వారు అనేక సందర్భాలలో కమ్యూనిస్ట్ మహిళలు అందరూ తలోదారి అయి పోయామనీ, ఇందుకేనా ఎన్నో కష్ట నష్టాలు అనుభవించి మేము పార్టీ లో పనిచేసింది అని ఆవేదన చెందేవారు
టి ఎం ఉషా రాణి
మల్లు స్వరాజ్యం గారు తనను తాను గొప్ప వీర మరియు ధీర వనితగా తీర్చిదిద్దుకున్న విశిష్ట విప్లవ పోరాట యోధురాలు. ఇపుడు వున్న పరిస్థితులను బట్టి అలాంటి వారు మన సమాజానికి చాలా అరుదుగా దొరుకుతారు అని నా అభిప్రాయం. వారు భౌతికంగా మన మధ్య లేకపోయినా, వారి పోరాటాలు, త్యాగాలు చిరస్మరణీయంగా, స్ఫూర్తి దాయయకంగా వుండి తీరతాయి.
వారు అనేక సందర్భాలలో కమ్యూనిస్టులు విడిపోవడం వల్ల పార్టీలో ఒకే కుటుంబంగా కలిసి మెలిసి పోరాటాలలో పాల్గొన్న కమ్యూనిస్ట్ మహిళలు అందరూ తలోదారి అయి పోయామనీ, ఇందుకేనా ఎన్నో కష్ట నష్టాలు అనుభవించి మేము పార్టీ లో పనిచేసింది అని ఆవేదన చెందేవారు. కమ్యూనిస్టులు అందరూ కలవాలని గాఢంగా కోరుకొనేవారు.
వారి ఈ న్యాయమైన కోరిక వారి జీవితకాలంలో సఫలం కాలేదు. వారి కోరిక, ఆశయ సాధన దిశగా పనిచేయడమే సరైన నివాళి.
వారి కోరిక, ఆశయ సాధన దిశగా పనిచేయడమే సరైన నివాళి.
వారు తన జీవితాన్ని పూర్తిగా జీవించారు. జీవితాంతం సమాజం కోసమే జీవించారు. పుట్టటం ఎంత సహజమో, మరణించడం కూడా అంతే సహజం. అందుకే కేవలం విచారాలు, సంతాపాలకే పరిమితం కాకుండా వారి జీవితం రానున్న తరాలకు, ముఖ్యంగా మహిళాలోకానికి స్ఫూర్తివంతంగా, ఆదర్శవంతంగా, మార్గదర్శకంగా ఉండేలా వారి పరిపూర్ణ జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి.
మల్లు స్వరాజ్యం గారికి వినమ్ర నివాళి