తారీఖు జూన్ 23
క్రీ.శ 1542 జూన్ 23 నాటి చిడిపిరాల (కడప జిల్లా) శాసనంలో అచ్యుతదేవరాయల పాలనలో ఘండికోట సీమ సుంకరులైన మల్లయ, వోబులయ్య, యల్లయలు తమ సుంకస్థానమైన చిడిపిరాల గ్రామ కట్నమును, మగ్గస్థావరాలను, రామడిసిధ్ధాయం (?), గొల్లసిధ్ధాయం, ఉప్పరిసిధ్ధాయం, గానుగసిధ్ధాయంల ద్వారా వచ్చే ఆదాయాన్ని అగస్త్యేశ్వర దేవర అఖండదీపాని (తిరువళిగ)కి త్రికరణశుద్ధిగాను, త్రవాచకంగాను యిచ్చినట్లుగా చెప్పబడ్డది. [కడప జిల్లా శాసనాలు II నెం.137].
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్య కుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణా కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.