Editorial

Saturday, November 23, 2024
వార్త‌లుఈటెల 'రాజీ'........నామా - BS TALKS

ఈటెల ‘రాజీ’……..నామా – BS TALKS

 

ETELA

ఈటెల ‘రాజీ”….నామా…బీజేపీ తీర్థం…4న ఎమ్మెల్యే పదవికి రిజైన్…కేసీఆర్ ఎత్తుగడకు చిత్తయ్యాడా..??

ఈటెల రాజేందర్ రాజకీయ ప్రస్థానం ఏంటో తేలిపోయింది. ఆయన భారతీయ జనతా పార్టీతో వెళ్లనున్నారు. ఈ మేరకు ఢిల్లీలో అన్నీ మాట్లాడుకుని వస్తున్నారు. అయితే ఆయన కేసీఆర్ పన్నిన వ్యూహంలో చిక్కుకుపోయారా? అష్టదిగ్భంధనం చేయడంతో తప్పనిసరై బీజేపీతో జతకట్టారా?? భూముల వ్యవహారంతో మంత్రి పదవి కోల్పోవడం…కుటుంబమూ ఈ వివాదంలో చిక్కుకోవడంతో తీవ్ర ఒత్తిడిలో ఈటెల ఈ నిర్ణయం తీసుకున్నారా?? సరే ఏది ఏమైనా ఈటెల ఇక బీజేపీ నాయకుడు. నిన్నమొన్నటి దాకా టీఆర్ఎస్ లో నెంబర్ టూ గా ఉన్న ఈటెల నెల తిరిగే లోపు వైరి పక్షంలో చేరిపోయారు. మరి ఇది సరైన నిర్ణయమేనా?? ఓ సారి విశ్లేషిద్దాం.

BS
BS TALKS

ఉద్యమనాయకుడు రాజీ పడి కేంద్ర ప్రభుత్వం పంచన చేరడం జనానికి ఇష్టమా..కాదా..? ఈటెల కేసీఆర్ కు భయపడి …తన భూముల్ని కాపాడుకోవడం కోసం విధిలేక బీజేపీలో చేరాడనే పేరు వస్తే మాత్రం ఈటెల పని అయిపోయినట్లే..

ఈటెల సొంత పార్టీ పెడితే ఎలా ఉండేది! నిజానికి ఈటెల సొంత పార్టీవైపే మొగ్గు చూపారు.కచ్చితంగా సొంత జెండా ఎజెండాతోనే ముందుకు వెళతారని అంతా భావించారు. అయితే కేసీఆర్ తెలివిగా ఈటెల బలం మీద కొట్టారు. ఆయనపై అవినీతి మచ్చ వేయడం, కుటుంబాన్నీ అందులోకి లాగడంతో ఈటెలకు విషయం అర్థమైంది. తనను డీమోరలైజ్ చేసి పార్టీ పెట్టకుండా చేయడమే కేసీఆర్ లక్ష్యం అని అర్థం అయింది. అందుకే ఇక ప్లాన్ బీ మొదలుపెట్టాడు.

కాంగ్రెస్ లో చేరడమా? బీజేపీలో చేరడమా..? ఈటెల ముందుకొచ్చిన అతిపెద్ద సవాల్. కాంగ్రెస్ ఇప్పటికే అంపశయ్య మీద ఉంది. అందులోకి లాగాలని రేవంత్ రెడ్డి లాంటి నేతలు విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే పార్టీ పరిస్థితి అందరికీ తెలిసిందే గనుక ఇక అనివార్యంగా బీజేపీలోకి వెళ్లే ఆలోచన చేశారు.అయితే బీజేపీ తనకు సేఫేనా.?? ఇది ఈటెలకు అర్థం కాలేదు. అందుకే బీజేపీ అధిష్ఠానం దగ్గరకు వెళ్లి మరీ సమాలోచనలు చేశారు. మీరు కేసీఆర్ కు బీటీమ్ లా ఉన్నారు. మిమ్మల్ని నమ్మేదెలా..? ప్రతిపక్షంగా ఉండి కూడా బీజేపీ కేసీఆర్ మీద ఎలాంటి ఆరోపణలూ చేయడం లేదు…ఎందుకు..? కేంద్రంలో వచ్చే ఎన్నికల్లో ఎంపీల బలగం కోసం కేసీఆర్ కు జీ హుజూర్ అంటున్నారా?? ఇవన్నీ గట్టిగానే నిలదీశారు ఈటెల. దాంతో ఇరకాటంలో పడ్డ బీజేపీ వెంటనే కేసీఆర్ మీద దాడి మొదలుపెట్టింది. త్వరలోనే ఆయన్ని జైలుకు పంపిస్తాం అంటూ విమర్శల జడి మొదలుపెట్టారు. ఇవి గతంలో కూడా విన్నాం మనం.. సరే… ఈటెల వీరి మాట నమ్మి రంగంలోకి దిగేశారు.. ఇక్కడ బండి సంజయ్ కేసీఆర్ ను తిడుతుండగా ధైర్యంగా ఈటెల హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు.. వారెవా…ఏం రాజకీయం..ఏం రాజకీయం…

ఇది కేసీఆర్ కు లాభించే పరిణామమేనా? ఖచ్చితంగా….ఎందుకంటే బీజేపీ బలమూ బలహీనతలూ అన్నీ తెలుసు కేసీఆర్ కు.

KCR ETELA

ఇది కేసీఆర్ కు లాభించే పరిణామమేనా? ఖచ్చితంగా….ఎందుకంటే బీజేపీ బలమూ బలహీనతలూ అన్నీ తెలుసు కేసీఆర్ కు. ఆ పార్టీని ఎలా దెబ్బ తీయాలో క్షుణ్ణంగా తెలుసు. అందుకే హుజూరాబాద్ లో ఆల్రెడీ చాలా రోజులుగా చడీ చప్పుడు లేకుండా ఓటరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థుల దాకా అందరినీ మ్యానేజ్ చేశాడు కేసీఆర్. ఇక ఎన్నికల యుద్ధం కోసం కేసీఆర్ కాచుకుని కూర్చున్నాడు.

ఈటెల నాలుగో తేదీన రాజీనామా చేస్తారా ?? చేస్తే గనుక ఎన్నికలు అనివార్యం…ఇక యుద్ధం మొదలైనట్లే. కానీ ఒకే ఒక్క ఎన్నిక దుబ్బాక అతికష్టం మీద గెలుచుకున్న బీజేపీ ఆ తర్వాత హైదరాబాద్ లో అంతంతమాత్రం పోటీ ఇచ్చి నాగార్జున సాగర్ లో అయితే గల్లంతయిపోయింది. కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటే ఇక ఆయన్ని ఎదరించడం ఎంత కష్టమో నాగార్జున సాగర్ ఎన్నిక చూశాం.
సరే…ఈటెల పరిస్థితి ఏంటి హుజూరాబాద్ లో…అదీ చూద్దాం.. ఈటెల కు నిన్నమొన్నటి దాకా సానుభూతి ఉండేది కొంత.. కానీ ఇప్పుడు ఆ స్థాయిలో సానుభూతి ఉంటుందా..? బీజేపీ శ్రేణులు సహకరిస్తాయా..? బీజేపీని అన్నికులమతాలు ఆదరిస్తాయా ?? ఈటెల నిలబడతారా? తన భార్య జమున గారిని నిలబెడతారా? ఈటెలను కేంద్ర స్థాయిలో కూర్చోబెడతారా? ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇస్తారా? ప్రస్తుతానికైతే ఇవన్నీ శేష ప్రశ్నలే…

ఉద్యమనాయకుడు రాజీ పడి కేంద్ర ప్రభుత్వం పంచన చేరడం జనానికి ఇష్టమా..కాదా..? ఈటెల కేసీఆర్కు భయపడి …తన భూముల్ని కాపాడుకోవడం కోసం విధిలేక బీజేపీలో చేరాడనే పేరు వస్తే మాత్రం ఈటెల పని అయిపోయినట్లే..

మరి కేసీఆర్ ఎత్తుగడలన్నీ రెండు దశాబ్దాలుగా తెలిసి తెలిసీ ఎందుకిలా దొరికిపోయాడు…అంటే..సమాధానం మాత్రం ఆయనే చెప్పాలి లేదా కాలమే చెప్పాలి..
చూద్దాం.. రేపటి దాకా…

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article