ఔషధ విలువల మొక్కలు ( 50 ) : రుద్రాక్ష
రుద్రాక్షను పూజించుచు
రుద్రాక్ష ధరించగానె రుజ నశియించున్
రుద్రాక్ష రుద్ర రూపము
భద్రమునిడు పరమ పూజ్య వరదాయినియౌ
నాగమంజరి గుమ్మా
శివుని కంటి నీటి చుక్క భూమిపై పడి రుద్రాక్ష చెట్టుగా మారిందని చెవుతారు. రుద్రాక్షను పూజించినా, ధరించినా గుండె సంబంధ వ్యాధులు నశిస్తాయని, రక్తపోటు అదుపులో ఉంటుందని అంటారు. ఒకటి నుండి ఇరవై ఒక్క ముఖముల వరకు రుద్రాక్షలు లభిస్తున్నా, పంచముఖి రుద్రాక్షలు మాత్రమే విరివిగా లభిస్తాయి. వీటిలో ఒక ముఖము కలిగిన రుద్రాక్షను ఏకముఖి అంటారు. ఇది అన్నిటిలోకీ ప్రశస్తమయినదిగా చెపుతారు. దీనిని ధరించిన వారికి సర్వవిధాలా విజయం చేకూరునని నమ్ముతారు.
మనదేశంలో ప్రతి సంవత్సరమూ 300 కోట్ల రుద్రాక్షల వ్యాపారం జరుగుతుందని హీలింగ్ మాట్రిక్స్ అనే సంస్థతెలిపింది.
స్మగ్లర్లు నకిలీ రుధ్రాక్ష మాలలు ఎర్ర చందనం దుంగలనుండి తయారు చేస్తారు.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.