Editorial

Saturday, November 23, 2024
వ్యాసాలునవరాత్రి ఘట్ : అమ్మవారిని కొలిచే బంజారాలు

నవరాత్రి ఘట్ : అమ్మవారిని కొలిచే బంజారాలు

మహాలయ అమావాస్య తెల్లవారి నుండి పౌర్ణమి వరకు వెలుగు రోజులలో నవరాత్రి ఘట్ పండుగ బంజారాలకు ప్రత్యేకమైనది. ఈ రోజుల్లో వారు తమ సంస్కృతి ప్రతిబింబించేలా ప్రత్యేకంగా అమ్మవారిని పూజిస్తారు.

డా.శారదా హన్మాండ్లు

D.Sharadhaసాధారణంగా హిందువులు దసరా నవరాత్రులలో అమ్మవారిని వివిధ రూపాలలో పూజిస్తారు. అలాగే గిరిజనులైన బంజారాలు అమ్మవారిని విభిన్న రీతిలో పూజిస్తారు.

అరవైనాలుగు దేశాలలోని బంజారాలు నవరాత్రి ఘట్ పండుగను జరుపుకుంటారు. పితృ అమావాస్య తెల్లవారి నుండి పౌర్ణమి వరకు వెన్నెల రోజులలో అమ్మవారిని పూజిస్తారు. ఈ పదిహేను రోజులలో ఏదో ఒక రోజు ఇంటి ఆచారం ప్రకారం వారి సంస్కృతిని పాటిస్తూ అమ్మవారిని ‘ఘట’ రూపంలో పూజిస్తారు.
ఈ ఆచారాన్ని ‘ఘటం కూర్చోబెట్టడం’ అంటారు. లేదా ‘నవరాత్రి ఘట్’ అని కూడా అంటారు.

ఈ ఏడుగురు అక్క చెల్లెళ్ళలో ఎవరో ఒక భవానీ వారి ఇంటి దేవతగా ఉంటుంది. ఈ దేవతలకు తప్పకుండా మాంసాహారం నైవేద్యంగా పెడతారు.

అమ్మవారికి ఏడుగురు అక్క చెల్లెళ్ళు. తుల్జాభవాని, దుర్గాభవాని, కాళికాభవాని, మాత్రాభవాని, మసూరిభవాని, దండిభవాని. లంబాడీలలో ఈ ఏడుగురు అక్క చెల్లెళ్ళలో ఎవరో ఒక భవానీ వారి ఇంటి దేవతగా ఉంటుంది. ఈ దేవతలకు తప్పకుండా మాంసాహారం నైవేద్యంగా పెడతారు.

ఘటాల అలంకరణ

బంజారాల సంస్కృతికి ప్రతిబింబమైన అద్దాలతో కూడిన అల్లినటువంటి వస్త్రాన్ని పరదాగా కడతారు. తొమ్మిది రంగులతో ముగ్గులను వేస్తారు. నిమ్మకాయలను ఆ ముగ్గులో ఉంచుతారు బియ్యం పోసి తమలపాకులు పెట్టి వాటిలో అమ్మవారిని ప్రతిష్టిస్తారు. కొబ్బరి కాయతో కలశాన్ని పెడతారు. చుట్టూ గవ్వలు, పోకలు, నాణాలతో అలంకరిస్తారు.

వెండి ఊయల లేనివారు టేకు లేదా మోదుగ ఆకులు పూలతో ఊయలను తయారు చేస్తారు.

శివునికి ప్రతీకలుగా త్రిశూలాన్ని శంఖమును అమ్మవారి సన్నిధిలో పెడతారు. వెండి ఉయ్యాలలో పువ్వులు నిమ్మకాయ పెట్టి పూజిస్తారు. వెండి ఊయల లేనివారు టేకు లేదా మోదుగ ఆకులు పూలతో ఊయలను తయారు చేస్తారు.

పూజావిధానం

పరిశుభ్రమైన వాతావరణంలో, పవిత్రమైన భావనతో ఇంటిల్లిపాది పూజలో పాల్గొంటారు. బంధువులను ఆహ్వానించుకుంటారు. వివిధ రకాల నైవేద్యాలను తయారు చేస్తారు. గండ దీపాన్ని నేతితో వెలిగించి, ఒక రోజంతా వెలిగేలా జాగ్రత్తగా చూసుకుంటారు.

మాంసాహారంలోని బొక్కలను వాటితోపాటు నైవేద్యంగా పెడతారు.

మాంసాహారంతో పాటు పరమాన్నం కూడా నైవేద్యంగా పెడతారు. దేవత సన్నిధానంలో పరమాన్నాన్ని ముద్దలుగా తయారుచేసి పెడతారు. మాంసాహారంలోని బొక్కలను వాటితోపాటు నైవేద్యంగా పెడతారు. తర్వాత కొంత నైవేద్యాన్ని ఘటం ముందు అగ్ని ఏర్పాటు చేసే వాటిలో వేస్తారు. అగ్నిదేవుడు వాహకంగా అమ్మవారికి ఈ నైవేద్యాన్ని తీసుకెళ్తాడని వారి నమ్మకం. మిగితా నైవేద్యం ప్రసాదంగా బంధువులందరికీ పంచుకుంటారు.

పగలంతా నియమనిష్ఠలతో ఉపవాసం చేస్తారు. రాత్రి అంతా భజనలు పాడుతూ జాగరణ చేస్తారు. తెల్లవారి సూర్యోదయానికి ముందే ఘటాలకు హారతి చేసి పండుగకు ముగింపు పలుకుతారు. తరువాత ఆ విగ్రహాన్ని దూదిలో చుట్టి ఎర్ర బట్టలో కట్టి పెడతారు. మళ్లీ ప్రత్యేకంగా పూజా సమయంలో మాత్రమే ఆ విగ్రహాన్ని తీస్తారు.

సతీమాత ఘట్

కొంతమంది సతీ మాతను ఇంటి దేవతగా నిలుపుకుంటారు. వారు కూడా ఇదే విధంగా పూజా విధానాన్ని పాటిస్తారు. కానీ సతీమాత అమ్మవారికి కేవలం శాఖాహారము పరమాన్నము మాత్రమే నైవేద్యంగా చెల్లుతుంది.

ఘటాలను కూర్చోబెట్టడం పూజించడం అనే సంస్కృతి మార్వాడీ, రంగరి, క్షత్రియ లాంటి కులాలలో కూడా కనిపిస్తుంది.

ఇలాంటి ఘటాలను కూర్చోబెట్టడం పూజించడం అనే సంస్కృతి మార్వాడీ, రంగరి, క్షత్రియ లాంటి కులాలలో కూడా కనిపిస్తుంది.

ఈ విధంగా బంజారాలు నవరాత్రి ఘట్ పండుగలో వారి సంస్కృతి ప్రతిబింబించేలా ప్రత్యేకంగా అమ్మవారిని పూజిస్తారు.

వ్యాసకర్త కవయిత్రి, ఉపాధ్యాయురాలు. బతుకమ్మను సాంస్కృతిక పునరుజ్జీవన ప్రతీకగా ఎంచి చేసిన పరిశోధనకు గాను వారు డాక్టరేట్ అందుకున్నారు. నివాసం నిజామాబాద్.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article