున్న మానవుడి మెదడులోంచి పుట్టిన ద్వేషానికి ప్రతిరూపంగా genetic engineering and lab leaking థియరీ అంతే కన్విన్సింగా ఉంది. అంతేకాకుండా natural spillover theory మానవ తప్పిదాలను కప్పిపుచ్చుతుంటే…lab theory మానవ తప్పిదాలను బట్టబయలు చేసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న bio lab ల నిర్లక్ష్య ధోరణులను ఎత్తి చూపుతోంది.

ఎవరినైనా నిందించవలసి ఉందంటే అది దురాశాపూరితమైన విద్వేష పూరితమైన జాతి వైషమ్య పూరితమైన మానవున్నే. ప్రకృతి పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్న మానవున్నే. అందుకే రెండు హైపాథెసిస్లు కూడా మనుషులం చేస్తున్న తప్పులనే ఎత్తి చూపిస్తున్నాయి.

ఒక వైరస్ ఒక చోటినుండి ప్రపంచమంతా చాలా తక్కువ సమయంలో పాకడం ప్రపంచమంతా దాదాపు ఒకే రకమైన జబ్బును కలగజేయడం అనేది చాలా విచిత్రంగా ఉంది. ప్రకృతి అంతటి ప్రమాదకరంగా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తుందా అన్నది అనుమానం కూడా. బయోవార్ ల కోసం జెనెటికల్లీ ఇంజనీర్డ్ వైరస్ ఒకానొక ల్యాబ్ లో తయారయ్యి మానవ తప్పిదంవలన బయటకు పొక్కి ఇంతటి విలయాన్నేమైనా సృష్టించిందా అన్న అనుమానం ప్రపంచాధిపత్యం కోసం దేశాలమధ్య జరుగుతున్న ఎకనామికల్ పోరు నేపథ్యంనుండి చూడవలసి ఉన్నది. ఈ చూపువలన నష్టం లేదు. ఎవరినైనా నిందించవలసి ఉందంటే అది దురాశాపూరితమైన విద్వేష పూరితమైన జాతి వైషమ్య పూరితమైన మానవున్నే. ప్రకృతి పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్న మానవున్నే. అందుకే రెండు హైపాథెసిస్లు కూడా మనుషులం చేస్తున్న తప్పులనే ఎత్తి చూపిస్తున్నాయి. Lab leaking theory నిజమే ఐతే రానున్న యుద్ధాల భయంకరరూపం ఒకటి కంటిముందు కదలాడుతుంది.

Lab leaking hypothesis తప్పు కావాలని మనం మనస్పూర్తిగా కోరుకోవాలి. కానీ దానిని పూర్తిగా కొట్టి వేయనవసరమూ లేదు. దానిని అర్థం చేసుకోలేకపోతే రానున్న కాలంలో మానవుడి భయంకరమైన వికృత రూపాన్ని మరిన్ని పాండెమిక్ ల రూపంలో చూడబోతామేమో అనిపిస్తుంది. ఆధునిక యుద్ధం బాంబుల రూపంలో కంటే వైరస్ల రూపంలో ఉండబోతుందా అనిపిస్తుంది. మానవుడి ఉన్మత్త మతవాదానికి జాతివాదానికి ఇలాంటి వైరస్ చేత చిక్కితే ఎంతటి ప్రమాదం కలుగుతుందోనని భయమేస్తుంది.

ఒమిక్రాన్ మానవుడి దుష్టత్వానికి ప్రకృతి ఇచ్చిన సమాధానంగా కూడా కనిపిస్తుంది.

కానీ ఒమిక్రాన్ మానవుడి దుష్టత్వానికి ప్రకృతి ఇచ్చిన సమాధానంగా కూడా కనిపిస్తుంది. ఉత్పరివర్తనాలు జీవ పరిణామంలో చాలా కీలకమైనవి. అదే ఉత్పరివర్తనాలను అస్త్రంగా భయంకరమైన కరోనా రూపాన్ని మెడలువంచి ఒమిక్రాన్ వంటి విషరహిత వైరస్ ని ప్రకృతి తయారుచేసి జీవాన్ని రక్షించే బాధ్యత తీసుకుందేమో అనిపిస్తున్నది.

ప్రస్తుతానికి ఒమిక్రాన్ ఏంటి అంటే మానవుడు పుట్టించిన మంటపై ప్రకృతి చల్లిన నీళ్ళు. మానవుడు సృష్టించిన విషంపై ప్రకృతి ఇచ్చిన విరుగుడు. మానవుడు సృష్టించిన వైరస్ పై ప్రకృతి తయారు చేసిన వాక్సిన్ అనిపిస్తుంది. మరింత ప్రతిభావంతంగా మానవుడిని రక్షించేందుకు ప్రకృతి వస్తుందేమో చూడాలి. మరణాన్ని కలిగించేంత తీవ్రవైరస్ స్థానంలో కేవలం రెండు రోజుల జలుబు ను కలిగించే వైరస్ ను ప్రవేశ పెడుతుందేమో చూడాలి.

కానీ భయపడవలసినది వైరస్ కి కాదు. రోజురోజుకీ ప్రేమరహితుడై విద్వేషపూరితంగా మారుతున్న మనిషిని చూసి. మనిషి తన పతనాన్ని రాసుకునేదేధైనా ఉంది అంటే అది కేవలం పక్కవాడిపట్ల విద్వేషం రూపంలో మాత్రమే. ఇంతలా మానవుడిని కాపాడాలని అనుకుంటున్న ప్రకృతి మానవుడిలో విద్వేషం పోయి ప్రేమను ఉత్పరివర్తనాల ద్వారా కలుగజేస్తందేమో వేచి చూడాలి. జాషువా విశ్వనరుడేమైనా పుడతాడేమో చూడాలి.

అక్షరం సైతం చక్కటి హస్తవాసిగా గల వైద్యుడు డాక్టర్ విరించి విరివింటి.
తాను కవీ, రచయితా షార్ట్ ఫిల్మ్ మేకర్. ‘రెండో అధ్యాయానికి ముందుమాట’ తొలి కవితా సంపుటి.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article