చుట్టూ వున్న స్త్రీలు, వారికున్న పరిధులు, ఆంక్షలు, కట్టుబాట్లను చూసి స్పందించి వేసిన చిత్రాలివి.
నేనామెను కేవలం స్త్రీవాదిగా చిత్రించానని అనుకోనక్కర లేదు, నిజానికి కొన్నిసార్లు స్త్రీలకు స్త్రీలే బంధాలు. కొన్నిసార్లు కాదు, ఆమెకు చాలా సార్లు తనకు తానే బంధం. అందుకే ఇలా చిత్రించాను.
తన ఆలోచనలు, భయాలే ఆమెకు బంధాలు.
వీటిలోంచి స్త్రీలు నిరంతర యత్నంతో బయటకు రావాలనే నా ఆశ, ఆశయం. అదే ఈ బొమ్మలలో చూపడానికి ప్రయత్నించాను.
సమాజపు బంధాలు, కట్టుబాట్ల నుంచి విముక్తి కోసం నిరంతర యత్నంలో ముక్త…