Editorial

Saturday, November 23, 2024
Opinionజీ–సోనీ విలీనంతో ఏం జరుగుతుంది? - తోట భావనారాయణ

జీ–సోనీ విలీనంతో ఏం జరుగుతుంది? – తోట భావనారాయణ

జీ, సోనీ విలీనం ఇప్పుడు బ్రాడ్ కాస్టింగ్ రంగంలో సంచలనవార్తగా మారింది. దీంతో ఏం జరగబోతున్నదనే చర్చ మొదలైంది.

తోట భావనారాయణ

జీ, సోనీ విలీనం ఇప్పుడు బ్రాడ్ కాస్టింగ్ రంగంలో సంచలనవార్తగా మారింది. దీంతో ఏం జరగబోతున్నదనే చర్చ మొదలైంది. నిజానికి జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (జీల్), సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా (ఎస్ పి ఎన్ ఐ) పరస్పరం లబ్ధిపొందే అవకాశమున్న ఈ విలీనం ప్రభావం ఎలా ఉండబోతున్నదో ఒక చిన్న విశ్లేషణ…

తోట భావ నారాయణ సీనియర్ పాత్రికేయులు. తెలుగునాట టివి జర్నలిజంలో తొలితరం ప్రవేశకులు. ఎలక్ట్రానిక్ జర్నలిజం లోతుపాతులపై, పరిణామాలపై సాధికారిక విశ్లేషకులు.

జీ ఎంటర్టైనెంట్ చానల్స్, సోనీ చానల్స్ కలిస్తే మొత్తం 75 చానల్స్ దాకా ఉంటాయి. అందులో జనరల్ ఎంటర్టైన్మెంట్, మూవీస్, మ్యూజిక్, కిడ్స్, స్పోర్ట్స్ చానల్స్ తో బాటు వివిధ ప్రాంతీయ భాషల చానల్స్ ఉన్నాయి. ఆ విధంగా భారత్ లో అతిపెద్ద గ్రూప్ గా తయారవుతుంది. మొత్తం దేశంలో ప్రేక్షకాదరణ లెక్కల పరంగా చూస్తే 25 నుంచి 30% వాటా ఈ చానల్స్ కే చెందుతుంది. ఇక డిజిటల్ రంగంలోనూ జీ 5, సోనీలైవ్ అనే రెండు ఓటీటీ వేదికలు ఇప్పుడు ఒకే గొడుగు కిందికి వస్తాయి. విలీనం తరువాత సోనీ వాటా 52.93%, జీ వాటా 47.07% ఉంటుంది.

ఇదంతా ఒక వంతయితే, కొద్ది నెలలుగా ఎదుర్కుంటున్న ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి జీల్ ఎండీ, సీఈవో పునీత గోయెంకా ఎదుర్కుంటున్న ఇబ్బంది నుంచి సురక్షితంగా బైటపడతారు. ఆయనను, డైరెక్టర్లను తప్పుకోవాలని డిమాండ్ చేస్తూ వాటాదారు సంస్థ అయిన ఇన్వెస్కో ఇప్పటికే అసాధారణ సర్వసభ్య సమావేశానికి పిలుపునిచ్చింది. ఇలా ఉండగా సోనీ ముందుకు రావటంతో ఇన్వెస్కో నోటికి మూతపడినట్టయింది. పైగా, ఈ విలీనం ఒప్పందంలో భాగంగా పునీత గోయెంకా కొనసాగింపు కూడా స్పష్టం కావటంతో ఇన్వెస్కో తన నోటీసు ఉపసంహరించుకోవటం మినహా చేయగలిగిందేమీ లేదు.

అదే సమయంలో జీ ప్రోమోటర్లు మళ్ళీ పోటీ వ్యాపారం చేయకూడదు. అంటే, ఎంటర్టైన్మెంట్ చానల్స్ పెట్టకూడదు. ఇది కూడా విలీనంలో పెట్టుకున్న షరతు. ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా ఉన్న పునీత గోయెంకా ఐదేళ్లపాటు ఇదే హోదాలో కొనసాగుతారు.

జీ గ్రూప్ ప్రమోటర్లు అయిన సుభాష్ చంద్ర కుటుంబం తనకున్న 4% వాటాలను కొనసాగించుకోవచ్చు. అంటే ఆ వాటాల జోలికి సోనీ వెళ్ళదు. అయితే, అదే సమయంలో జీ ప్రోమోటర్లు మళ్ళీ పోటీ వ్యాపారం చేయకూడదు. అంటే, ఎంటర్టైన్మెంట్ చానల్స్ పెట్టకూడదు. ఇది కూడా విలీనంలో పెట్టుకున్న షరతు. ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా ఉన్న పునీత గోయెంకా ఐదేళ్లపాటు ఇదే హోదాలో కొనసాగుతారు.

ఈ విలీనంలో గమనించాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, రెండిటికీ ఒకే రకమైన చానల్స్ గాని, ప్రేక్షకులు గాని లేకపోవటం. ఉదాహరణకు స్పోర్ట్స్ విషయానికొస్తే, జీ ఇంతకుముందే సోనీకి అమ్మేసి ఉండటం వలన విలీనం అయిన తరువాత రెండు ఒకే రకం చానల్స్ ఉండే అవకాశం లేదు. అదే విధంగా జీ టీవీకి ప్రాంతీయ చానల్స్ చాలా ఉండగా సోనీకి అదొక లోపం. ఆ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో జీకి ఉన్న మార్కెట్ ను సమర్థంగా వాడుకునే వీలుంది. సోనీకి ఎలాగూ పట్టణప్రాంతాల్లో గట్టి బలముంది.

మరీ ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ చానల్స్ తోబాటు మూవీ చానల్స్ కోసం తీసుకున్న సినిమా హక్కులు చాలా విలువైనవి. ఉమ్మడిగా వీటి విలువ మరింత పెరుగుతుంది.

జీ కి స్పోర్ట్స్, కిడ్స్ చానల్స్ లేవు. సోనీ ఇప్పుడు స్పోర్ట్స్ లో భారత్ లో రెండో అతి పెద్ద బ్రాడ్ కాస్టర్. అదే విధంగా సోనీ యాయ్ పేరుతో కిడ్స్ చానల్ ఉంది. మరాఠీ తప్ప సోనీ కి ప్రాంతీయ మార్కెట్ లేదు. జానీ జీ గ్రూప్ కి చెందిన జీ తెలుగు, జీ కన్నడ చానల్స్ అఖిల భారత స్థాయిలో కూడా టాప్ 10 లో ఉండటం గమనార్హం. మరాఠీ, బంగ్లా, తమిళ్, మలయాళ చానల్స్ గణనీయంగానూ, ఒడియా, భోజ్ పురీ, పంజాబీ ఒక మోస్తరుగానూ ప్రేక్షకాదరణ సంపాదించుకున్నాయి.

మరీ ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ చానల్స్ తోబాటు మూవీ చానల్స్ కోసం తీసుకున్న సినిమా హక్కులు చాలా విలువైనవి. ఉమ్మడిగా వీటి విలువ మరింత పెరుగుతుంది. హిందీ మూవీ విభాగంలో జీ కి తొమ్మిది ఎస్ డి, హెచ్ డి చానల్స్ ఉండగా సోనీకి మూడు ఎస్ డి, హెచ్ డి చానల్స్ ఉన్నాయి. ఆ విధంగా రెండూ కలిశాక సినిమా మార్కెట్ లో 50% వాటా పొందుతాయి. సినిమా నిర్మాణంలోనూ రెండు సంస్థలూ ఉన్నాయి. జీ టీవీకి జీ స్టూడియోస్ ఉండగా సోనీకి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఉంది. దానివలన భవిష్యత్తులో మరిన్ని ఓటీటీ సినిమాలు నిర్మించుకునే అవకాశముంది.

రెండు చానల్స్ సంపాదించుకునే లాభాలు ప్రస్తుతం ఏడాదికి 1500 కోట్ల వరకు ఉండగా, విలీనం వలన కనీసం 20% పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఇక ఓటీటీ విషయానికొస్తే, జీ 5 కు, సోనీ లైవ్ కు చెప్పుకోదగిన స్థాయిలో ప్రేక్షకులున్నారు. జీ 5 కు నెలవారీ సగటు వాడకం దారులు 8 కోట్లమంది ఉండగా సగటు వీక్షణ సమయం 190 నిమిషాల దాకా ఉంది. సోనీ లైవ్ కు సగటు నెలసరి వాడకం దారులు 20 కోట్లకు పైగా ఉండగా సగటు వీక్షణ సమయం 75 నిమిషాలుగా నమోదైంది. వీడియో వ్యూస్ దాదాపు 400 కోట్లకు పెరిగాయి.

రెండు చానల్స్ సంపాదించుకునే లాభాలు ప్రస్తుతం ఏడాదికి 1500 కోట్ల వరకు ఉండగా, విలీనం వలన కనీసం 20% పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. విలీనం వార్త రాగానే జీ ఎంటర్టైన్మెంట్ వాటా ధర 39% పెరిగింది. ఇంకోవైపు వచ్చే ఏడు ఐపీఎల్ వేలం మరింత పోటాపోటీగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి.

(ఫేస్ బుక్ సౌజన్యంతో )

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article