టీఆర్ ఎస్ ప్లీనరీలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగం అంతా కూడా కేసీఆర్ విప్లవాత్మక సంస్కరణల వ్యక్తిత్వాన్ని సమున్నతంగా అవిష్కరించేలా సాగడం విశేషం. KCR అంటే నేడు “కెనాల్లు, చెరువులు, రిజర్వాయర్లు” అని అయన అభివర్ణించడం సభలో మరో విశేషం.
టీఆర్ ఎస్ ప్లీనరీలో (20 Years Of TRS) వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రసంగం ఆద్యంతం విశేషంగా సాగింది. సభలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పెద్ద ఎత్తున జరిగిన సంస్కరణలను అయన ఒకటొకటిగా ఎంతో ఉద్వేగంగా ఉటంకిస్తూ తెలంగాణ గర్వించదగిన రీతిలో సాగిపోతున్న వైనాన్ని స్థిరంగా ప్రజల్లోకి తీసుకెల్లేలా ప్రసంగించారు. “ఇది సంస్కరణల స్వరయుగం”, “పరిపాలనలో కొత్త పుంతలు” అంటూ ఈ మొత్తం మార్పుకు మూలమైన తన తండ్రి సాదర కృషిని అపూర్వంగా కొనియాడారు. ఈ సందర్భంగా నీళ్ళు నిధులు నియామకాలలో తొలి ప్రాధాన్యమైన నీటి వనరుల గురించి పేర్కొంటూ “ఇవ్వాళ రైతులంటున్నారు, KCR అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాదు, కెనాల్లు, చెరువులు, రిజర్వాయర్లు’ అని అయన అభివర్ణించడం సభలో ప్రత్యేక విశేషం.
“చట్టాలు ఎవరికీ చుట్టాలు కాదు” అన్న సామెత నేడు మారిపోయిందని, అది నేడు “చట్టాలు తెలంగాణా ప్రజల చుట్టాలు” అని మాట్లాడుకునే స్థాయిలోకి వచ్చిందని వివరించారు.
సమగ్ర కుటుంభ సర్వే, ధరణి పోర్టల్ మొదలు…ఉద్యోగావకాశాల్లో స్థానికులకే తొంబై ఐదు శాతం కేటాయిస్తూ తెచ్చిన జోనల్ వ్యవస్థ దాకా అయన జ్ఞాపకం చేశారు. కొత్త రెవెన్యూ చట్టం, పంచాయతీ రాజ్ , మున్సిపల్ చట్టం నుంచి తెలంగాణా ఐ పాస్ , బి పాస్ తదితర నూతన చట్టాలను తెచ్చిన వైనాన్ని ప్రస్తావిస్తూ “చట్టాలు ఎవరికీ చుట్టాలు కాదు” అన్న సామెత నేడు మారిపోయిందని, అది నేడు “చట్టాలు తెలంగాణా ప్రజల చుట్టాలు” అని మాట్లాడుకునే స్థాయిలోకి వచ్చిందని వివరించారు. ఈ ఘనత తెలంగాణకు మాత్రమే సొంతమని వివరిస్తూ దేశానికి తెలంగాణా నేడు ఆదర్శంగా మారిన వైనాన్ని అయన సోదాహరణంగా వివరిస్తూ ప్రసంగించడం విశేషం.
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతులు మొదలు… అధికారులకు విశేష అధికారాలు బడ్వాటా చేయడం దాకా, పరి పరి విధాలా “ఉజ్వల తెలంగాణ” సాకారం కావడం గురించి అయన వివరించారు. వ్యవసాయం పారిశ్రామిక రంగం… రెండింటిలో వెలుగులు నింపిన విధ్యుత్తు సంస్కరణల గురించి చెబుతూ ఇది తెలంగాణ సాధించిన వెలుగుల ప్రస్థానంగా పేర్కొన్నారు. వ్యాక్సిన్ మొదలు మన్యుఫ్యాక్చరింగ్ రంగం, ఫార్మా సెక్టార్ తదితర రంగాలను ఉదాహరిస్తూ తెలంగాణ నేడు ఉపాధి అవకాశాలకు అక్షయ పాత్ర అయిందని కూడా గర్వంగా చెప్పారు. రైతు బంధు, దళిత బంధుల గురించి చెబుతూ రాష్ట్ర ముఖచిత్రం మారిన వినాన్ని వివరించారు.
యాప్స్ నుంచి గూగుల్ మ్యాప్స్ దాకా అన్నిటికీ గమ్యస్థానం తెలంగాణా రాష్ట్రం అని గర్వంగా చెప్పుకోవచ్చని గుర్తు చేశారు.
ఒకనాడు ఆగమైపోతుందన్న తెలంగాణా నేడు దేశానికి ఆదర్శం కావడాన్ని నొక్కి చెబూతూ ఎర్ర బస్సు నుంచి ఎలక్ట్రిక్ బస్ దాకా…ఎలక్ట్రిక్ బస్ నుంచి ఏర్ బస్ దాకా…ట్రాక్టర్ నుంచి హెలిక్యాప్టర్ …టైల్స్ నుంచి టెక్స్ టైల్స్ దాకా …యాప్స్ నుంచి గూగుల్ మ్యాప్స్ దాకా అన్నిటికీ గమ్యస్థానం తెలంగాణా రాష్ట్రం అని గర్వంగా చెప్పుకోవచ్చని గుర్తు చేశారు.
“నేడు హైదరాబాద్ గూగుల్ కు గుండెకాయ అని, అమెజాన్ కు ఆయువు పట్టు అని, ఫేసు బుక్ కు ఫాస్ట్ ఫేవరేట్ డిస్టినేషన్ కూడా హైదరాబాదే అని ఆసక్తిగా వివరించారు. IT అంటే ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’ కాదు, దాన్ని ‘ఇన్ క్రెడిబుల్ తెలంగాణ’గా మార్చనున్నామని అయన భరోసానిచ్చారు.
“పరిశ్రమలంటే టాటాలు కాదు, తాతాల నాటి కుల వృత్తులు కూడా పరిశ్రమలే” అంటూ టీఆర్ ఎస్ చేతి వృత్తులకు ఇస్తోన్న గౌరవాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ వారు స్పూర్తిదాయక ప్రసంగం చేయడం విశేషం.
“KCR అంటే కెనాల్లు, చెరువులు, రిజర్వాయర్లు’ అని కేటీఆర్ అభివర్ణించడం ఒక విశేషమైతే, సభా వేదిక డిజైన్ కూడా ప్రాజెక్టుల నుంచి నీళ్ళు ధారగా ప్రవహించేలా రూపొందించడం మరో విశేషంగా చెప్పుకోవాలి.
ఒక్క మాటలో కేసీఆర్ తనయుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ రాష్ట్రం సాధించిన అభివృద్దిని క్లుప్తంగానే అయినా ఎంతో ఉద్వగ్నంగా తనదైన ముద్ర వేసేలా ఆసక్తికరంగా విశదం చేశారు.
వారి మొత్తం ప్రసంగం అంతర్జాతీయంగా అయన కీర్తి ప్రతిష్టలను ఇనుమడించేలా మాత్రమే కాక స్థానిక అంశాలను కూడా జతచేసి అందరి మదిని దోచుకునేలా సాగింది.
అన్నట్టు, “KCR అంటే కెనాల్లు, చెరువులు, రిజర్వాయర్లు’ అని కేటీఆర్ అభివర్ణించడం ఒక విశేషమైతే, సభా వేదిక డిజైన్ కూడా ప్రాజెక్టుల నుంచి నీళ్ళు ధారగా ప్రవహించేలా రూపొందించడం మరో విశేషంగా చెప్పుకోవాలి.