అందరూ అమ్మల గురించే కీర్తిస్తున్నపుడు తండ్రీ నిన్ను దలంచి అని మేల్ కొలుపు పాటలు పాడి తండ్రి అనే అమూర్త భావన పట్ల ఏ మాత్రం గౌరవం ప్రత్యేకంగా వ్యక్తిగతనుభవానికి సంబందించి లేని నన్ను కూడా మెప్పించిన అరుణ్ సాగర్ని ఫాదర్స్ డే న ఒక సారి గుర్తుచేసుకోవాలని ఒక మెమరింపు..
స్ట్రీమ్ ఆఫ్ కాన్షియన్ నెస్ ఒక జాతీయగీతమనీ, ట్రేసీ చాప్మన్నూ స్టీవ్ వండర్నూ ఏకకాలంలో ప్రేమించేయవచ్చనీ, స్టార్ట్ కావడానికి నీకు నువ్వే ఎంటర్ కొట్టుకుని అకేలా చెలాయించాలనీ, ఆక్టోపస్ కూ సెల్సియస్ కూ తరంగ దైర్ఘ్యం కొలవవచ్చనీ ఒక వైపు చెపుతూనే పేదరాశి పెద్దమ్మ వద్దన్న దిక్కుకే మన ప్రయాణమనీ, తారు రోడ్డుకు అడ్డం పడి ఎండ మరణించిందనీ, కరెంటు కుంచె మెరుపుకలై నిద్దరకొసకి నిప్పంటిస్తుందనీ, విండోస్ 2002 లోపలి బాజీ డాట్ కామ్ వంటి చింతూరు సంతలో తడి స్వప్నాలను అమ్మే ద్రుశ్యాలను కూడా మరోవైపు చూడగల తరపు జీవన విధానం అరుణ్ సాగర్ కవిత్వం.
కొన్ని కచ్చితమైన, స్పష్టమైన వ్యక్తీకరణలకు క్లీషేలను మించిన మాటలుండవు.
అరుణ్ సాగర్ రాతలు చదివిన తరువాత ఒక నలిగిపోయిన మాటనే మళ్లీ మళ్లీ కొత్తగా చెప్పక తప్పదనిపిస్తోంది. అరుణ్ సాగర్ ది కవిత్వం మాత్రమే కాదు. అదొక ఆలోచనా విధానం.
క్లీషేగా చెప్పాలంటే ఒక తరం జీవన విధానం.
అప్పుడెప్పుడో కవిత్వాన్ని ఏదీకాదన్న నా మాటను నేనే మార్చేసి ఇపుడు అరుణ్ సాగర్ మెట్రోసెక్సువాలిటీనీ, గిరిజన గోదారి గుండెచప్పుడునూ రుచి చూసిన తరువాత అన్నీ అవును అని అనక తప్పదేమో అనిపిస్తోంది.
మాగ్జిమమ్ రిస్క్ తీసుకుని మ్యూజిక్ డైస్ అంటూ పాటల రాగాలు తీస్తున్నపుడు అనూ అగర్వాల్ మీది ప్రేమ మొదలుకుని ప్రెస్ క్లబ్ లో మందు కొట్టడం వరకూ దేన్నీ డిజోన్ చేసుకోనవసరం లేదనే నిజాన్ని మర్యాదల గోడలు దూకని ప్రపంచానికి అర్దం చేసే వ్యర్ద ప్రయత్నం జరుగుతుందా అనే అనుమానం కలుగుతుంది. ప్రతిపదార్దాల బరిదాటి కాటాక్రెసిస్ విశ్లేషణ లోకి దూకేయాల్సొస్తుందేమోననిపిస్తోంది.
ఒక డిజిటల్ కలైడోస్కోప్ ని విశాలంగా కళ్ల ముందుపరిచి దాని లోపలి హిందీ తెలుగు ఇంగ్లీషు్ పదాల గాజుముక్కలను గిరాగిరా తిప్పే నిత్యచాలన యంత్రాన్నొకదాన్ని అమర్చి పిల్లిగడ్డంమాటున దొంగనవ్వుగా దాక్కున్నాడు అరుణ్ సాగర్.
ఒక డిజిటల్ కలైడోస్కోప్ ని విశాలంగా కళ్ల ముందుపరిచి దాని లోపలి హిందీ తెలుగు ఇంగ్లీషు్ పదాల గాజుముక్కలను గిరాగిరా తిప్పే నిత్యచాలన యంత్రాన్నొకదాన్ని అమర్చి పిల్లిగడ్డంమాటున దొంగనవ్వుగా దాక్కున్నాడు అరుణ్ సాగర్.
భాషను ఎంచుకోవడంలో సాగర్ సారాన్ని అధిగమించే మార్గాన్నే అనుసరించాడు.
అండర్ స్టేట్మెంట్లో అసాధ్యం అనిపించే కండెన్సేషన్ సాగర్ వాక్యం.
అధిక్షేపానికి బైబిల్ శైలినీ, ప్రేమకు రోజువారీ ఇంగ్లీషునూ, నాస్టాల్జియాకు యూఫెమిజాన్నీ, కన్ఫెషన్ కు సాఫ్ట్ వేర్ మాట్రిక్స్ జార్గన్ నూ వాడుకున్నాడు.
డిక్షన్, భావం, భాష, వ్యక్తీకరణ, అస్పష్టీకరణ ఒక దానిలో ఒకటి ఇన్నరింపోజ్ అయిన ప్రత్యేక సందర్బం సాగర్ కవిత్వం.
అండర్ స్టేట్మెంట్లో అసాధ్యం అనిపించే కండెన్సేషన్ సాగర్ వాక్యం.
ఒక తరపు జీవన విధానాన్ని కవిత్వంగా ప్రకటించడం యూరోపియన్ సాహిత్యంలో జరిగిందే కానీ నాకు తెలిసిన మేరకు తెలుగులో లేదు.
ప్రతితరంలోనూ కొన్ని వర్గాల లేదా సమూహాల ఆలోచనా ఆకాంక్షా విధానాలు మాత్రమే తెలుగులో కవిత్వంగా వినవచ్చాయి. ఆయా సమూహాల బలాబలాలను బట్టి ఉద్యమాలుగానో ధోరణులుగానో ఆ విధానాలు వెలిగాయి. ఇప్పటివరకు చాలా మంది చెప్పిన విషయాల మీది ముసుగులను తొడుగులనూ
సాగర్ తీసిపారేసాడన్న చేదునిజాన్ని కాదనడం కష్టం. సాగర్ తనదైన ఒక డిక్షన్ ను స్రుష్టించుకున్నాడు. ఏకంగా తనదైన భాషను కూడా తయారు చేసుకున్నాడు.
పదబంధాలతో కాక పదాలతోనే సాగర్ కవిత్వాన్ని స్రుష్టించాడనీ, భాషను కవిత్వ మూలపదార్దంగా కాక భాషనే కవిత్వంగా మలచాడనీ తెలిస్తే ఆశ్చర్యం కలగదు. యాజిట్ హాపెన్స్ గా తన కవిత్వం ఉంటుందని చెప్పిన సాగర్ కవిత్వం నిజానికి యాజిట్ ప్రొనవున్స్డ్ డ్ గా తనను తాను
మార్చుకుంది.
జ్నాపకాలంటే భయం లేదని అబద్దాలు చెపుతాడు. నిజానికి వాటినే నెమరేసుకుంటూ గతంలోకే నడిచాడు. తన ఫ్లాష్ బాక్ లను ఫ్లాష్ ఫ్రంట్ లవనివ్వలే.
దేన్ని దానిగా మాత్రమే వ్యక్తీకరించి కవిత్వం చేయడం చాలా కష్టం. దుఖ్కమూ కన్నీళ్లూ వేదనా వంటి ముడిసరుకును వాడడం ఇష్టం లేనపుడు మరీ మరీ కష్టం. నాకు నచ్చే ప్రోజ్ కూ పోయెంకూ తేడా ఉండకూడని తనం సాగర్ కూ ఇష్టం. ఇలా ఉంటే ప్రోయెం అనాలి ఎవరు రాసినా.
జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అనే సనాతన విశ్వాసాన్ని తిరస్కరిస్తూ ఏకకాలంలో అనేక విషయాలను ఆస్వాదించి అవగాహన చేసుకోవాలనే తరపు ఆలోచనా విధానానికి సాగర్ కవిత్వం అచ్చమైన ఉదాహరణ.
జ్నాపకాలంటే భయం లేదని అబద్దాలు చెపుతాడు. నిజానికి వాటినే నెమరేసుకుంటూ గతంలోకే నడిచాడు. తన ఫ్లాష్ బాక్ లను ఫ్లాష్ ఫ్రంట్ లవనివ్వలే.
అల్లికలూ కుట్లూ లేని అన్కాన్షస్ భాషనే చెప్పడమే సాగర్ ఫాం. ఫామ్ పట్ల స్రుహలేనట్లు నటిస్తాడు కానీ ఫాం పట్ల విపరీతమైన మోహం. ఆ స్రుహనుంచే జాన్ కీట్స్ కు కాజోల్ ను హిందీలో పరిచయం చేస్తాడు.
సాగర్ ఒక స్ట్రీమ్ అఫ్ అన్కాన్షెస్ నెస్, స్రుహతో భావాలను చెక్కడం కాక ఇమేజరీ అల్లికలూ కుట్లూ లేని అన్కాన్షస్ భాషనే చెప్పడమే సాగర్ ఫాం. ఫామ్ పట్ల స్రుహలేనట్లు నటిస్తాడు కానీ ఫాం పట్ల విపరీతమైన మోహం. ఆ స్రుహనుంచే జాన్ కీట్స్ కు కాజోల్ ను హిందీలో పరిచయం చేస్తాడు.
కాజోల్ నూ ట్రేసీ చాప్మన్ నూ ఒకే గుండెతో పిల్లా అని పిలవగల సెపియస్ మోడర్నికస్ అరుణ్. మెట్రో సెక్సువల్ నని అర్దాన్నీ అపార్దాననీ రంగరించి ఆపాదించిన వర్డ్ స్పై చెపుతాడు కానీ కూనవరం గోదావరిలో ఆదివాసీతనం మునిగిపోవడాన్ని సహించలేని తనం, చింతూరు సంతనూ, వాన చినుకులలో సరస్సులోకి వెళ్లడమంటే మాత్రమే ఇష్టపడ్డవాడు సాగర్.
అరుణ్ సాగర్ ను మరోసారీ చదవడమన్నామరో మారు చెప్పుకోవడమన్నా ఎవర్ని వారు ఫ్లాష్ ఫ్రంట్ చేసేసుకోవడమే.
సాగర్ ది కేవలం వెంటిలేట్ అయే, షేర్ చేసుకునే, మోహపడే కవిత్వం అన్నది మాత్రమే నిజం.
తనను తాను బిల్ బోర్డ్ లో బ్రోకెన్ యారోగా మాత్రమే మోడెస్టీ పోయాడు కానీ గెలిచిన యుద్దంలో విరిగిన ఆయుధమూ చరిత్రే కదా.
అరుణ్ సాగర్ ను మరోసారీ చదవడమన్నామరో మారు చెప్పుకోవడమన్నా ఎవర్ని వారు ఫ్లాష్ ఫ్రంట్ చేసేసుకోవడమే.
feeling deja vufeeling anamoly of memory