నేడు సెప్టెంబర్ 6వ తేదీ
క్రీ.శ 1260 సెప్టెంబర్ 6 నాటి కొండలేరు (ప్రకాశంజిల్లా) శాసనంలో కాకతీయ గణపతిదేవుని పాలనలో శ్రీమన్మహామండలేశ్వర భీమరాజు పెద్దను దేవమహారాజు కమ్మనాటిలోని గ్రామంలో (పేరు నశించిపోయినది) గౌరీశ్వర దేవర అఖండ దీపానికి దానమేదో యిచ్చినట్లుగా చెప్పబడ్డది. శాసన శిల శిధిలమైనందున యితర వివరాలు తెలియరావడంలేదు. [నెల్లూరు జిల్లా శాసనాలు III పొదిలి 7].
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణ కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా