నవంబర్ 12వ తారీఖు
క్రీ.శ.1533 ఇదే తారీఖున అచ్యుత దేవరాయలి పాలనలో మహా ప్రధానులైన బాచరుసయ్యగారు కొండవీటి దుర్గంలో నుండగా, అద్దంకి సీమలోని చందలూరి గ్రామంలో కేశవనాధ దేవరకు వివాహ ప్రతిష్ఠ (కళ్యాణం) చేసి మల్లరుసయ్య గారు ఆ దేవుని అంగరంగభోగాలకు, అమృత పళ్ళకు చందలూరి దక్షిణాన, రావినూతల చెరువుకు తూర్పున గల క్షేత్రము నిచ్చెనని, కాశీ వీరాభక్తునికి ఒక కుచ్చెన, దేవుని సేవ చేసే తిరువీధుల సానులు తిరుమలు, సర్వసాని దాసిలకు రెండు కుచ్చెల్ల చేను యిచ్చినట్లు నేటి ప్రకాశం జిల్లా లోని చందలూరి శాసనంలో గలదు.(నెల్లూరు జిల్లా శాసనాలు%III ూఅస్త్ర%-23)
అట్లే1544 నాటి కొలిమిగుండ్ల (కర్నూలు జిల్లా) శాసనంలో వీర సదాశివరాయల పాలనలో ఆరవీటి బుక్కరాయలి ప్రపౌత్రుడు, రామరాయలి పౌత్రుడు, తిమ్మరాజు గారి పుత్రులైన చిన తింమయ దేవ మహారాజులు కొలిమిగుండ్లలోని విద్వన్మహాజనులను రాయలవారి ఆనతిని అనేక సుంకములనుండి మినహాయించినట్లు చెప్పబడినది.
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణ కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.