Editorial

Sunday, November 24, 2024
ఆనందంనా ఆత్మీయ ఆహ్వానం - మీ అనిల్ బత్తుల

నా ఆత్మీయ ఆహ్వానం – మీ అనిల్ బత్తుల

గతకాలం తాగిన మద్యాన్ని తలుచుకుంటే ఇప్పుడు కైపెక్కింది.

నన్ను కలిసిన నా ప్రియురాళ్లని నేను కలిసిన వేశ్యలను తమ హృదయాల్ని పరిచిన స్నేహితురాళ్ళని స్మరించుకుంటూ కుట్టుకున్న విస్తరాకు ఈ ‘మధుశాల’.

సాయంత్రం 6.00 గం సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరణ. మీకిదే ఆత్మీయ ఆహ్వానం.

 అనిల్ బత్తుల

కవిత్వ రహస్యం నాకు తెలియదు. ఇలా కవిత్వం రాస్తానని ఎప్పుడూ కలలో కూడా అనుకోలేదు.

సంవత్సర కాలం క్రితం హైదరాబాద్ నగరాన్ని విడిచిపెట్టాను. జన సమ్మర్థం నుండి నిరంతర రణగొణ ధ్వనులనుండి క్షణం తీరికలేని దైనందిన జీవితం నుంచి అకస్మాత్తుగా తప్పుకున్నాను. ఎవరో మంత్రించినట్లుగా నా చుట్టూ ఉన్న ప్రపంచం ఒక్కసారిగా నిర్మానుష్యమైంది. అంతా నిశ్శబ్దమయ్యింది.

నా చుట్టూ ఒక చిన్న పల్లెటూరు. ఎప్పుడో కానీ మనుషుల మాటలు వినిపించవు. వీధులు నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉంటాయి. ఇక్కడ ఉన్న సందడి అంతా మనుషులది కాదు. కాస్త జాగ్రత్తగా గాలిలోకి నిశితంగా చూస్తే ఎర్ర తూనీగలు, చూపుని ఆకుపచ్చమయం చేసే విస్తారమైన చెట్లు, పగలు పలకరించే పక్షులు, రాత్రుళ్లు సంగీత కచేరీ చేసే కప్పలు కనిపిస్తాయి. ఉడుతలు, తూనీగలు, పిచ్చుకలు, పొలాలమీద కొంగలు, గిజిగాళ్ళు నా సావాసగాళ్ళయ్యారు.

ఒంటరి నిశ్శబ్ద రికామీ దినచర్యలో నేను అటకెక్కించిన నా పాత డైరీలను తెరిచా. అవన్నీ నేను యవ్వన కాలంలో రాసుకున్న రహస్య అనుభవాలు జ్ఞాపకాలు. నగరంలో యవ్వనంలో నేను కలిసిన స్త్రీల ఆనవాళ్లు. ఒక్కొరిని తలుచుకుంటూ ఒక్కొక్క అనుభవాన్ని ఆవాహన చేసుకుంటూ రాసుకుపోయా. గతకాలం తాగిన మద్యాన్ని తలుచుకుంటే ఇప్పుడు కైపెక్కింది.

ఇవన్నీ ఒక ఉన్మాద స్థితిలో ఉండి రాసినవి. కవిత్వం ముందు దిగంబరుడనై నుంచున్నా. తప్పో ఒప్పో ఇదంతా నాదైన జీవితం. రాసుకున్న కవిత్వం.

నన్ను కలిసిన నా ప్రియురాళ్లని నేను కలిసిన వేశ్యలను తమ హృదయాల్ని పరిచిన స్నేహితురాళ్ళని స్మరించుకుంటూ కుట్టుకున్న విస్తరాకు ఈ మధుశాల. నా ఆనందాన్ని, నా దుఃఖాన్ని నా ప్రియురాళ్లను తలుచుకుంటూ రాసుకున్న ఈ కవితలు నా డైరీలలోని జ్ఞాపకాలే.

ఇవన్నీ ఒక ఉన్మాద స్థితిలో ఉండి రాసినవి. కవిత్వం ముందు దిగంబరుడనై నుంచున్నా. తప్పో ఒప్పో ఇదంతా నాదైన జీవితం. రాసుకున్న కవిత్వం. ఇప్పటికీ నాకు కవిత్వ రహస్యం తెలీదు. తెలుసుకోవాలన్న ఆసక్తీ లేదు. కానీ రాస్తూనే ఉంటా.

నేడు, శనివారం 20 నవంబర్ 2021 సాయంత్రం 6.00 గం. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో నా పుస్తక ఆవిష్కరణ జరుగుతుంది. నేను ప్రేమించేవారు, నన్ను ఇష్టపడేవారు, నేనంటే ఇష్టం లేనివారు, స్నేహితులు, కవి మిత్రులు, కథకులు, తెలిసినవారు, తెలియని వారు అందరికీ ఇదే నా ఆత్మీయ ఆహ్వానం.

వక్తలు- విమల, ఉషాజ్యోతి బంధం, ఆదిత్య కొర్రపాటి, ఎం.ఎస్. నాయుడు, సిద్దార్థ, అంబటి సురేంద్రరాజు – అనిల్ బత్తుల.

ఈ ఆహ్వాన పత్రంలోని పై బొమ్మ ప్రఖ్యాత రష్యన్ రచయిత కుప్రిన్ గంబ్రీనస్ కథ కొసం పి.ఇవాషెంకొ చిత్రించినది. ‘గంబ్రీనస్’ అంటే మద్యం తయారు చేసేవాళ్ళ అధిష్టాన దేవత.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article