Editorial

Saturday, November 23, 2024
కాల‌మ్‌ముసలితనం లేని కథ - రావి శాస్త్రి 'మాయ' : ఈ వారం జింబో ‘పెరుగన్నం’

ముసలితనం లేని కథ – రావి శాస్త్రి ‘మాయ’ : ఈ వారం జింబో ‘పెరుగన్నం’

చాలా కథలు ఎప్పుడూ ముసలివై పోవు. వాటి ముఖం మీద ముడతలు పడవు. అవి ఎప్పుడూ నవీనంగా ఉంటాయి అవి ఎప్పుడూ జీవిస్తాయి. ఎప్పుడూ బతికే ఉంటాయి. ఎప్పుడూ ప్రయాణిస్తూ ఉంటాయి, పరుగులు పెడుతూ ఉంటాయి. పాఠకుల మారుతూ ఉంటారు గానీ కథలు మాత్రం నవయవ్వనంతో కనిపిస్తాయి. అటువంటి కథలు కోకొల్లలు. అందులించి ఎన్ని కథలనైనా ఉదహరించవచ్చు. ఈ వారం రావిశాస్త్రి కథను ఉదహరిస్తాను. ఆ కథ పేరు ‘మాయ’.

జింబో

Jimboసాహిత్యంలో నవల, కథా రచయితల కన్నా కవులకి ప్రాముఖ్యం ఎక్కువ. దానికి కారణం మన ప్రాచీన సాహిత్యంలో కవులు రాసిన కావ్యాల్లో కథ ఉండేది , కవిత్వం ఉండేది. నాటకం ఉండేది. నవలాంశం కూడా ఉండేది.

ఆ కాలంలో కవి అనే వాడు మాత్రమే ఉండేవాడు, కథా రచయిత నవలా రచయిత నాటక రచయిత వేరు వేరుగా ఉండేవారు కాదు. ఆ ఒరవడిలో కవికి సాహిత్యంలో ముఖ్య స్థానం ఏర్పడింది. కాలక్రమంలో ఇవి వేరువేరు ప్రత్యేక ప్రక్రియలుగా ఏర్పడిన తర్వాత కూడా కవి స్థానం ప్రముఖంగా ఉండిపోయింది. దీనికి మరో కారణం కూడా ఉంది. ప్రజల నోటికి కవిత్వ చరణాలు గుర్తుండేవి. తిరిగి చెప్పడానికి వీలుగా ఉండేవి. అంతేకాకుండా కవిత్వ చరణాలు పత్రికల్లో పతాక శీర్శికలుగా కొన్ని సందర్భాల్లో అలంకరించడం కూడా అందుకు మరో కారణం.

నిజానికి  ఏ ప్రక్రియ అయినా ముసలితనం రాకూడదు. అవి ఎప్పుడూ నవ యవ్వనంతో ఉండాలి. పడుచుదనంతో ఉండాలి. ఇంకా చెప్పాలంటే పిల్లల మాదిరిగా ఉన్నా పర్వాలేదు. ఆ విధంగా రచనలు ఉండాలంటే ఆ రచనల్లో విశ్వజనీనత ఉండాలి.

అలాగే, చాలామంది నవలకి ప్రముఖమైన స్థానం ఇవ్వాలని, నవలాకారుడికి అందరి కన్నా తొలిగా గుర్తింపు ఇవ్వాలని వాదించే వాళ్ళు ఉన్నారు. నవలల్లో కథ ఉంటుంది, నాటకం ఉంటుంది. కవిత్వం ఉంటుంది సంభాషణలు వర్ణనలు ఇట్లా ఎన్నో ఉంటాయి. అందుకే నవలాకారుడు కి ప్రముఖమైన స్థానం ఇవ్వాలని వాళ్ళ వాదన. ఐతే, కథతో మనిషి జీవితంతో మొదలవుతుందని, కథతోనే మనిషి జీవితం ముగుస్తుందని, కథా రచయితకి అత్యంత ప్రముఖస్థానం ఇవ్వాలని వాదించే రచయితలు ఉన్నారు.

నిజానికి  ఏ ప్రక్రియ అయినా ముసలితనం రాకూడదు. అవి ఎప్పుడూ నవ యవ్వనంతో ఉండాలి. పడుచుదనంతో ఉండాలి. ఇంకా చెప్పాలంటే పిల్లల మాదిరిగా ఉన్నా పర్వాలేదు. ఆ విధంగా రచనలు ఉండాలంటే ఆ రచనల్లో విశ్వజనీనత ఉండాలి. మానవత్వం పట్ల అవి తమ దృష్టిని కేంద్రీకరించి ఉండాలి. అప్పుడే ఆ రచనలు నవనవంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ గుణాలు కథలకు సహజంగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది.

చాలా కథలు ఎప్పుడూ ముసలివై పోవు. వాటి ముఖం మీద ముడతలు పడవు. అవి ఎప్పుడూ నవీనంగా ఉంటాయి అవి ఎప్పుడూ జీవిస్తాయి. ఎప్పుడూ బతికే ఉంటాయి. ఎప్పుడూ ప్రయాణిస్తూ ఉంటాయి, పరుగులు పెడుతూ ఉంటాయి. పాఠకుల మారుతూ ఉంటారు గానీ కథలు మాత్రం నవయవ్వనంతో కనిపిస్తాయి. ఐతే, నవనవంగా ఉండే కథలు కోకొల్లలు. అందులించి ఎన్ని కథలనైనా ఉదహరించవచ్చు. ఈవారం రావిశాస్త్రి కథను కథ ఉదహరిస్తాను. ఆ కథ పేరు ‘మాయ’.

మాయ – ఈ వారం ‘పెరుగన్నం’

ఈ కథలో సీనియర్ న్యాయవాది జూనియర్ న్యాయవాదికి చెప్పిన మాటలు మళ్లీమళ్లీ చదివేలా చేస్తాయి.

“ఇంగ్లీషువాడు మనకి స్థాపించిన న్యాయం అది. ఆకులన్నీ ప్రజలవి. ఆపిల్ పళ్ళన్నీ అధికారులవి. వాళ్ళ దేశంలోనూ అంతే, మన దేశంలోనూ అంతే.  మనకి వాడు చెప్పిన పాఠమే అది. పని కూలి వెధవల్ది. లాభం బుగతది. ఏమైనా అంటే, ఎదురు తిరిగితే మన సాయానికి  కోర్టులున్నాయి, జెయిళ్ళున్నాయి. ఇవి లేకపోతే  ఇంగ్లీషువాడి రాజ్యమే లేదు. ఆఖర్నయినా ఏం చేశాడు? అక్కడా-అక్కడా  చలాయించినట్టు ఇక్కడ కూలి వెధవలు పెత్తనం  చలాయిస్తారేమోనని అనుమానం కలిగింది. వెంటనే సాటి షావుకార్లకి రాజ్యం అప్పచెప్పి చల్లగా తెర వెనక్కి జారుకున్నాడు. గొప్ప మాయగాడు. వ్యాపారం, వ్యాపారంలాగే ఉంది. లాభాలు  లాభాల్లాగే ఉన్నాయి.  ఏదైనా  రొష్తుంటే అదంతా మన వెధవల్దే  అయింది.”

మద్యనిషేధం ఉన్న కాలంలో హెడ్డుకి సారా అమ్మే ముత్యాలమ్మకి గొడవ జరిగి ఆమె మీద తప్పుడు సారా కేసు పెడతారు.

చివరగా ఆ పాత్రలోని ముత్యాలమ్మ తన న్యాయవాది మూర్తి దగ్గర వెళ్లబోసుకున్న సొద హృదయ విదారకమైనది. శ్రీశ్రీ మాటల్లో చెప్పాలంటే one of the great passages in all literature.

మద్యనిషేధం ఉన్న కాలంలో హెడ్డుకి సారా అమ్మే ముత్యాలమ్మకి గొడవ జరిగి ఆమె మీద తప్పుడు సారా కేసు పెడతారు. కొత్తగా న్యాయవాద వృత్తిలో చేరిన మూర్తి ఆమె కేసును వాదిస్తాడు.కేసు గెలుస్తానన్న ఊపులో ఉంటాడు. ఆ సమయంలో ముత్యాలమ్మ ఆయనతో మాట్లాడిన సంభాషణ.

‘అయితే హెడ్డు బాబు సాచ్చీకం తేలిపోయినట్టే కదూ బాబూ’

‘తేల గొట్టేస్తాం, మరేం పర్వాలేదు.’

‘తేల కొట్టేస్తాడనుకున్నాను లే’

‘ఎలా అనుకున్నావు.’

‘ఎలానంటావా, అయితే విను, అయిపోయింది ఏదో అయిపోయినాది కాని మరేటంటావా ముత్యాలమ్మా అనుకోని నిన్న వచ్చినాడు ఎడ్దు బాబు. తేలగొట్టేస్తానంటే కట్నం చదివించుకున్నాను. కోర్టు వారి నిజెం యేరే నిజం బాబు. ఇన్ని సుట్లు వచ్చినాను కదా నాకు బాగా ఎరికె.

వాళ్లకి సాచ్చీకం సరిగా ఉంటే సాన. జవాన్ బాబు లాగే హెడ్డు బాబు కూడా బోనెక్కి గట్టిగా నిలబడి పోతే కేసేటి అవుద్ది బాబు. ఈ సాక్షి దారులు ఒకరి వెనుక ఒకరు బోనెక్కిన ఇద్దరూ కూడబలుక్కుని ఎక్కుతారు ఆయెనక వరండాలో గుమ్మం వోరన నిలబడి ఆడు చెప్పింది ఈడు ఇంటానే ఉంటాడు. కిటికీల కాడ నిలబడి బోనెక్కినోడికి చేతులూపుతూనే ఉంటాడు. దూరంగా పొమ్మంటే ఆళ్ళ మనిషి మరోడు ఆల్లో నిలబడి సాచ్చీకం బాగా ఇని, యెల్లి రెండో సాచ్చి దారులతో చెప్పేస్తాడు. అంచేత, బాబు కోరట్ల అన్నాయాలు నిలబడి పోతాయి. ఒకరి సాచ్చీకం ఒకరు ఇన్నా ఇనకపోయినా సాచ్చిదారులు పోలీస్ బాబులే కదా, తెల్లారి లెగిస్తే ఇలాంటి కేసుల్లో ఎయ్యి కేసుల్లో సాచ్చీకం చెబుతారు.

ప్లీడరుబాబు చేత అడిగించినా, నువ్వయినా ఏటడుగుతావు. ఒప్పుడు టేషనుకాడ బయలెల్లినావు
ఎందుకు బయలెల్లినారు, యూనిఫారాలేసుకున్నారా నడిచెల్లారా, సైకిళ్ళమీదెళ్ళారా, మడిసిని తొల్త మీరందర్ల ఒవరు సూసినారు, సారా కొలిసినారా, వోసన సూసినారా, సారా కొట్లయినా సెకింగ్ సేసినారా … ఇయ్యే కదా బాబూ… నువ్వయినా అడగాల… ఆల్లకివన్నీ కొట్టిన పిండి. అంతా ఇన్నాక ‘ సాచ్చీకం సరిగుంది, తేడానెట్నేవు … ఉన్నా అయి శానా సిన్నయి.

అంచేత జరిమానా కట్టలేకపోతే జైలుకు ప అంటాడు మేస్ట్రీటు బాబు. మూడు సుట్ల మూదబద్దాల కేసల్లా రొండందలు – రగతం రగతం జరిమానా సెల్లించినాను కదా…అంచేత బాబూ ఏటీ సొదని జెప్పి నిన్ననా బాబుకి సదివించుకున్నాను.

అంచేత జరిమానా కట్టలేకపోతే జైలుకు ప అంటాడు మేస్ట్రీటు బాబు. మూడు సుట్ల మూదబద్దాల కేసల్లా రొండందలు – రగతం రగతం జరిమానా సెల్లించినాను కదా…అంచేత బాబూ ఏటీ సొదని జెప్పి నిన్ననా బాబుకి సదివించుకున్నాను. ఉచ్చుకున్నది ఉచ్చుకున్నాడు గానీ ఆ యెనక బోనెక్కి ఏం మాయ జేస్తాడో యేటో అని బయపడతానే ఉన్నాను. తేలగొట్టేసినాడు గదా మరైతే బయం నేదు ..” అని మూర్తికి ధైర్యం చెప్పింది ముత్యాలమ్మ .

ఏటనుకుందో యేవిటో … ‘నువ్వు కూడా గట్టిగా బాగానే అడిగినావు బాబూ, కొత్తోడివని బయపడినాను గాని బాగానే అడిగినావు … నువ్వడుగుతుంటే తొలి సాచ్చిదారు జెవాను బాబు బెజ్జరిల్లిపోనాడు. ఎడ్డుబాబు కూడా నువ్వలా అడగబట్టి తత్తరబిత్తరలాడె .. నానిన్నాను .. సూసినాను … దగ్గరున్నాను గదా … గట్టిగా బాగానే అడిగినావు ‘అని మూర్తిని మెచ్చుకుంది.

మంచు విడిపోయినట్లుగా కేసంత ఎందుకు అంత సులభంగా విడిపోయిందో అర్థమయ్యేసరికి బుంగలో నుంచి గాలి పోయినట్టు చప్పబడి పోయాడు మూర్తి. కేసు కొట్టేసిన తర్వాత డబ్బు ఇవ్వబోయింది ముత్యాలమ్మ. మూర్తికి చాలా సిగ్గు వేసి, ససేమిరా పుచ్చుకోనండి అన్నాడు. చేసేదేమీలేక వణుకుతున్న చేతులతో డబ్బు తిరిగి పట్టుకు వెళ్ళిపోయింది ముత్యాలమ్మ.

మూర్తికి అంతా అసందర్భంగానూ కనికట్టు కట్టినట్టుగాను మాయగాను తోచింది.

సారా అసలు దొరకలేదు. దొరికిందని కేసులు పెట్టారు. దొరకలేదని తిరిగితే కొట్టేశారు. విషయం దొరకలేదు విషయం జరగలేదు. జరగని విషయం జరిగిందన్నారు. జరిగిందని చెప్పబడిన జరగని విషయం జరగలేదన్నారు. లేదు ఉంది లేదు అంతా మాయ చేశారు కాని..

అప్పుడతనికి పెద్ద ప్లీడర్ గారు గుర్తుకొచ్చారు. ఆయన మాయనే తెలుసుకున్నారు బాధను తెలుసుకోలేదు అనుకున్నాడు మూర్తి.

ముత్యాలమ్మ గురించి ఆలోచిస్తూ…
ఈ మాయ మధ్య ఎంతటి బాధ అనుకున్నాడు మూర్తి.

అప్పుడతనికి పెద్ద ప్లీడర్ గారు గుర్తుకొచ్చారు.
ఆయన మాయనే తెలుసుకున్నారు
బాధను తెలుసుకోలేదు అనుకున్నాడు మూర్తి.
నిజంగా తెలుసుకో లేదా ?పట్టించుకోలేదా? మాయా ప్రపంచంలో ముత్యాలమ్మ లాంటి వారు ఉన్నారని ఆయనకు తెలియదా ?
తెలీదు.
గుడ్ గాడ్ ఎందుకు తెలియదు .
తెలిసి పట్టించుకోలేదు.
అంతే.

రావి శాస్త్రి గారు ఈ కథ రాసి దాదాపు 60 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ ఈ కథ కొత్త గానే ఉంది. దానికి కారణం-ముత్యాలమ్మ బాధని రావి శాస్త్రి గారు మనకు చూపించడమే.

అందుకే- మంచి కథలకి వయసు రాదు. అవి నవనవోన్మేషంగా ఉంటాయి, మానవత్వాన్ని పట్టుకున్నప్పుడు. ఆ మాటకొస్తే ప్రతి రచనకీ ఇది వర్తిస్తుంది

ఎములాడ ‘రాజేందర్’ పరిచయం

‘జింబో’ కలం పేరుతో సాహితీ లోకానికి చిరపరిచితులైన మంగారి రాజేందర్ కవీ, కథకులు. సామాన్యుల పక్షాన న్యాయ వ్యవస్థపై అనేక రచనలు వెలువరించిన ‘తరాజు’. తెలుపు కోసం ప్రతి ఆదివారం ‘కథా కాలమ్’ రాస్తున్నారు. వారి e-mail: rajenderzimbo@gmail.com

తొలి వారం కథనం ఇక్కడ క్లిక్ చేసే చదవవచ్చు. 2 వ వారం, ఆ రాత్రి అన్నం ముందు కూర్చున్నప్పుడు. ౩ వ వారం ఒక కథ ఎలా రూపు దిద్దుకుంది!.  4 వ వారం గుల్జార్ చెప్పిన కథ. 5 వ వారం పిల్లలే నయం. 6 వ వారం కథనం ఇది…కథలు దృక్పథాలని మారుస్తాయా? 7 వ వారం అమరావతి కథలు తెలుపు. 8 వ వారం పాల్ కొహెలో ‘పెన్సిల్ కథ’. 9 వ వారం ‘పదాల పాఠం’. 10వ వారం ‘మరణించని కథకుడు సాదత్ హసన్ మంటో’ పరిచయం. 11వ వారం దిగ్బ్రమకి గురి చేసే ‘ఖోల్ దేవొ’ : ‘మంటో’ కథా వైనం. 12 వ వారం కథ వెనుక కథ. 13 వ వారం మునిపల్లె రాజు చెప్పిన ‘ఆ బోగం మనిషి’ కథ. 14 వ వారం సందేహాలు కలిగించే కథ. 15 వ వారం గుల్జార్ కథ ‘మగాడు’. 15 వ వారం కథల్లో రచయిత గొంతు: వట్టికోట ఆళ్వారు స్వామి. 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article