Editorial

Saturday, November 23, 2024
Audio Columnపద్యం వంటి మనిషికి పుట్టినరోజు శుభాకాంక్షలు

పద్యం వంటి మనిషికి పుట్టినరోజు శుభాకాంక్షలు

పద్యమై కదిలే పురుషోత్తం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు

సాహిత్య ప్రక్రియలో విశిష్టమైన పద్య ప్రశస్తిని గుర్తించిన కోట పురుషోత్తం గారు తిరుపతి నివాసి. సులభంగా తాత్పర్యం బోధపడేలా ఉండే అనేక పద్యాలను వారు ఎంచుకుని, కొందరితో ప్రత్యేకంగా రాయించి మరీ వాటిని తానొక నిధిగా సమకూర్చుకున్నారు. రాగయుక్తంగా వాటిని ఆలపిస్తూ విద్యార్థుల మనసులో నాటుకునేలా చేయడంలో ఎంతో విశేష అనుభవం గడించారు. నిజానికి వారు పద్యం కోసమే కదలడం జీవన శైలిగా చేసుకున్నారంటే అతిశయోక్తి కాదు. వందలాది పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి కొన్ని వేల మంది బాలబాలికలు, యువతీ యువకుల్లో పద్యం పట్ల ఆసక్తిని రగిల్చే స్వచ్ఛంద కర్యాచరణలో వారిలా మరొకరు నిమగ్నమైన చరిత్ర  నేడు ఎవరికీ లేదు. ‘తెలుపు’ కోసం ప్రతో రోజూ ఒక పద్యం అందిస్తూ సామజిక మధ్యమం ద్వారా కూడా తాను పలువురి దరికి చేరుకున్నారు. నేడు వారి జన్మదినం. ఈ సందర్భంగా వారికి ఆత్మీయ పుట్టినరోజు తెలుపుతూ మరొక పద్యం పంచుతున్నాం.

తనను తాను ఎరుగి ఇరుగు పొరుగు వారి హితం కోరే మహనీయులను అభినందిస్తూ కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు రాసిన ఈ పద్యం శ్రీ కోట పురుషోత్తం గారికీ చక్కగా నప్పుతుంది. వారి గళంలో వినండి. అభినందించండి.

More articles

1 COMMENT

  1. పద్యం పురుషోత్తం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు 💐💐

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article